White Tea Benefits in Telugu : వైట్ టీ తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు…షుగర్ పేషెంట్స్ కి ఒక గొప్ప వరం ఈ వైట్ టీ…
సాధారణంగా వేడి వేడి టిలను తాగేవారు ఎక్కువ White Tea Benefits in Telugu. కానీ, వైట్ తీని మాత్రం చల్లగా రుచి చూడడానికి ఎక్కువమంది ఇష్టపడతారట. కమేలియా సినెన్సిస్ అనే తేయాకు ముక్క లేలేదా ఆకులు, మొగ్గలతో ఈ టీ ని తయారు చేస్తారు. వీటిని ప్రత్యేక పద్ధతిలో ఎండబెట్టిన ఆకుల్ని వేడి నీళ్లలో వేసి కాసేపు మూత పెట్టేస్తే సరి. వైట్ టీ తయారైనట్లే. మన రుచి మేరకు ఇందులో చెంచా తేనె చేర్చుకోవచ్చు. వీటిలో పోషక విలువలతో పాటు ఔషధ గుణాలు ఎక్కువే నట. ముఖ్యంగా ఇందులోని పాలిఫెనాల్స్ కేట్టిన్స్… శరీరంలోని ఫ్రీ రాడికల్స్, దీర్ఘకాలిక వాపుల్ని తగ్గిస్తాయి. మహిళలని ఆస్ట్రోపోరోసిస్ ముప్పు రాకుండా కాపాడతాయి. నోటి దుర్వాసన దూరం చేసి దంతాల అని దృఢంగా మారుస్తాయి. అంతేకాదు, ఈ టీ వ్యర్థాలను చర్మ, కేశ సంరక్షణలోనూ వాడొచ్చు..మరి ఈ టీ త్రాగటం వల్ల ఉపయోగాలను ఇప్పుడు తెలుసుకుందాం….White Tea Benefits in Telugu
White Tea Benefits in Telugu : ఈ వైట్ టీ మనలో చాలా మందికి దీని పేరు కూడా విని ఉండరు. ఊలాంగ్, బ్లాక్, గ్రీన్ టీతో పోలిస్తే.. వైట్ టీని తక్కువగా ప్రాసెస్ చేయోచ్చు. వైట్ టీని కామెల్లియా సినెన్సిస్ మొక్క చిగుళ్లతో, మొగ్గలతో టీ చేస్తారు. వైట్ టీని తేలికగా ఆక్సిడైజ్ చేస్తారు. దీనిలో యాంటీఆక్సిడెంట్లు కూడా మెండుగా ఉంటాయి. ఇది చూడటానికి మృదువైన రంగుతో, కొంచెం తియ్యగా, సాధారణ టీలో కనిపించే చిరు చేదు రుచితో ఉంటుంది. వైట్ టీ తరచు తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలను మన సొంతం చేసుకోవచ్చని నిపుణులు అంటున్నారు. వైట్ టీ ని త్రాగటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు…
బరువు తగ్గుతారు…
మీరు బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా…? ఐతే మీ ఆహారంలో భాగంగా ఈ వైట్ టీని కచ్చితంగా తాగడానికి ప్రయత్నించండి. వైట్ టీ మీ జీవక్రియను బూస్ట్ చేయడంలో దోహద పడుతుంది.ఈ టీ లో కెఫిన్‌తో పాటు, ఎపిగాల్లోకాటెచిన్ గాలేట్ (EGCG) కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో కొవ్వు కరిగించడానికి ఎఫెక్టివ్‌గా ఉపయోగపడుతుంది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఒబేసిటీలో పేర్కొన ఒక అధ్యయనం ప్రకారం, ఈ టీ లో జీవక్రియను 5 % పెంచే శక్తి ఉంటుంది. వైట్ టీ శరీరం లోని పోషకాలను సులభంగా గ్రహించడానికి సహాయపడుతుంది.
చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది…
వైట్ టీ తో అందమైన మరియు మృదువైన చర్మాన్ని మన సొంతం చేసుకోవచ్చు…. వైట్ టీలోని శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి రక్షించడానికి దోహదపడుతాయి. ముడతలు మరియు ఫైన్ లైన్స్ రాకుండా అడ్డుకుంటాయి. వైట్ టీ చర్మం చికాకును తగ్గించడంలో ఉపయోగపడుతుంది, ఇది మీ ముఖాన్ని మృదువుగా మరియు బ్రేక్‌అవుట్‌లు రాకుండా అడ్డుకుంటుంది…White Tea Benefits in Telugu
గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది…
వైట్ టీలో ఫ్లేవనాయిడ్లు ఉంటాయి, ఇవి కార్డియోవాస్క్యులార్ డిసీజ్ వచ్చే ముప్పు రాకుండా ఉపయోగపడతాయి. ఈ ఫ్లేవనాయిడ్లు హైపర్‌టెన్షన్‌ను తగ్గించడానికి దోహదపడుతాయి. అంతేకాకుండా, ఇది తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ ఆక్సీకరణను తగ్గిస్తుంది, ఎండోథెలియల్ పనితీరును మెరుగుపరుస్తుంది, డైస్లిపిడెమియాను మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. ఇవన్ని గుండె సమస్యలు రాకుండా కాపాడుతాయి. ఈ టీ తాగడం వల్ల ట్రైగ్లిజరైడ్ స్థాయిలు తగ్గుతాయి అలాగే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది అంతేకాకుండా రక్తనాళాల పనితీరు కూడా మెరుగుపడుతుంది, గుండె, మొత్తం ప్రసరణ వ్యవస్థ దెబ్బతినకుండా కాపాడుతుంది.
డయాబెటిస్ ముప్పు తగ్గిస్తుంది...
వైట్ టీలోని యాంటీ డయాబెటిక్ లక్షణాలు.. టైప్ 2 డయాబెటిస్‌ను నివారించడానికి ఉపయోగపడుతాయి. షుగర్ పేషెంట్స్ వైట్ టీ తాగితే.. ప్లాస్మా గ్లూకోజ్ స్థాయిలు తగ్గుతాయి, ఇన్సులిన్ స్రావాన్ని నయం చేస్తుంది.
Note : పైన ఇచ్చిన సమాచారం అంతా కూడా మీ అవగాహన కోసం మరియు అంతర్జాలంలో దొరికిన సమాచారం తీసుకోవడం జరిగింది , ఈ White Tea Benefits in Telugu అతిగా తీసుకునే వారు వైద్యుల సలహా తీసుకోగలరు