Srikrishna Jayanthi : శ్రీ కృష్ణ జన్మాష్టమి అంటే ఏంటి ? పండుగ విశిష్టత ఏంటి ? విధానం ఏంటి ? 2024.
Srikrishna Jayanthi :కృష్ణం వందే జగద్గురుమ్.సృష్టికర్త అయిన మహా విష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీ కృష్ణుడిగా ఎనిమిదవ అవతారమున జన్మించిన కృష్ణ జన్మాష్టమిని “కృష్ణాష్టమి”, “గోకులాష్టమి” లేదా అష్టమి రోహిణి అని పిలుస్తారు.
Srikrishna Jayanthi :ఈ సంవత్సరం స్మార్తులకు ఆగస్టు 23 శుక్రవారం రోజున శ్రీకృష్ణామి. వైష్ణవ సాంప్రదాయ ప్రకారం తేదీ 24 శనివారం రోజు కృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు.స్మార్తులు తిధితో పండగ జరుపుకుంటే ,వైష్ణవులు నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకుని పుజిస్తారు.శ్రీ కృష్ణుడు దేవకి వసుదేవులకు దేవకి ఎనిమిదో గర్భంగా శ్రావణ మాసము కృష్ణ పక్షం అష్టమి తిథి రోజు కంసుడి చెరసాలలో జన్మించాడు.
Srikrishna Jayanthi :మహిమాన్వితమైనటువంటి ఈ కృష్ణాష్టమి రోజున సూర్యోదయానికి ముందే అంటే (ఐదు గంటలకు ) నిద్ర లేచి, తలస్నానము చేసి మడి బట్టలు ధరించాలి.తర్వాత ఇంటిని మరియు పూజా మందిరమును శుభ్రం చేసుకోవాలి.గడపకు పసుపు,కుంకుమ,గుమ్మానికి తోరణాలతో అలంకరణ చేసుకోవాలి. పూజా మందిరములో ముగ్గులు వేసుకోని దీపారాధన చేసుకోవాలి.
ఉపవాస దీక్షలు ..
Srikrishna Jayanthi :కృష్ణాష్టమి రోజున భక్తులు పగలంతా ఉపవాసంతో ఉండి, సాయం కాలం సమయంలో శ్రీ కృష్ణుని పూజిస్తారు. శ్రావణ మాసంలో లభించేటువంటి పళ్ళు, శొంఠి, బెల్లం కలిపిన వెన్న, పెరుగు, మీగడ స్వామికి నైవేద్యంగా పెడతారు. ఊయలలు కూడా కట్టి అందులో శ్రీకృష్ణ విగ్రహాల్ని పడుకోబెట్టి ఊపుతూ, రకరకాల పాటలు, కీర్తనలు పాడతారు. వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీపడుతూ వాటిని కొడతారు. అందుకే ఈ పండుగని ‘ఉట్ల పండుగ’ లేదా ‘ఉట్ల తిరునాళ్ళు’ అని కూడా పిలుస్తారు.
పసుపు, కుంకుమ, గంధము, పుష్పాలతో ..
Srikrishna Jayanthi :పూజకు ఉపయోగించేటువంటి కృషుడి పటములకు పసుపు, కుంకుమ మరియు గంధము, పుష్పాలతో అలంకరించుకోవాలి. పూజగదిలో ఓ మందిరమును ఏర్పాటు చేసుకుని శ్రీ కృష్ణుడు రాధతో కలిసి ఉన్న ఫోటోను గానీ, ప్రతిమను ఉంచుకోవాలి . ఇంతలో పూజకు పసుపు రంగు అక్షింతలు, కదంబ పుష్పములు, తులసిమాల, సన్నజాజులతో మాల, నైవేద్యానికి పానకం, వడపప్పు, కమలాకాయలు వంటివి సిద్ధం చేసుకోని పెట్టుకోవాలి.
దీపారాధాన ..
తదనంతరం మధ్యాహ్నం 12 గంటలకు పూజను ప్రారంభించాలి. కంచుదీపంలో కొబ్బరినూనె పోసి, ఐదు దూది వత్తులతో దీపమెలిగించాలి. దీపారాధనకు ఆవునేతితో హారతి సిద్దం చేసుకోవాలి. మన నుదుటన సింధూరంను పెట్టుకొని , తూర్పు వైపునకు తిరిగి, “ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించుకోవాలి. భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతిని వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణ దానం చేసిన ఫలం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం చెప్పిడం జరిగింది. కలియుగంలో కల్మషాల్ని హరించి, పుణ్యాల్ని ప్రసాదించే పర్వదినం ఇదని కూడా వివరించడం జరిగింది.
