తెలంగాణలో 10,594 గ్రామ రెవెన్యూ అధికారుల నియామకం / Telangana Vro Jobs Recruitment 2024 Update
Telangana Vro Jobs Recruitment 2024 Update : తెలంగాణ రాష్ట్రంలో 10,594 గ్రామాల్లో గ్రామ రెవెన్యూ అధికారి ( VRO ) జాబ్స్ లను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. గతంలో రద్దు చేసిన ఈ వ్యవస్థను పునరుద్దించాలని ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది… గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థను పునరుద్దించాలి అనే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం కొత్తగా సిబ్బందిని నియమించాలని ఆలోచిస్తుంది.
ఈ నేపథ్యంలో గతంలో వీఆర్వో లేదా వీఆర్ఏలుగా పనిచేసిన వారికి ఒక పరీక్ష నిర్వహించి పోస్టింగ్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ఈ విధంగా నియమించినప్పటికీ కూడా పోస్టులు మిగిలితే కొత్త నోటిఫికేషన్ జారీ చేసిజాబ్స్ లను భర్తీ చేయాలని భావిస్తున్నారు.
కనీస విద్యా అర్హత ఇంటర్ లేదా డిగ్రీ నిర్ణయించి ఈ పోస్టులకు ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ఇలా చేయడం వల్ల కనీసం 15,000 మంది ఈ పరీక్షకు అర్హత సాధిస్తారని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో రాష్ట్రంలో కొత్త ROR చట్టం అమల్లోకి వచ్చాకే ఈ పరీక్ష నిర్వహిస్తారు.
🔥 ఖాళీల సంఖ్య : 10,594 గ్రామాల్లో ప్రతి గ్రామానికి ఒక పోస్టు నియమిస్తారు.
🔥 భర్తీ చేయబోయే జాబ్స్ : విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ ( VRO ) అనే జాబ్స్ లను భర్తీ చేస్తున్నారు.
🔥 అర్హతలు : గతంలో వీఆర్వో లేదా ఏఆర్వోలుగా పని చేసిన వారిలో ఇంటర్ లేదా డిగ్రీ విద్యా అర్హత కలిగిన వారికి ఒక పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు..
కొత్త నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తారు…?
గతంలో పనిచేసిన వారికి కనీస విద్యా అర్హతగా ఇంటర్ లేదా డిగ్రీ అర్హత నిర్ణయించి వారికి ఒక పరీక్ష నిర్వహించి పోస్టులు భర్తీ చేపడుతారు.. అప్పటికి కూడా ఖాళీలు మిగిలిపోతే కొత్త నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులతో ఈ పోస్టులు భర్తీ చేస్తారు.
🔥 వయస్సు : ఈ జాబ్స్ లకు అప్లై చేయడానికి 18 నుండి 44 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారు అర్హులు..
🔥ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ఈడబ్ల్యూస్ అభ్యర్థులకు ఐదేళ్లు వయస్సులో సడలింపు వర్తిస్తుంది…
🔥 ఎంపిక విధానము : పరీక్ష నిర్వహించి ఈ జాబ్స్ లకు ఎంపిక చేయడం జరుగుతుంది
గమనిక : ఈ నోటోఫికేషన్ విడుదల చేసిన తర్వాత todayintelugu.com అప్డేట్ ఇస్తాం..కావున మా వెబ్సైట్ ను పరిశీలించండి…! Telangana Vro Jobs Recruitment 2024 Update