Dry Ginger Powder : ఈ పొడి వలన కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోవడం మాత్రం ఖాయం.
Dry Ginger Powder : శొంఠి పురాతన కాలం నుంచి దీనిని ఆయుర్వేదంలో విరి విరిగా వాడడం జరుగుతుంది. అల్లం ద్వారానే శొంఠిని తయారు చేస్తారు. శొంఠి పొడిలో ఎన్నో రకాల ఔషద గుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా అనేక వ్యాధులను తగ్గించడానికి ఎన్నో ఎళ్లుగా ఈ శొంఠిని వాడుతున్నారు.
How to Make Dry Ginger Powder:ఈ శొంఠి పౌడర్ ని ఎలా తయారు చేస్తానంటే పచ్చి అల్లాన్ని పాలలో వేసి ఉడక బెడతారు. ఆ తరువాత దాన్ని ఎండబెడితే శొంఠి తయారవుతుంది. దాంతో శొంఠి కొమ్ములు తయారవుతాయి.
Dry Ginger Powder Uses: ముఖ్యంగా వర్షాకాలం శొంఠి లేదా శొంఠి పౌడర్ ని ఇంట్లో వుంటే మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వర్షాకాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు, జీర్ణ సమస్యల గురించి ఇబ్బంది పెడతూ ఉంటాయి. సీజనల్ లో వచ్చేటువంటి వ్యాధులను నివారించడంలో ఈ శొంఠి అద్భుతంగా పనిచేస్తుంది. జలుబు చేసినప్పుడు శొంఠి పొడిని వాటర్ లో కలిపి మరగబెట్టి తాగితే ఉపశమనం లభిస్తుంది. అలాగే మరుగుతున్న టీ లేదా కాఫీలో ఈ శొంఠి పొడి కలిపి తీసుకుంటే., మేలు జరుగుతుంది. తాజా అల్లం కంటే శొంఠి మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుందని, నిపుణులు చెబుతున్నారు.
Dry Ginger Powder Uses:ఈ శొంఠి కొమ్ములను పొడిగా చేసి వాడుతుంటారు.శొంఠి పొడిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో రకాల ఉపయోగాలు అందుతాయి.ముఖ్యంగా ఈ వర్షా కాలంలో రెగ్యులర్‌గా శొంఠి పొడి తీసుకుంటే ఎన్నో జబ్బులకు దూరంగా ఉండొచ్చు.మరి శొంఠి పొడిని ఏవిధంగా వాడాలి? శొంఠిని తీసుకోవడం వల్ల పొందే ప్రయోజనాలు ఏంటీ? అన్న విషయాలు ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.
Dry Ginger Powder : ఈ వర్షాకాలంలో జలుబు, దగ్గు వంటి సమస్యలు తరచూ ఇబ్బంది పెడుతుంటాయి.అయితే ఈ సీజనల్ వ్యాధులను నివారించడంలో శొంఠి పొడి అద్భుతంగా సహాయ పడుతుంది.ఒక గ్లాస్ నీటిలో అర స్పూన్ శొంఠి పొడి, పావు చెంచా లవంగాల పొడి వేసి బాగా మరిగించి ఫిల్టర్ చేసుకోవాలి.ఈ నీటిని గోరు వెచ్చగా అయిన తర్వాత తీసుకోవాలి.
Dry Ginger Powder With Honey Benefits:ఇలా రోజుకు ఒక సారి చేస్తే జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు తగ్గు ముఖం పడతాయి.అలాగే ప్రతి రోజు ఉదయాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో అర చెంచా శొంఠి పొడి వేసి బాగా మిక్స్ తీసుకోవాలి.ఇలా చేయడం వల్ల శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది.
