HYDRA : హైడ్రా ఆక్షన్….నాగార్జున N కన్వెన్షన్ కూల్చివేత…2024

HYDRA : హైడ్రా ఆక్షన్….నాగార్జున N కన్వెన్షన్ కూల్చివేత…

హైదరాబాద్ HYDRA నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా తన ఆక్షన్న్ని చాల పకడ్బందీగా అమలు చేస్తుంది. హైడ్రా తో ఇప్పటికే అనేక నిర్మాణాలు కూల్చేసిన ఆఫీసర్లు.. ఐతే ఇప్పుడు తాజాగా మాదాపూర్‌లోని హీరో నాగార్జునకు చెందిన N కన్వెన్షన్ సెంటర్‌కు కూడా హైడ్రా ఆక్షన్ కి గురైంది చెరువును కబ్జా చేసి ఈ సెంటర్ నిర్మించారన్న ఆరోపణలతో కూల్చివేతలు మొదలుపెట్టారు.

అక్రమ నిర్మాణాల కూల్చివేతతో హాట్ టాఫిక్‌గా మారిన HYDRA (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) ఎక్కడా కూడా అస్సలు తగ్గటం లేదు. ఎవరైతే నాకేంటి అంటూ హైడ్రా ఆఫీసర్లు కూల్చివేతలు చేస్తున్నారు. తాజాగా.. మాదాపూర్‌లోని N – కన్వెన్షన్‌ను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు అని సమాచారం. సినీ హీరో నాగార్జునకు చెందిన N – కన్వెన్షన్‌ను ఇవాళ ఉదయం భారీ బందోబస్తు మధ్య అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. నాగార్జునకు సంబంధించి N- కన్వెన్షన్ సెంటర్‌పై తాజాగా ఇటీవలే హైడ్రా ఆఫీసర్లకు ఫిర్యాదు అందింది.

తుమ్మకుంటలో చెరువును ఆక్రమించి నాగార్జున మూడు ఎకరాల్లో N- కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని పలువురు హైడ్రా కు ఫిర్యాదు చేశారు. చెరువు FTL పరిధిలో కన్వెన్షన్ నిర్మించారని గతంలోనూ ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా ఆఫీసర్లు సర్వే నిర్వహించి పక్కా ఆధారాలతో శనివారం తెల్లవారుజాము నుంచే సెంటర్ కూల్చివేత మొదలుపెట్టారు. N- కన్వెన్షన్ లోపలికి వెళ్లే అన్ని దారులను ఆఫీసర్లు మూసేశారు.టెలివిషన్ మీడియాకు సైతం అనుమతి లేదని అన్ని దారుల్లోనూ బారికేడ్లు ఏర్పాటు చేయడం జరిగింది. కూల్చివేతలను చిత్రీకరించేందుకు అనుమతి లేదంటూ మీడియోపై కూడా ఆంక్షలు నియమించారు.

హైదరాబాద్‌ లో గత కొన్ని రోజులుగా అక్రమ కట్టడాల మీద ‘హైడ్రా’ స్పెషల్ ఫోకస్ పెట్టిన హైడ్రా . కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలోని హైడ్రా అధికారులు అక్రమ కట్టడాలను గుర్తించి వెంటనే భావన నిర్మాణాలను కూల్చివేస్తున్నారు.పెద్ద పార్టీలు, ప్రముఖులు అన్న తేడా లేకుండా అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం పెట్టారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి KTR కు చెందినదిగా భావిస్తున్న జన్వాడ ఫామ్‌హౌస్ సైతం అక్రమ నిర్మాణం అంటూ హైడ్రా భావన నిర్మాణాన్ని కూల్చివేయడానికి తయారైంది. అయితే దీనికి వ్యతిరేకంగా హైకోర్టులో కేసు వేశారు. దీంతో తాత్కాలికంగా కూల్చివేతలకు బ్రేక్ పడింది.

హైడ్రా కూల్చివేతలపై BRS నేతలు కీలక కామెంట్స్ చేశారు. మంత్రి పొంగులేటి మరియు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వివేక్‌లకు చెందిన ఫార్మ్‌హౌస్‌లు కూల్చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జన్వాడ ఫాంహౌస్‌ తనది కాదని.. లీజుకు తీసుకున్నానని నిజంగా అక్రమ కట్టడమైతే తాను కూల్చేయిస్తానని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR వెల్లడించిన సంగతి తెలిసిందే…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top