How To Increase Net Speed In Mobile:మీ ఫోన్ బాగా స్లో అయ్యిందా? అయితే కొత్తదానిలా స్పీడ్ పెంచే చిట్కాలివే..! 2024.
How To Increase Net Speed In Mobile:మీ ఫోన్ బాగా స్లో అయ్యిందా..? మీ ఫోన్ వేగాన్ని పెంచడానికి, పనితీరును మెరుగుపర్చుకునే మార్గాల కోసం చూస్తున్నారా? అయితే మీ ఫోన్ ను కొత్తదానిలా స్పీడ్ పెంచే ఐదు టిప్స్ మీకోసమే.
ఆండ్రాయిడ్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్.
How To Increase Net Speed In Mobile:ఆండ్రాయిడ్ అనేది మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్. ప్రస్తుతం ఆండ్రాాయిడ్ ఫోన్లనే ప్రజలు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఎక్కువగా ఉపయోగించడంవల్ల ఆండ్రాయిడ్ ఫోన్ల స్పీడ్ తగ్గి నెమ్మదిస్తాయి. కొన్ని ఫైల్స్ తో పాటు ప్రోగ్రామ్ ఫ్రాగ్మెంటేషన్ ఈ ఫోన్లు స్లో అవడానికి కారణం అవుతాయి. ఇలా మీ ఫోన్ కూడా Slow అయ్యిందా,అయితే కొత్తదాని మాదిరిగా స్పీడ్ పెంచే టిప్స్ ఇవే.
మీ ఫోన్ ను రీస్టార్ట్ చేయండి.
How To Increase Net Speed In Mobile:మీ ఫోన్‌ని నిరంతరం ఉపయోగించడం వల్ల పనితీరులో సమస్యలు తలెత్తవచ్చు. ఇలాంటి సమయంలో ఫోన్‌ని రీస్టార్ట్ చేయండి. దీనివల్ల RAM శుభ్రం చేయబడుతుంది.అలాగే ఏవైనా సమస్యలుంటే ఆగిపోతాయి.
యాప్‌లను తగ్గించండి
తరచుగా కొత్త యాప్‌లను ఇన్‌స్టాల్ చేయడం స్మార్ట్‌ఫోన్ నెమ్మదిగా పనిచేయడానికి ఒక కారణం కావచ్చు.కాబట్టి ఏదిపడితే ఆ యాప్ లతో ఫోన్ ను నింపేయకండి. అవసరమైన యాప్ లే వుండేలా చూడండి. ఇక Facebook మరియు Instagram వంటి యాప్‌ల లైట్ వెర్షన్‌లను ఎంచుకోవడం ద్వారా మీ ఫోన్ స్పీడ్ తగ్గకుండా జాగ్రత్తపడవచ్చు.
యానిమేషన్‌లను సర్దుబాటు చేయండి.
మీరు యానిమేషన్‌లను తగ్గించడం లేదా నిలిపివేయడం ద్వారా మీ ఫోన్ స్పీడ్ ను మెరుగుపరచవచ్చు. వేగవంతమైన పనితీరు కోసం “యానిమేటర్ వ్యవధి స్కేల్,” “ట్రాన్సిషన్ యానిమేషన్ స్కేల్” మరియు “విండో యానిమేషన్ స్కేల్” సెట్టింగ్‌లను “.5x” లేదా “ఆఫ్”కి మార్చండి.
మీ ఫోన్లో సాఫ్ట్వేర్ని అప్డేట్ చేయండి.
సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్ చేసుకోకపోవడం వల్లకూడా ఫోన్ పనితీరు సమస్యలు తలెత్తవచ్చు.కాబట్టి సాప్ట్ వేర్ ఎప్పుడూ అప్ డేట్ గా వుండేలా చూసుకొండి. ఈ టిప్స్ ను పాటించడం ద్వారా మీ Android Phone ను కొత్తదానిలా speed గా మార్చుకోవచ్చు.