Ginger juice : అల్లం రసం తాగితే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు….అవేంటో ఇక్కడ తెలుసుకోండి…

Ginger juice : అల్లం రసం తాగితే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు….అవేంటో ఇక్కడ తెలుసుకోండి…

మన పూర్వీకుల కలం నుంచి మొదలుకొని సంప్రదాయ వంటల Ginger juice నుంచి ఆధునిక రుచుల వరకూ దాదాపు చాలావరకు అన్ని రకాల వంటల్లో అల్లం ఉండాల్సిందే. అల్లంలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు బి3, బి6, ఐరన్, పొటాషియం, విటమిన్ సి, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి మొదలైన పోషకాలతో పాటు ఇతర పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీనిలో జింజరాల్ యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి… చలికాలంలో అల్లం రసం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ఉపయోగాలను సొంతం చేసుకోవచ్చని మన పూర్వీకుల కలం నుంచి ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

మనం మన పెద్ద వల్లను గమనిస్తే వారు ఎలాంటి వాతానికి సమందించిన రుగ్మతలు లేకుండా ఉండేవారు…కానీ ఇపుడు చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ల వరకు వాతానికి సమందించిన ఎన్నో సమస్యల బారిన పడుతున్నారు…ఇక్కడ మనం మన పెద్ద వల్ల నుంచి తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది…వారు తమ కాళీ సమయంలో లేదా వారికీ ఏదైనా చిన్న సమస్య ఎదురైనా వారు అల్లం ని ఎక్కువ వినియోగించేవారు….అల్లం నిజానికి ఎలాంటి వాతానికి సమందించిన సమస్య ఐనా రాకుండా చేస్తుంది…అంతటి గొప్ప పోషకాలు కేవలం ఈ అల్లం లోనే ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు…మరి ఇంతటి గొప్ప చరిత కలిగిన ఈ అల్లం రసంని ఎలా తయారు చేసుకోవాలి అలాగే తరచు అల్లం రసం తీసుకుంటే ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు జరుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం…

అల్లంలో యాంటీఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. దీనిలో జింజరాల్ యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బూస్ట్ చేస్తాయి. అల్లంలో రోగనిరోధక పనితీరును మెరుగుపరిచే యాంటీ బాక్టీరియల్ గుణాలు అధిక మొత్తంలో ఉంటాయి. ఈ మొదలైన పోషకాలు జలబు, ఫ్లూ, ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తాయి.

అల్లం జీర్ణ ఎంజైమ్ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది, మెరుగైన జీర్ణక్రియ, పోషకాలను శరీరనికి గ్రహించడంలో ఉపయోగపడుతుంది. ఇది ఉబ్బరం, అజీర్ణం, వికారం వంటి మొదలగు సమస్యల నుంచి దూరం చేయడంలో దోహదపడుతుంది.Ginger juice

అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బ్యాక్టీరియల్ ఇంకా యాంటీ వైరల్ గుణాలు మెండుగా ఉంటాయి . ఇది శరీరంలో మంట, జలుబు, దగ్గు, వైరల్ సమస్యల నుంచి ఇది ఉపశమనం కలిగేలా చేస్తుంది. దీనిలోని ఔషధ గుణాలు శ్వాసనాళాన్ని నయం చేస్తాయి. ఇది గొంతు నొప్పిని తగ్గించడానికి మరియు దగ్గు నుంచి ఉపశమనం ఇవ్వడానికి ఉపయోగపడతాయి. శ్వాసకోశ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.Ginger juice

అల్లంలో శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మెండుగా ఉంటాయి. అల్లంలో ఉండే.. జింజెరోల్స్లోని యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు.. శరీంలోని మంటను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇందులో సహజంగా ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల వాపులూ మరియు నొప్పుల్ని అదుపులో ఉంచుతాయి.

అల్లంలోని ఔషధ గుణాలు.. ఇన్సులిన్ విడదలకు, సెన్సిటివిటీకి ఉపయోగపడతాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నివారణలో ఉంచడానికి దోహదపడుతాయి. డయాబెటిస్ ఉన్నవారు రోజూ అల్లం రసం తాగితే ఎంతో మేలు చేకూరుతుంది.

అల్లం రక్త ప్రసరణను ఉతేజపరుస్తుంది, కొలెస్ట్రాల్ స్థాయిలను నివారిస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది. ఈ గుణాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. గుండె సమస్యలు వచ్చే ముప్పును తగ్గిస్తుంది..హార్ట్ ఎటాక్ రాకుండ చేస్తుంది అని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి…

.స్త్రీలకు తమ నెలసరి సమయంలో అల్లం రసం తీసుకోవడం వల్ల అప్పుడు వచ్చే నొప్పులు చాల వరకు తగ్గుతాయి . అధిక రక్తస్రావాన్ని అరికట్టే సుగుణాలు దీనిలో ఉన్నాయని పలు అధ్యయనాలు వెల్లడించాయి…

అల్లంలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మెదడు కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడానికి ఉపయోగపడుతాయి. వయస్సు-సంబంధిత అభిజ్ఞా క్షీణత ప్రమాదాన్ని సమర్థవంతంగా నియంత్రిస్తుంది. తరచు అల్లం రసం తీసుకుంటే.. మెదడు పనితీరును ఆక్టివ్ చేస్తుంది. అల్లం లో వుండే పోషక విలువలు మన మెదడు పని తీరుని మెరుగుపరుస్తుంది…

ఈ మధ్య కాలంలో చాల మంది బరువు సమస్య తో బాధపడుతున్నారు, ఎక్కువ బరువు ఉన్న వారు ఈ అల్లం రసం త్రాగితే ..బరువు కంట్రోల్లో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అల్లం జీవక్రియను పెంచడంలో ఉపయోగపడుతుంది, ఆకలిని నియంత్రిస్తుంది. తద్వారా బరువును నివారణలో ఉంచుతుంది…. ఇది మన శరీరంలో పెరిగే కొవ్వుని కరిగించడంలో చాల వరకు ఉపయోగపడుతుంది…

Note : పైన ఇచ్చిన సమాచారం అంతా కూడా మీ అవగాహన కోసం మరియు అంతర్జాలంలో దొరికిన సమాచారం తీసుకోవడం జరిగింది , ఈ Ginger juice అతిగా తీసుకునే వారు వైద్యుల సలహా తీసుకోగలరు…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top