Jajikaya Uses in Telugu:జాజికాయతో.. ఎన్నో అనారోగ్యాలకు చెక్‌ పెట్టుకోండి..! 2024.

Jajikaya Uses in Telugu:జాజికాయతో.. ఎన్నో అనారోగ్యాలకు చెక్‌ పెట్టుకోండి..! 2024.

jajikaya uses in telugu: జాజికాయ.. బిర్యాణీకి ఎక్స్ట్రా టేస్ట్ తీసుకొస్తుంది. మాంసాహార వంటల్లో రుచికి, సువాసనకు తప్పనిసరిగా వాడతారు. దీన్ని కిళ్లీ/తమలపాకుల్లో వేసి తీసుకుంటారు. దీన్నే మేస్, నట్మెగ్ అంటారు. జాజికాయ వంటలకు టేస్ట్ ని తీసుకు రావడంతో పాటు ,మంచి సువాసనను తీసుకురావడమే కాకుండా , మన ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది. ఆయుర్వేదంలోనూ దీన్ని అనేక వ్యాధుల చికిత్సలో కూడా వాడుతుంటారు.

Nutmeg benefits in telugu:జాజికాయలో ఫైబర్, థియామిన్, విటమిన్ బి 6, కాల్షియం, ఐరన్, మాంగనీస్, పొటాషియం తదితర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల మన శరీరానికి పోషణ లభిస్తుంది. అలాగే రక్త సరఫరా మెరుగు పడుతుంది. జాజికాయ తీసుకుంటే, ఆరోగ్యానికి ఎటువంటి మేలు జరుగుతుందో తేలుసుకోవాలనుకుంటే, ఇక్కడ చదవండి.

Jajikaya Uses in Telugu: జాజికాయ తీసుకుంటే.. డయాబెటిక్‌ పేషెంట్స్‌కు మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. NCBI నివేదిక ప్రకారం. జాజికాయ ప్యాంక్రియాటిక్‌ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో సహయాపడుతుందని తేలింది. కానీ, ఇది తీసుకునే ముందు డాక్టర్‌నను సంప్రదించడం మేలు.


Jajikaya Uses in Telugu:జాజికాయకు అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించే సామర్థ్యం ఉందని NCBI అధ్యయనం స్పష్టం చేసింది. కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్ రెండూ శరీరానికి అవసరమైన జిగట పదార్థాలు. కానీ, ఇవి శరీరంలో అధికంగా ఉంటే.. సిరల్లో పేరుకుపోతాయి . గుండెపోటు, స్ట్రోక్‌ వచ్చే ప్రమాదం ఉంది.

Nutmeg benefits in telugu: బలహీనమైన లైంగిక సామర్థ్యం ఉన్నవారికి , ఇన్‌ఫెర్టిలిటీ సమస్యలతో బాధపడే మగవారికి ఈ జాజికాయ ఎంతో మేలు చేస్తుంది. ఇది లైంగిక ప్రేరేపణను మేరుగుపరచడంలో ఎంతగానో కృషి చేస్తుందని అనేక అధ్యయనాలు స్పష్టం చేశాయి. సెక్స్‌ సామర్ధ్యాన్ని పెంచడమే కాకుండా వీర్యకణాలను వృద్ధి చేయడంలో కూడా సాయపడుతుంది. పురుషుల్లో ఏర్పడే నపుంసకత్వం, శీఘ్ర స్కలనం వంటి లైంగిక సమస్యల నుండి దూరం చేస్తుంది.

దీర్ఘకాలిక వాపుల వల్ల అర్థరైటిస్‌, కీళ్ల నొప్పులు మరియు గుండె జబ్బులు, డయాబెటిస్‌ వంటివి వచ్చే ప్రమాదం ఉంది. జాజికాయలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి, ఇది శరీరంలోని వాపులను తొలగించి,ఈ సమస్యల నుండి వచ్చే ముప్పును తగ్గుతుంది.

E. coli వంటి బ్యాక్టీరియా ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది. జాజికాయ మన డైట్‌లో చేర్చుకుంటే.. ఇన్ఫక్షన్ల నయం అవుతాయి. ఈ జాజికాయలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలను కలిగి ఉన్నాయి, ఇవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు దివ్యౌషధంలా కూడా పనిచేస్తాయి.

శీతాకాలంలో బద్ధకంగా, విచారంగా అనిపిస్తూ ఉంటుంది. ఇది సీజనల్‌ డిజార్డర్‌. జాజికాయ మానసిక స్థితిని రిఫ్రెష్‌ చేస్తుంది. ఇది Antidepressant drugs లాగా పనిచేసి డిప్రెషన్, స్ట్రెస్ నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఈ జాజికాయలో లభించేటువంటి ‘మిరిస్టిసిన్’ అనే ఒక పదార్థం మన మెదడు చురుగ్గా పనిచేసేందుకు ఉపకరిస్తుంది. అంతేకాక అల్జీమర్స్ తాలూకు లక్షణాలను ఆలస్యం చేయడానికి కూడా ఈ జాజికాయ సహాయపడుతుంది.

గమనిక: ఈ వివరాలు ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించడం జరిగింది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసము మాత్రమే. మీ ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. అని గమనించగలరు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top