Radish in Telugu : కళ్లు చెదిరే ఆరోగ్య ప్రయోజనాలు.. అదేంటో తెలిస్తే మాత్రం బిత్తరపోవాల్సిందే..!

Radish in Telugu : కళ్లు చెదిరే ఆరోగ్య ప్రయోజనాలు.. అదేంటో తెలిస్తే మాత్రం బిత్తరపోవాల్సిందే..!

Radish in Telugu : ముల్లంగిలో ఎన్నో రకాల పోషకాలు, విటమిన్లు ఉన్నాయి. అవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఈ రాడిష్ లేదా ముల్లంగిని సలాడ్ రూపంలో గానీ లేదా సాధారణంగా కర్రీ చేసుకొని తిన్నా కూడా శరీరానికి చక్కటి ప్రయోజనాలు లభిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కలిగిన ముల్లంగి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటు జలుబు, దగ్గు, నోటి సమస్యలు. ఉదరం, మూత్రపిండాలు, డయాబెటిస్ సమస్యల నుంచి క్యాన్సర్ వరకు అనేక సమస్యల నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. అయితే ఈ ముల్లంగిని సరైన టైంకి , సరైన పద్దతిలో తింటేనే, ఆరోగ్యానికి మేలు చేస్తుందని., లేదంటే గ్యాస్ సమస్య, కడుపు సంబంధిత సమస్యలు వస్తాయని ఆయుర్వేదంలో హెచ్చరించడం జరిగింది. ఒకసారి అవేంటో ఇక్కడ పరిశీలిద్దాం.

Mullangi in Telugu : ముల్లంగిని తినడానికి సరైన టైంను ఎంచుకోవాలి . ప్రొద్దున్నే నిద్రలేవగానే ఉదయం ఖాళీ కడుపుతో ముల్లంగిని తినకూడదు. అల్పాహారం తర్వాత గానీ.,భోజనానికి ముందుగానీ ముల్లంగిని తీసుకోవాలి. అలాగే సాయంత్రం వేళ సలాడ్‌గా ముల్లంగిని తినొచ్చు. ఇలా తినడం వల్ల మీరు అనేక రకాలుగా ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. అయితే చాలామంది మధ్యాహ్న భోజనంలో ముల్లంగిని తింటుంటారు. ఆయుర్వేదం ప్రకారం.,వండిన ఆహారంలో పచ్చి కూరగాయలు కలపకూడదు. ఒకవేళ కలిపితే జీర్ణక్రియ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి.

Radish in Telugu : ముల్లంగిని ఎలా తినొచ్చు.. ముల్లంగిని సలాడ్‌గా తినడం ఉత్తమ మార్గం. మీరు ఈ ముల్లంగితో పాటు టమోటా, క్యారెట్, దోసకాయ మరియు ఉల్లిపాయ వంటి మొదలైన ఇతర పచ్చి కూరగాయలను సలాడ్‌గా తీసుకోవచ్చు. ఇలా తినడం మీ ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. సన్నగా ఉన్న చిన్న ముల్లంగిని తినండి. చాలా రుచిగా, తీపిగా ఉంటాయి. ఈ ముల్లంగిని తినే ముందు వాటిని శుభ్రంగా కడిగి., వాటి యొక్క తొక్క తీయండి. బ్లాక్ సాల్ట్ తో కలిపి ముల్లంగిని తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే ముల్లంగి తిన్న తర్వాత కొద్ది సేపు నడవండి. గ్యాస్ మరియు అసిడిటీ మొదలైన సమస్యల నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది.

Radish in Telugu : ఈ రకమైనటువంటి వ్యక్తులు మాత్రం ముల్లంగి తినడం మానుకోవడమే మంచిది. మీకు శరీర నొప్పులు ఉన్నట్లయితే.. మీ శరీరానికి ఎక్కువగా శ్రమ పెట్టలేరు. కాబట్టి ఆ సమయంలో ముల్లంగికి దూరంగా ఉండండి. అంతేకాకుండా రాత్రిపూట ముల్లంగిని ఏ రూపంలోనూ తినకూడదు. దీని వల్ల గ్యాస్ మరియు కడుపు నొప్పి వంటి సమస్యలు రావచ్చు.

ముల్లంగితో కలిపి వీటిని తినకూడదు. మరోవైపు ఈ 4 ఆహార పదార్ధాలతో ముల్లంగిని తింటే విషంతో సమానం. ముల్లంగి-నారింజ, ముల్లంగి-కీరదోస, ముల్లంగి-కాకరకాయ, ముల్లంగి-పాలు.. ఇవి కలిపి తినకూడదు. కనీసం పది గంటల నుంచి ఇరవై నాలుగు గంటల గ్యాప్ ఉండాలి.

గమనిక:- ఈ సమాచారంను కేవలం నిపుణుల సూచనల మేరకు తీసుకోవడం జరిగింది. ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని todayintelugu.com దృవికరించలేదు. అమలు చేయడానికి ముందు వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top