Lemongrass in Telugu : జలుబు, దగ్గు, జ్వరం, గొంతువాపు, గొంతునొప్పి, మైగ్రైన్…ఇలా సమస్యలు ఏవైనా నిమ్మగడ్డి తో చెక్ పెట్టండి…!2024

Lemongrass in Telugu : జలుబు, దగ్గు, జ్వరం, గొంతువాపు, గొంతునొప్పి, మైగ్రైన్…ఇలా సమస్యలు ఏవైనా నిమ్మగడ్డి తో చెక్ పెట్టండి…!

లెమన్‌గ్రాస్ అనేది మంచివాసన కలిగిన మెుక్క Lemongrass in Telugu . అంతేకాకుండా దీనితో అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. లెమన్ గ్రాస్​ రసం తీసుకుంటే చాలామంచిదని నిపుణులు చెబుతారు. అందం నుంచి ఆరోగ్యం దాకా చాలా ఉపయోగాలు ఉంటాయంటున్నారు.

🍁 మన ప్రకృతిలో అనేక రకాల గడ్డి మెుక్కలు దాగి ఉన్నాయి. అయితే అందులో కొన్నిఅనేక రకాల ఔషధాన్ని కలిగించే మెుక్కలు కూడా ఉంటాయి. అలాంటి జాతికి చెందినదే..ఈ నిమ్మగడ్డి కూడా, ఐతే దీనిని ఆంగ్లములో lemongrass అని పిలుస్తారు. నిమ్మగడ్డి ఆయుర్వేదంగా ఎంతగానో సహాయపడుతుంది. వీటిలో ఉండే ఏరోమాటిక్ ఎసెన్షియల్ ఆయిల్ కారణంగా ఈ మొక్క సువాసనలు వెదజల్లే గుణం కలిగి ఉంటుంది. కొంతమంది ఈ మెుక్కను సూప్‌లు, కూరలు, టీలకు వినియోగిస్తారు. నిమ్మగడ్డి ద్వారా మనకు అనేక ఆరోగ్య ఉపయోగాలు (Health Benefits) ఉంటాయి. సాంప్రదాయ వైద్యంలో శతాబ్దాలుగా వినియోగించబడుతుంది.

🍁 లెమన్ గ్రాస్‌(Lemon Grass)లో విటమిన్లు C , E వంటి యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి కణాలకు హాని కలిగించే, దీర్ఘకాలిక వ్యాధుల అభివృద్ధికి దోహదపడే హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షించడంలో చాల వరకు ఉపయోగపడతాయి . ఈ యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. మొత్తం ఆరోగ్యం, శ్రేయస్సుకు నిమ్మగడ్డి ఎంతగానో సహాయపడుతుంది.

🍁 lemongrass in telugu లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను పుష్కలంగా కలిగి ఉంటుంది నిర్ధారణైంది. ఇది శరీరంలో వాపును తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. ఆర్థరైటిస్ వంటి అనేక రకాల సమస్యల మొదలగు పరిస్థితులతో బాధపడుతున్న వారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

🍁 lemongrass in telugu ప్రశాంతత మరియు విశ్రాంతి లక్షణాలకు బాగా ప్రసిద్ధి చెందింది. ఈ నిమ్మగడ్డి వలన మనం ఒత్తిడి(Stress) మరియు ఆందోళనకు గురైనప్పుడు సమర్థవంతమైన నివారణగా ఇది పని చేస్తుంది. lemongrass in telugu టీ(Lemon Grass Tea) తాగడం వల్ల ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. రిలాక్సేషన్‌గా ఫీల్ అవుతారు.మనం ఈ నిమ్మగడ్డి సువాసనను పీల్చడం వలన మనసుకు ప్రశాంతత అనిపిస్తుంది.

🍁 నిమ్మగడ్డి జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎందుకంటే ఇది ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. నిమ్మగడ్డి జీర్ణవ్యవస్థలో బ్యాక్టీరియా, ఇన్ఫెక్షన్లను నిరోధించడంలో ఉపయోగపడుతుంది.

🍁 లెమన్‌గ్రాస్ బలమైన యాంటీమైక్రోబయల్ లక్షణాలను అధిక మోతాదులో కలిగి ఉంటుంది. లెమన్‌గ్రాస్ బ్యాక్టీరియా, వైరస్ లు, శిలీంధ్రాల శ్రేణికి వ్యతిరేకంగా ప్రభావవంతంగా పని చేస్తుంది. వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులు మరియు క్లీనింగ్ సొల్యూషన్స్‌ ఇంకా చర్మ ఇన్ఫెక్షన్‌లతోపాటుగా చాలా వాటికి లెమన్ గ్రాస్ సహాయపడుతుంది.

🍁 లెమన్‌గ్రాస్ తో టీ తయారుచేసుకొని తాగుతారు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. లెమన్‌గ్రాస్ ని ముక్కలుగా చేసి.. నీటిలో వేసి ఆ నీరు సగం అయేదాకా మరిగించాలి . లెమన్‌గ్రాస్ మరుగుతున్న సమయంలో వాటి నుంచి మంచి సువాసనలు వెదజల్లుతుంది.లెమన్‌గ్రాస్ బాగా మరిగిన తర్వాత.. వడగట్టి గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఆ టీ ని తాగాలి. జలుబు, దగ్గు, జ్వరం, గొంతువాపు, గొంతునొప్పి వంటి మొదలైన సమస్యలతో తోపాటు తలనొప్పి వంటి సమస్యల నుండి సైతం నివారిస్తుంది. లెమన్‌గ్రాస్ని ఎక్కువగా పర్ఫ్యూమ్స్, రూమ్ ఫ్రెష్ నర్స్, డియోడరెంట్, సోప్స్ మొదలైన వాటిలో ఎన్నో రకాలుగా వాడతారు. కొంతమంది రైతులు దీనిని పెంచి.. అధిక మెుత్తంలో ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.

Note : పైన ఇచ్చిన సమాచారం అంతా కూడా మీ అవగాహన కోసం మరియు అంతర్జాలంలో దొరికిన సమాచారం తీసుకోవడం జరిగింది , ఈ లెమన్‌గ్రాస్ అతిగా తీసుకునే వారు వైద్యుల సలహా తీసుకోగలరు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top