Slate Pencils : బలపాలు తింటున్నారా …? అయితే ఈ తిప్పలు తప్పవు..!
బలపాలు సాధారణంగా చిన్న పిలల్లు పలక పైన రాయడానికి Slate Pencils ఉపయోగిస్తారు కానీ వీటిని కొందరు చాల ఇష్టంగా తింటుంటారు…చిన్నపిల్లలతో పాటు , పెద్దలు కూడా డబ్బాల కొద్దీ బలపాలను తినేస్తుంటారు. కొందరు గర్భిణీ మహిళలో బలపాలు తినే అలవాటు మరీ విపరీతంగా ఉంటుంది. ఎంతలా అంటే.. వారికి స్లేట్ పెన్సిల్ వాసన చూడగానే..తినాలని నోరూరిపోతుంటుంది. అయితే, బలపాలు తినడం అస్సలు మంచిది కాదని నిపుణులు మరియు డాక్టర్లు చెబుతూనే ఉంటారు. అయితే, బలపాలు తినడం వల్ల కొన్ని లాభాల తో పాటు అంతకన్నా ఎక్కువ నష్టాలు కూడా వున్నాయి…అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం…
నిజానికి బలపాలు పెద్ద విష పదార్ధం కాదు. అయినప్పటికీ, బలపాలు తినడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొక తప్పదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే..బలపాలలు సాధారణంగా సున్నంతో తయారు చేస్తారు.. అంతేకాకుండా, అదికూడా ఏ మాత్రం శుద్ధి చేయని సున్నంతో స్లేట్ పెన్సిల్ లను తయారు చేస్తారు. అందు వల్ల బలపాలు తింటే, అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు ఎప్పుడు చెప్తునే ఉన్నారు.
బలపాలు తినే అలవాటు ఉన్న వ్యక్తులలో రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. యూరిన్ సమస్యలు, నోటి అల్సర్, కడుపు అల్సర్, కిడ్నీ స్టోన్స్ సమస్యలతో పాటు ప్రాణాంతక క్యాన్సర్ ప్రమాదం కూడా వచ్చే సూచనలు ఉన్నాయి అని డాక్టర్లు సూచిస్తున్నారు.అందువల్ల బలపాలు తినే అలవాటు ఉన్న వ్యక్తులు వాటిని ఎంత త్వరగా మానుకుంటే వారి ఆరోగ్యం అంతా బాగుంటుంది…Slate Pencils
అయితే, స్లేట్ పెన్సిల్ తినే అలవాటు ఉన్న వ్యక్తులలో పీకా అనే సమస్య ఉంటుందని ఆరోగ్య డాక్టర్లు చెబుతున్నారు. ఇలాంటి సమస్య ఉన్నవారు మట్టి, చాక్ పీసులు, ఐస్, మొదలైన వాటిని చూడగానే వారికీ నోరూరిపోతుందని అధ్యయనాలు చెబుతున్నారు… ఇది ఒక ఈటింగ్ డిసార్డర్ సమస్య అని పేర్కొన్నారు. ఓసీడీ ఉన్నవారూ, పోషకాహార లేమి తో బాధపడుతున్నవారూ, గర్భిణీలలో ఇలాంటి వారిలో ఈ అలవాటు ఎక్కువగా చూస్తుంటాం. ఒక్కోసారి శరీరంలో జింక్ లోపం కూడా ఈ పీకా సమస్యకు కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు.
బలపాలు ఎక్కువగా తినే వారికి త్వరగా వారి దంతాలు పాడవ్వడం వంటి సమస్య మొదలవుతుంది. తరచూ ఈ బలపాలు తినే అలవాటు ఉన్నవారిలో జీర్ణ సమస్యలు తలెత్తుతుంటాయి. మలబద్ధకం, లెడ్ పాయిజనింగ్, కడుపులో నులిపురుగు పెరగడం వంటి మొదలైన అనేక సమస్యలు ఎక్కువగా బాధపెడుతుంటాయి. అంతేకాదు..బలపాలు ఎక్కువగా తినే వారిలో ఆకలి కూడా సమయానికి కాదు …Slate Pencils
బలపాలు తినే అలవాటు ఉన్నవాళ్లు ఇప్పటికైనా ఈ అలవాటును మానుకోవడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. లేదంటే ఇలాంటి అనేక ఆరోగ్య సమస్యల బారిన పడాల్సిన ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.ప్రస్తుతానికి బలపాలు తినడానికి రుచిగా అనిపించినా కానీ, ఆ తర్వాత దాని సైడ్ఎఫెక్ట్స్ వల్ల మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాలి అని డాక్టర్లు సూచిస్తున్నారు..