Ganesh Chaturthi 2024 : ఈ సంవత్సరం వినాయక చవితి ఎప్పుడొచ్చింది…విగ్రహ ప్రతిష్టాపనకు శుభ ముహుర్తం, పూజా విధానాలేంటో తెలుసుకోండి…

Ganesh Chaturthi 2024 : ఈ సంవత్సరం వినాయక చవితి ఎప్పుడొచ్చింది…విగ్రహ ప్రతిష్టాపనకు శుభ ముహుర్తం, పూజా విధానాలేంటో తెలుసుకోండి…

తెలుగు పంచాంగం ప్రకారం, ఈ సంవత్సరం Ganesh Chaturthi 2024 పండుగ తేదీ విషయంలో కొంత గందరగోళం గా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం గణేష్ చతుర్థి పండుగ September 7న లేదా 8వ తేదీలలో ఏ రోజున విగ్రహ ప్రతిష్టాపన జరపాలనే వివరాలను ఇప్పుడు క్లుప్తంగా ఇక్కడ తెలుసుకుందాం…

Ganesh Chaturthi 2024 : మన భారతదేశం యొక్క హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే చతుర్థి రోజున వినాయక చవితిని పండుగను అందరు ఘనంగా జరుపుకుంటారు.మన హిందూ పురాణాల ప్రకారం, ఈ పవిత్రమైన రోజున బొజ్జ గణపయ్య జన్మించాడు. హిందూ మతంలో గణేష్ చవితి కూడా అతి పెద్ద మరియు అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటి. విఘ్నాలను తొలగించే వాడు వినాయకుడు అని అంటారు .మన హిందూ దేవుళ్లందరిలోనూ మొట్టమొదటి పూజ విఘ్నాలను తొలగించే వినాయకుడికే. ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్న వినాయక చవితి పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా మరియు ఆనందంగా జరుపుకుంటారు.

ముఖ్యంగా మన భారతదేశంలోని మహారాష్ట్రలోని ముంబై, హైదరాబాద్, ఢిల్లీ వంటి మొదలైన నగరాల్లో వినాయక చవితి వేడుకలను అత్యంత ప్రతిష్మాష్టకంగా జరుపుకుంటారు. ఇది లా ఉండగా…ఈ సంవత్సరం September 6, 7వ తేదీల్లో హిందూ పంచాంగం ప్రకారం చవితి వచ్చింది. దీంతో కొందరు ఈ నెల September 7వ తేదీన విగ్రహ ప్రతిష్ట జరుపుకోవాలని, ఇంకొందరు 8వ తేదీన వినాయక చతుర్థి జరుపుకోవాలని చెబుతుండటంతో మరోసారి సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం వినాయక చవితి వేడుకలను ఎప్పుడు జరుపుకోవాలనే పూర్తి వివరాలను మేము ఇక్కడ పూర్తి వివరాలను స్పష్టంగా తెలియజేసాం చదవండి…!

తెలుగు పంచాంగం ప్రకారం, ఈ సంవత్సరం భాద్రపద మాసం శుక్ల పక్షంలో వినాయక చవితి తిథి 6 September 2024 శుక్రవారం మధ్యాహ్నం 3:01 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ తిథి తర్వాత రోజున అంటే 7 September 2024 శనివారం సాయంత్రం 5:37 గంటలకు ముగియనుంది. ఉదయం తిథి ప్రకారం, వినాయక చతుర్థి పండుగ September 7న ప్రారంభo కానుంది. ఈ పవిత్రమైన రోజున వినాయక విగ్రహ ప్రతిష్టాతాను చేయాలి.

వినాయక చతుర్థి రోజున అంటే September 7 శనివారం నాడు గణేష్ చవితి పూజ మొదలుపెట్టేందుకు, వినాయకుడి విగ్రహ ప్రతిష్టాపనకు అనుకూల సమయం ప్రొదున్న 11:03 గంటల నుంచి మధ్యాహ్నం 1:34 గంటల వరకు ఉంటుంది. విఘ్నాలను తొలగించే వాడు వినాయకుడు ఆరాధనకు మధ్యాహ్నం 2:31 గంటలకు కూడా శుభ ముహుర్తం ఉంటుంది. ఈ నేపథ్యంలో గణపతి భక్తులు విశ్వముకుడిని ఆరాధించడం వల్ల మంచి శుభ ఫలితాలొస్తాయని పండితులు చెబుతున్నారు.

