Sabja Seeds in Telugu : సబ్జా గింజలతో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు…అవేంటో తెలిస్తే వాటిని అస్సలు వదిలిపెట్టరు..!
సబ్జా గింజలు.. వీటిని తుక్మారియా లేదా తులసి గింజలు అని కూడా అంటారు Sabja Seeds in Telugu. ఇవి అపారమైన ఆరోగ్య ఉపయోగాలను మనకు అందిస్తాయి. హిందువులు పవిత్రంగా భావించే తులసిని పోలిన మొక్క నుంచి వచ్చే ఈ సబ్జా గింజలతో అనేక అరోగ్య ఉపయోగాలున్నాయి. సబ్జా గింజల్లో ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు, పిండి పదార్థాలు మెండుగా ఉంటాయి. ముఖ్యంగా వీటిలో ఫైబర్ కంటెంట్ మెండుగా ఉంటాయి. వీటిలో తక్కువ కేలరీలను కలిగి ఉంటాయి. ఈ గింజలను పచ్చిగా తినలేరు. వీటిని నీటిలో నానబెట్టిన తరువాత తీసుకుంటే వీటి ఉపయోగాలు శరీరానికి అందుతాయి. ఇక ఆయుర్వేదంలో సబ్జా గింజల ఉపయోగాల గురించి ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది. వీటి వలన ఆరోగ్యానికి మేలు జరుగుతుందని ఆయుర్వేదంలో తెలియజేసారు. మరి సబ్జాలతో కలిగే ఉపయోగాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
సబ్జా గింజలతో కలిగే 6 ఆరోగ్య మేలు..
బరువు తగ్గడానికి ఉపయోగపడతాయి.. సబ్జా గింజల్లో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ మెండుగా ఉంటుంది. ఇది బరువును తగ్గించడంలో అద్భుతంగా పని తీరుని చూపిస్తుంది. ఇంకా ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉండటం వలన.. వీటిని తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. అవాంఛిత కోరికలను నియంత్రించి బరువు తగ్గడంలో ఉపయోగపడతాయి.
షుగర్ లెవల్స్ నియంత్రించడంలో.. టైప్ II షుగర్ ఉన్న వ్యాధులకు ఇది మంచిదని డాక్టర్లు చెబుతున్నారు. రక్తంలో షుగర్ లెవల్స్‌ను తగ్గించడంలో సబ్జా గింజలు అద్భుతo గా దోహద పడుతాయని చెబుతున్నారు.Sabja Seeds in Telugu
మలబద్ధకం మరియు కడుపు ఉబ్బరం సమస్య నుంచి ఉపశమనం.. సబ్జా గింజలు సహజంగానే మీ శరీరాన్ని నిర్విషీకరణం చేస్తాయి. ఇది అస్థిర నూనెను కలిగి ఉంటుంది కాబట్టి ఉదర సంబంధిత సమస్యల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా గ్యాస్ మరియు మలబద్ధకం సమస్యలను దూరం చేస్తుంది.
అసిడిటీ, ఛాతిలో మంటను నియంత్రిస్తుంది.. సబ్జా గింజలు శరీరంలో అమ్లత్వాన్ని నియంత్రిస్తుంది… ఇది ఆమ్లత్వం, గుండెల్లో మంట నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నానబెట్టిన విత్తనాలను తినడం ద్వారా కడుపులోని సమస్యలను నయం చేస్తుంది. తద్వారా మంట నుంచి ఉపశమనం లభిస్తుంది.
చర్మం మరియు జుట్టుకు ఆరోగ్యం..కాస్త కోకోనట్ నూనెలో పిండిచేసిన సబ్జా విత్తనాలను కలిపి.. ఆ నూనెను కావాల్సిన ప్రాంతంలో అప్లై చేయడం ద్వారా ఉపయోగం ఉంటుందని పెద్దవాళ్లు చెబుతున్నారు. ఇది ఎగ్జిమా మరియు సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులను నయం చేయడంలో అద్భుతమైన పనితీరుని చూపిస్తుంది. సబ్జా గింజలను క్రమం తప్పకుండా తినడం వల్ల కొత్త చర్మ కణాలను రూపొందించడానికి అవసరమైన కొల్లాజెన్‌ను స్రవించడంలో మీ శరీరానికి ఉపయోగపడుతుంది. సబ్జా గింజలు పొడవాటి మరియు దృఢమైన జుట్టుకు అవసరమైన ఐరన్, విటమిన్ K, ప్రొటీన్‌తో నిండి ఉన్నందు వలన .. ఆరోగ్యకరమైన జుట్టును నిర్వహించడానికి సహాయకరంగా ఉంటుంది. అలాగే, వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మీ చర్మం మరియు జుట్టుకు అనేక రకాలుగా ఇది మేలు చేస్తుంది.
దగ్గు మరియు జలుబు నుంచి మంచి ఉపశమనం కలిగిస్తుంది.. సబ్జా విత్తనాల్లో యాంటిస్పాస్మోడిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది కండరాల సంబంధిత సమస్యల నుంచి మంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది. కండరాలకు విశ్రాంతిని కలిగిస్తుంది. యాంటిస్పాస్మోడిక్ లక్షణం.. కోరింత దగ్గును తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది . శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో దోహద పడుతుంది.
Note : పైన ఇచ్చిన సమాచారం అంతా కూడా మీ అవగాహన కోసం మరియు అంతర్జాలంలో దొరికిన సమాచారం తీసుకోవడం జరిగింది , ఈ Sabja Seeds in Telugu అతిగా తీసుకునే వారు వైద్యుల సలహా తీసుకోగలరు