Rice Bran Oil in Telugu : వంటలో ఈ నూనె వాడితే.. బరువు తగ్గడమే కాదు, క్యాన్సర్ రాకుండ చేస్తుంది…!
రైస్ బ్రాన్ ఆయిల్ వంటకు Rice Bran Oil in Telugu వాడితే అనేక ఆరోగ్య ఉపయోగాలను పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు…! మనం వంటకు వాడే నూనె, మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందనేది కాదనలేని నిజం. సాధారణంగా మన దేశంలో వంటల్లో నూనె కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఒకవేల మనం వాడే వంట నూనెలో నాణ్యత లేకపోతె… మనం అనేక ఆరోగ్యం సమస్యలు గురవుతాయి. అందుకే మనం వంటలలోకి మంచి నూనె ఎంచుకోవలసి ఉంటుంది. రైస్ బ్రాన్ నూనెను వంటకు వాడితే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని చాల మంది నిపుణులు సూచిస్తున్నారు. ఐతే ఈ రైస్ బ్రాన్ నూనెను బియ్యం పొట్టు నుంచి తీస్తారు. ఇది వంటకు మంచి రుచిని, తేలికపాటి సువాసను కూడా కలిగిస్తుంది. ఈ నూనెలో ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి, విటమిన్ E మెండుగా ఉంటుంది. రైస్ బ్రాన్ రైస్ బ్రాన్ ఆయిల్ ఆరోగ్యా ఉపయోగాలను తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీని పూర్తిగా చదివేయండి...!
గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది…
మీ వంటలలో రైస్ బ్రాన్ ఆయిల్ వాడితే.. గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుందని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో దోహదపడుతుంది. Rice Bran Oil in Telugu లోని ఓరిజానాల్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది కొలెస్ట్రాల్ శోషణను నియంత్రిస్తుంది, శరీరంలో పేరుకున్న కొలెస్ట్రాల్ కూడా ఈ నూనె కరిగిస్తుంది. దీనిలో మోనోఅన్‌శాచురేటెడ్ మరియు పాలీఅన్‌శుచ్యురేటెడ్ అలాగే సంతృప్త కొవ్వులు కూడా కలిగి ఉంటాయి. ఒక ఇరానియన్ అధ్యయనం ప్రకారం, Rice Bran Oil డైట్‌లో చేర్చుకుంటే.. గుండె సమస్యలు ముప్పు ఉండదు.
షుగర్ పేషెంట్స్‌కు మంచిది...
జర్నల్ ఆఫ్ న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీలో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం, రైస్ బ్రాన్ ఆయిల్ వినియోగం టైప్ 2 షుగర్ రోగులలో రక్తంలో చక్కెర స్పైక్‌లను 30% గణనీయంగా నియంత్రించిందని వెల్లడించింది. ఇది డాయాబెటిక్ పేషెంట్స్‌కు మేలు చేస్తుంది.
బరువు తగ్గుతారు…
రైస్ బ్రాన్ ఆయిల్‌కు కొలెస్ట్రాల్ తగ్గించే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలోని ఓరిజానాల్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది జీవక్రియ రేటును పెంచి, బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
క్యాన్సర్‌కు చెక్…
రైస్ బ్రాన్ ఆయిల్‌లోని యాంటీఆక్సిడెంట్ల సమూహం మరియు టోకోట్రినాల్స్ బలమైన క్యాన్సర్ నిరోధక ప్రభావాలను కలిగి ఉంటాయి. బ్రెస్ట్, ఊపిరితిత్తులు, అండాశయం, కాలేయం, మెదడు,ప్యాంక్రియాస్‌లో మొదలైనవి క్యాన్సర్‌గా ఏర్పడే కణాల పెరుగుదలను టోకోట్రినాల్స్ తగ్గిస్తాయని అధ్యయనాలు వెల్లడించాయి.
రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది...
రైస్ బ్రౌన్ అయిల్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైటోస్టెరాల్స్, పాలీశాకరైడ్స్, మినరల్స్, మెగ్నీషియం, సెలీనియం, జింక్, విటమిన్ E , ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మొదలైనవి ట్రేస్ మినరల్స్ వంటి శక్తివంతమైన మొక్కల సమ్మేళనాలు రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి మరియు ఇన్‌ఫెక్షన్లను అరికట్టడానికి సహాయపడుతాయి. ఈ వంట నూనె లిపిడ్ ప్రొఫైల్ మరియు మెటబాలిక్ సిండ్రోమ్‌ను ప్రభావితం చేస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
Note : పైన ఇచ్చిన సమాచారం అంతా కూడా మీ అవగాహన కోసం మరియు అంతర్జాలంలో దొరికిన సమాచారం తీసుకోవడం జరిగింది , ఈ Rice Bran Oil in Telugu అతిగా తీసుకునే వారు వైద్యుల సలహా తీసుకోగలరు