Dry Ginger Powder : దాంతో బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. వేడి పాలల్లో శొంఠి పొడిని కలుపుకొని తాగితే రోగనిరోధక శక్తిని పెరుగుతుంది.కీళ్ల నొప్పులు మటుమాయం అవుతాయి.మరియు హృదయ జబ్బులు వచ్చే ప్రమాదం కూడా తగ్గు ముఖం పడుతుంది.ఇక పరగడుపున నీళ్లల్లో శొంఠి పొడి కలిపి మరగించి అర చెంచా తేనె కలిపి తాగితే అజీర్తి, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు కూడా దూరం అవుతాయి.
జీర్ణ వ్యవస్థ పని తీరు కూడా మెరుగు పడుతుంది:
శొంఠి వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం అనే చెప్పాలి. ఇది ఆహారంలో టేస్ట్ ని పెంచడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని మీ డైలీ డైట్లో చేర్చుకుంటే, జీర్ణక్రియ సమస్యను నయం చేయడంతో పాటు, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. శొంఠి ప్రయోజనాల గురించి కొన్ని ఇక్కడ తెలుసుకుందాం..
బరువును తగ్గిస్తుంది:
శొంఠి అనగా శొంఠి జీర్ణక్రియను మెరుగుపరచడం ద్వారా బరువు తగ్గడానికి దోహద పడుతుంది. అధిక కొవ్వును కరిగించడంలో దోహదపడుతుంది , రక్తంలో చక్కర మొత్తాన్ని నియంత్రిస్తుంది. శొంఠిని తినడం వల్ల ఆకలి తగ్గి, ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు, తద్వారా ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసుకోవచ్చు. శొంఠి పొడిని నీళ్లు లేదా పాలతో కలిపి త్రాగటం వలన బరువును అదుపులో ఉంచుతుంది.
కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:
శొంఠి బాడ్ కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఎక్కువ స్థాయిలో LDL లిపోప్రొటీన్ (బాడ్ కొలెస్ట్రాల్) గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.
జీర్ణ శక్తిని పెంచుతుంది:
శొంఠి పొడి దీర్ఘకాలికంగా ఉన్న అజీర్ణం వల్ల కడుపు నొప్పి , కడుపులో అసౌకర్యం నుండి రిలీఫ్ పొందుతుంది. శొంఠి పొడి ఈ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. మరోవైపు, శొంఠి పొడి వాడటం వల్ల కూడా మలబద్దకం సమస్య నుంచి బయటపడేలా చేస్తుంది.
కడుపు నొప్పిని తగ్గిస్తుంది:
శొంఠి వాడడం వల్ల కడుపు నొప్పితో పాటు బాడీ నొపులకు ఉపశమనం లభిస్తుంది. అదే టైంలో, దాని పొడి డెలివరీ తర్వాత కడుపు శుభ్రం చేయడానికి కూడా ఉపయోగిస్తారు. డెలివరీ తర్వాత శొంఠి లడ్డులు తీసుకోవడం కడుపుని శుభ్రపరచడం ద్వారా శరీరానికి శక్తినిస్తుంది.
వికారం నయం చేస్తుంది:
గర్భిణీ మహిళలో వికారం ,వాంతులు ప్రొద్దుప్రొద్దున్నె అనారోగ్యం , వంటి లక్షణాలతో వ్యవహరించిన్నపుడు ఈ శొంఠి పొడిని తీసుకుంటే , ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇందుకోసం తేనె, గోరు వెచ్చని నీటితో కలిపి అర చెంచా శొంఠి పొడి తాగవచ్చు. అయితే, గర్భధారణ సమయంలో మాత్రం దీనిని ఉపయోగించే ముందు, దయచేసి వైద్యుల సలహాలను సంప్రదించండి.
