Fennel Seeds in Telugu :ఈ గింజలను రోజూ తింటే., హైపర్‌టెన్షన్‌తో ఉన్న వాళ్ళను కంట్రోల్లో ఉంచుతుంది…! 2024.
Fennel Seeds in Telugu :చాలా మందికి భోజనం చేసిన తర్వాత సోంపు తినే అలవాటు ఉంటుంది. సోంపును వంట్లల్లో టేస్ట్ పెంచడానికీ ఉపయోగిస్తారు. సోంపు నోటి దుర్వాసనను దూరం చేస్తుందని చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ సోంపును తినడం వల్ల నోటి దుర్వాసనను దూరం చేయడంతోపాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. సోంపులో అనేక పోషకాలు ఉంటాయి. దీనిలో Calcium, Vitamin C, Iron, Magnesium, Potassium వంటి పోషకాలు ఉన్నాయి. దీనితో పాటు, అనేక ఔషధ గుణాలు కూడా ఉన్నాయి.
Fennel Seeds in Telugu :సోంపు గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఇవి రోజూ తింటే.. బరువు తగ్గడంలో సహాయపడతాయి. ఇవి చర్మ సమస్యలనూ దూరం చేస్తాయి. సోంపు గింజలు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తూ ప్రముఖ పోషకాహార నిపుణురాలు లవ్‌నీత్ బాత్రా ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేశారు.
జీర్ణక్రియకు మంచిది..
Sompu Benefits in Telugu: సోంపు గింజలలో అనెథోల్, ఫెంచోన్, ఎస్ట్రాగోల్ ఉంటాయి. ఇవి యాంటిస్పాస్మోడిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తాయి. భోజనం చేసిన తర్వాత ఈ సోంపు గింజలు తింటే, జీర్ణక్రియ బాగా మెరుగుపడుతుంది. జీర్ణక్రియ సమస్యలతో ఇబ్బంది పడే వారు ప్రతి రోజూ ఈ సోంపు గింజలు తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకం, అజీర్ణం మరియు కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు ఈ సోంపు గింజలు ఔషధంలా కూడా పనిచేస్తాయి.
బీపీ కంట్రోల్లో ఉంటుంది..
Sompu Benefits in Telugu:సోంపు గింజలు నమిలితే.,లాలాజలంలో నైట్రెట్ల పరిమాణాం పెరుగుతుంది. ఇది Hypertensionను కంట్రోల్లో ఉంచడానికి నేచ్యరల్ రిమిడీలా పనిచేస్తుంది. హైపర్‌టెన్షన్‌తో బాధపడే వారు ప్రతి రోజూ సోంపు గింజలు నమిలితే మంచిదని నిపుణులు అన్నారు.
ఎసిడిటీని దూరం చేస్తుంది..
ఈ రోజుల్లో ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు, నిశ్చల జీవనశైలి మరియు అధిక బరువు కారణంగా ఎసిడిటీ సమస్య ఎక్కువైపోతుంది. సోంపు గింజలు పేగులోని యాసిడ్‌ను న్యూట్రల్ చేయడానికి సహాయపడతాయి. మీరు ఎసిడిటీ ప్రాబ్లెమ్ తో ఇబ్బంది పడుతూ ఉంటే.,తిన్న వేను వెంటనే సోంపు గింజలు నోట్లో వేసి నమలండి. ఇవి తింటే గుండెల్లో మంట, వాంతుల ప్రభావం తగ్గుతుంది. తేన్పుల సమస్యను తగ్గించడంలోనూ ఈ సోంపు గింజలు ప్రభావవంతంగా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
కండరాలకు మంచిది..
సోంపు గింజలు శరీరంలోని కండరాలను రిలాక్స్ చేయడానికి సహాయపడతాయి. దీనిలో Anti-inflammatory, antioxidant, antispasmodic లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. సోంపు గింజలు ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలను పెంచడానికి తోడ్పడతాయి. ఇది రక్త కణాలలో ఫ్రీ రాడికల్స్ ప్రతికూల ప్రభావాలను సోంపు గింజలు తగ్గించడంలో తోడ్పడుతాయి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. మీకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏ చిన్న సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. అని గమనించగలరు.Fennel Seeds in Telugu :