హిందూ జ్యోతిష్యం ప్రకారం, ఈ సంవత్సరం గణేష్ చవితి రోజున అనేక శుభ ఫలితాలు ఏర్పడనున్నాయి. ఈ పవిత్రమైన రోజున బ్రహ్మ యోగం, ఇంద్ర యోగం, సర్వార్ధ సిద్ధి మొదలైన శుభా యోగాలు ఏర్పడనున్నాయి. అలాగే చిత్రా నక్షత్రం మధ్యాహ్నం 12:34 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత స్వాతి నక్షత్రం ఆరంభమవుతుంది. ఈ రోజంతా బ్రహ్మ యోగం మరియు సిద్ధి యోగం ప్రభావం అధికంగా ఉంటుంది. సర్వార్ధ సిద్ధి యోగం మరుసటి రోజు అంటే September 8వ తేదీ మధ్యాహ్నం 12:34 గంటల వరకు ఉంటది.

వినాయక చతుర్థి నాడు తెల్లవారుజామునే అంటే సూర్యోదయం లోపు నిద్ర లేచి, కొత్త బట్టలు ధరించి, పూజా మందిరాన్ని లేదా వినాయక మండపాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఈశాన్య దిక్కులో ఒక పీటను తీసుకుని ఎరుపు లేదా పసుపు రంగులోని బట్టను ఆ పీటపై పరచండి. శుభ ముహుర్తంలో వినాయక విగ్రహాన్ని పీఠంపై ప్రతిష్టించాలి. ఆయా ప్రాంతాలను బట్టి 1, 3, 5, 9 రోజుల పాటు పూజా నియమాల ప్రకారం మరియు వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాలను భక్తితో సమర్పించాలి. బొజ్జ వినాయకుడికి ఎంతో ఇష్టమైన సింధూరం మరియు మోదకం సమర్పించాలి. 10 రోజుల పూజ విధానాల తర్వాత విగ్నేశ్వరుడి విగ్రహాన్ని నిమజ్జనం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల లంబోదరుడు తమ జీవితంలో ఎదురయ్యే కష్టాలన్నీ తీరుస్తాడని చాలా మంది భక్తులు నమ్ముతారు.Ganesh Chaturthi 2024

  • వినాయక చవితి రోజున పొరపాటున కూడా రాత్రి వేళ చంద్రుడిని చూడకూడదు అని మన పురాణాలు చెప్తున్నాయి .
  • మన హిందూ పురాణాల ప్రకారం, వినాయక చవితి రోజున చంద్రుడిని చూస్తే చేయని తప్పులకు నిందలు మోయాల్సి వస్తుంది.Ganesh Chaturthi 2024
  • ఈ పవిత్రమైన రోజున మద్యం మరియు మాంసం వంటివి తీసుకోకూడదు.
  • గణేష్ చతుర్థి సమయంలో మధ్యాహ్నం వేళలో నిద్రపోకూడదు.
  • ఈ పండుగ రోజున ఎవ్వరినీ అవమానించడం అలాగే వారిని ఎగతాళి చేయడం వంటివి చేయకూడదు. మీ మనసును ప్రశాంతంగా పెట్టుకోవాలి. భక్తి శ్రద్ధలతో విగ్నాలను తొలగించే ఆ విగ్నేశ్వరుడిని పూజించాలి.

చివరి మాటలు : మన పర్యావరణం రక్షించుకోవడం మన అందరీ బాధ్యత…అందుకోసం మీరు మట్టితో చేసిన వినాయకుడి విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వడం మనకు మన బావితరాలకు ఎంతో శ్రేయస్కరం…

🌻 మీకు మీ కుటుంభ సభ్యులకు మా todayintelugu.com తరపున వినాయక చవితి శుభాకాంక్షలు…!

గమనిక : ఇక్కడ అందించిన విగ్నేశ్వరుడి భక్తి సమాచారం మరియు పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ సమాచారం కేవలం ఊహాల ఆధారంగా ప్రచురించబడ్డాయి. వీటికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు..

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top