దీక్షతో దక్షత:
కృష్ణాష్టమి రోజున ఒక పూట భోజనంను చేసి, శ్రీకృష్ణునికి పూజ చేసి, శ్రీకృష్ణ దేవాలయాలు మరియు మఠములను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్య ఫలం సిద్ధిస్తుందని పురాణాలు చెప్పబడ్డాయి. ఆలయాల్లో కృష్ణ అష్టోత్తర పూజ, కృష్ణ సహస్ర నామా పూజ చేయించుకునే వారికి వంశాభివృద్ధి,అష్టైశ్వర్యాలు చేకూరతాయి.ఈ రోజున కృష్ణుడిని పూజిస్తే సకల పాపాలు నశిస్తాయని, ధర్మార్థ కామ మోక్ష ప్రాప్తి కలుగుతుందని స్కంధ పురాణంలో చెప్పడం జరిగింది.
సంతానం లేని వారు, వివాహం కావాల్సిన వారు ఈ పర్వదినం రోజున బాల కృష్ణుడిని సంతాన గోపాల మంత్రంతో జపిస్తూ, పూజిస్తే అనుకున్నది నెరవేరుతుంది. ఓం నమో నారాయణాయ, నమోభగవతే వాసుదేవాయ సర్వం శ్రీకృష్ణ చరణార విందార్పణమస్తు!
గోకులాష్టమి దినాన ఇంటికి వచ్చే స్త్రీలకు తాంబూలముతో పాటు శ్రీ కృష్ణ నిత్యపూజ పుస్తకాలను అందజేస్తే, సకల సంపదలు సిద్ధిస్తాయని విశ్వాసం.
హిందూ సంప్రదాయంలో కృష్ణుని ప్రత్యేకతే వేరు. తల్లులకు బాలకృష్ణునిగా, చిన్నవారికి చిలిపి కృష్ణునిగా, స్త్రీలకు గోపికా వల్లభునిగా, పెద్దలకు గీతాకారునిగా… ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన కొలువై ఉంటాడు.అందుకే కృష్ణుని జన్మదినం అంటే మన ఇంట్లో మనిషి పుట్టినరోజు అన్నంత ఘనంగా నిర్వహించుకుంటాం.
కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం. అందుకని మనం చేసే పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి దళాలను వేసుకుంటే, మంచిదని చెబుతారు. ఆయన ప్రతిమను కూడా తులసిమాలతో అలంకరించమని చెప్తుంటారు. కృష్ణునికి పొన్నచెట్టుతోనూ అనుబంధం ఉంది. వీలైతే ఆ పొన్న పూలతో ఆయనను పూజిస్తే కూడా మరి మంచిది.
ఆయనకు ఇష్టమైనటువంటి తెలుపు రంగు లేదా పసుపు రంగులతో ఉన్నటువంటి పూలతో పూజించినా శుభమే కల్గుతుంది.! కృష్ణాష్టకమ్, కృష్ణ అష్టోత్తరం వంటి స్తోత్రాలను చదువుతూ, పరిమళభరితమైన పుష్పాలతో ఆయనను అర్చించాలి.పూజించాలి.
కృష్ణాష్టమి రోజు పూజతో పాటుగా ఆయన స్మరణ కూడా ముఖ్యమే! ఆ గోపాలుని వైభవాన్ని తెలియచేసే భాగవతం, భగవద్గీతలను ఈ రోజు ఎంతో కొంత పఠించుకోవాలి. అలా కృష్ణుని తలుస్తూ, కొలుస్తూ, భజిస్తూ కృష్ణాష్టమి రోజు రాత్రిని గడపాలి. శ్రీ కృష్ణుడు అర్ధరాత్రిన జన్మించాడు కాబట్టి, కొందరు రాత్రివేళ్లే కృష్ణపూజ చేస్తారు.
అలా కృష్ణుని పూజించాలనుకునే ప్రదేశంలో బియ్యంను పోసి, దాని మీద ఒక మట్టి కుండను పెడతారు. ఆ కుండ మీద కృష్ణుని ప్రతిమను ఉంచి, పూజని నిర్వహిస్తారు. అర్ధరాత్రి సమయంలో శంఖంలో నీటిని తీసుకుని చంద్రునికి మరియు కృష్ణునికి అర్ఘ్యమిస్తారు. మర్నాడు ఉదయాన్నే దగ్గరలోని వైష్ణవాలయాన్ని దర్శించి ఉపవాసాన్ని విరమిస్తుంటారు.