రక్తంలో షుగర్ స్థాయిని నియంత్రిస్తుంది:
శొంఠి శరీరంలో రక్తంలోని షుగర్ స్థాయిని నియంత్రిస్తుంది. కొద్దిగా శొంఠి పౌడర్ ని గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పుతో కలిపి తినాలి. ఉదయం ఖాళి కడుపుతో దీన్ని తినడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
శరీరంలో మంటను తగ్గిస్తుంది:
ఈ శొంఠిని ఉప్పుతో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో కలిగేటువంటి మంటను తగ్గిస్తుంది. ఇది ముఖ్యంగా కీళ్ళు , వేళ్ళలో వాపును తగ్గిస్తుంది. గాయాల వల్ల కలిగే వాపు నుంచి ఉపశమనం పొందడంలో కూడా ఇది ప్రభావవంతంగా పని చేస్తుంది.
శొంఠి మన దినచర్యలో చేర్చుకుంటే. మన ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద వైద్యులు చెప్పడం జరిగింది. శొంఠిని హీరోగా అభివర్ణించారు. ఘాటుగా ఉండే శొంఠి వలన బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అన్నారు.
గ్యాస్ సమస్య దూరమవుతుంది:
తాజాగా ఉన్న అల్లం వాతాన్ని పెంచుతుంది, శొంఠి వాతాన్ని సమతుల్యంగా ఉండేలా చేయడంలో సహాయపడుతుంది. గ్యాస్ మరియు కడుపు ఉబ్బరం సమస్యలు ఉంటే., గోరువెచ్చని వాటర్ లో శొంఠి పొడిని వేసుకుని తాగితే., ఉపశమనం లభిస్తుంది. శొంఠి పొడి దీర్ఘకాలికంగా వచ్చే అజీర్ణం వల్ల కడుపు నొప్పి , కడుపులో అసౌకర్యం నుంచి రిలీఫ్ ని ఇస్తుంది.
మలబద్ధకానికి చెక్ పెట్టవచ్చు:
శొంఠి పొడిని క్రమం తప్పకుండా మీ డైట్లో చేర్చుకుంటే., జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శొంఠిలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. మలబద్ధకం వంటి జీర్ణ సమస్యల నుంచి రిలీఫ్ పొందేందుకు శొంఠి ఎంతగానో సహాయపడుతుంది. ప్రొద్దున్నే బోన్స్ కదలికలు కష్టంగా ఉంటే., గోరువెచ్చని నీటిలో శొంఠి పొడి కలిపి తీసుకుంటే మీకు ఫ్రీగా ఉంటుంది.
జలుబుకు ఔషదం:
ఈ రోజుల్లో జలుబు, దగ్గు వంటి సమస్యలు సర్వసాధారణం. శొంఠి కఫాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. శొంఠి నీళ్లు తీసుకుంటే జలుబు, దగ్గు దూరమవుతాయి.ఫ్లూ సమస్యతోనూ పోరాడటానికి శొంఠి సహాయపడుతుంది. ఈ రోజుల్లో శొంఠి మీ దినచర్య లో చేర్చుకుంటే ఇన్ఫెక్షన్స్, ఫ్లూ వంటివి మీ దరిచేరకుండా ఉంటాయి.
ఇమ్యూనిటీ పెరుగుతుంది:
శొంఠిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇవి శరీరంలో ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఎలా తీసుకోవాలి..?
How to Use Dry Ginger Powder: శొంఠిని కషాయంగా చేసుకుని తీసుకుంటే.. ఆరోగ్యానికి మేలు జరుగుతుందని, దీన్ని తయారు చేయడం చాలా సులభం. ఒక పాత్ర లో 2 గ్లాసుల నీటిని తీసుకుని, ఒక చిటికెడు శొంఠి పౌడర్ వేసి మరిగించండి. దానిలో 1 గ్లాసు నీరు మిగిలే వరకు మరిగించాలి. ఆ తర్వాత దించి.అది గోరువెచ్చగా అయిన తర్వాత తీసుకోండి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించడం జరిగింది. ఈ కథనం కేవలం మీ యొక్క అవగాహన కోసమే. మీ ఆరోగ్యానికి సంబంధించిన ఏ రకమైన చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమమైన మార్గం. అని గమనించగలరు.