Tiger Nuts in Telugu : మధుమేహం అదుపులో ఉండాలంటే ఈ నట్స్ తప్పకుండ తినాల్సిందే…!
సాధారణంగా నట్స్ అనగానే మనకు బాదం, వాల్ నట్స్, పిస్తా మొదలైనవి త్వరగా అందరికీ గుర్తుకు వస్తాయి Tiger Nuts in Telugu. కానీ ఇవి మాత్రమే కాదు అనేక ప్రయోజనాలు కలిగిన టైగర్ నట్స్ గురించి ఎప్పుడైనా విన్నారా?ఈ నట్స్ చూసేందుకు మరియు వీటి పరిమాణం కాస్త శనగలు మాదిరిగా కనిపిస్తుంది. టైగర్ నట్స్ ని చుఫా గింజలు, ఎల్లో నట్స్ ఎడ్జ్, ఎర్త్ ఆల్మండ్ అని ఇలా వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. ఈ నట్స్ తినడానికి కొంచెం తీపి, వగరు, కొబ్బరి రుచిని కలిగి ఉంటాయి. పూర్వంలో వీటి వినియోగం ఎక్కువగా ఉండేది అని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు.ఐతే వీటి వినియోగం ఈ మధ్య కలంలో ఇప్పుడిప్పుడే ప్రజలు మళ్ళీ కిచెన్ లో టైగర్ నట్స్ ఉండే విధంగా జనాలు చూసుకుంటున్నారు. ఈ నట్స్ తో చేసిన పొడిని పాలలో కలుపుకుని విరివిగా తాగుతారు. ఈ టైగర్ నట్స్ నమలడానికి కాస్త గట్టిగా ఉంటాయి. కానీ ఈ వీటిని తీసుకోవడం వల్ల అనేక ఉపయోగాలను పొందుతారు.
ఫైబర్ మెండుగా ఉంటుంది : ఈ నట్స్ లో కరిగని ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణం కాకుండా పేగుల నుంచి వెళ్తుంది. ఇందులోని పీచు పదార్థం మలవిసర్జన సజావుగా సాగేలా సహాయపడుతుంది. గట్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. మలబద్ధకం సమస్యని తొలగిస్తుంది. ఇందులో లైపీస్ మరియు అమైలెస్ వంటి ఎంజైమ్ లు మెండుగా ఉన్నాయి. పేగుల్లోని ఆహారాన్ని విచ్చిన్నం చేయడంలో ఇవి ఉపయోగపడతాయి. గ్యాస్, పొట్ట ఉబ్బడం, అజీర్తి, అతిసారం వంటి మొదలైన సమస్యల నుంచి ఉపశమనం లభించేల చేస్తాయి.Tiger Nuts in Telugu
డయాబెటిస్ నియంత్రణ : ఈరోజుల్లో ఎక్కువ శాతం మంది ఎదుర్కొంటున్న సమస్య మధుమేహం. దీన్ని నియంత్రించగలిగే గుణాలు ఇందులో మెండుగా ఉంటాయి. ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచేందుకు ఉపయోగపడే అమినో యాసిడ్ ఆర్జినైన్ ఎక్కువ మొత్తంలో కలిగి ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రిస్తుంది.
యాంటీ బ్యాకర్టీయా లక్షణాలు : ఒక అధ్యయనం ప్రకారం ఇందులో అసిటోన్, ఇథనాల్, క్లోరోఫామ్, పెట్రోలియం ఈథర్ వంటి మొదలైన యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉన్నాయి. ఇకోలి, సాల్మొనెల్లా, సెయింట్ ఆరియస్ కి వ్యతిరేకంగా పని చేస్తాయి అని పేర్కొంది.
చెడు కొలెస్ట్రాల్ కరిగిస్తుంది : వీటిలో కరగని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రణలో ఉంచేందుకు ఉపయోగపడుతుంది. ఇది మాత్రమే కాదు చెడు కొలెస్ట్రాల్ ని నియంత్రించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఇందులోని ఓలేయిక్ యాసిడ్, విటమిన్ E ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల మంచి కొలెస్ట్రాల్ స్థాయిలని పెంచేందుకు ఉపయోగపడుతుంది.
ప్రీబయోటిక్ : పొట్ట ఆరోగ్యానికి మేలు చేసే ప్రీబయోటిక్ ఇందులో సమృద్ధిగా ఉంటాయి. శరీరంలోని చెడు బ్యాకర్టీయాతో పోరాడేందుకు ఉపయోగపడుతుంది. మెరుగైన జీర్ణ వ్యవస్థను పెంచుతుంది. గట్ లో మంచి బ్యాక్టీరియా ఏర్పడేందుకు ఉపకారం చేస్తుంది. జీర్ణ వ్యవస్థ సజావుగా సాగేలా దోహదపడుతుంది.
రిచ్ యాంటీ ఆక్సిడెంట్ : ఆక్సీకరణ ఒత్తిడి నుంచి జీర్ణవ్యవస్థని రక్షించుకోవడం కోసం యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఇవి టైగర్ నట్స్ లో పుష్కలంగా లభిస్తాయి. శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి రక్షించడంలో మెరుగ్గా పని చేస్తాయి.
Note : పైన ఇచ్చిన సమాచారం అంతా కూడా మీ అవగాహన కోసం మరియు అంతర్జాలంలో దొరికిన సమాచారం తీసుకోవడం జరిగింది , ఈ Tiger Nuts in Telugu అతిగా తీసుకునే వారు వైద్యుల సలహా తీసుకోగలరు