Ponnaganti Kura Benefits in Telugu: ఈ ఆకుకూరను వారంలో ఒక్కసారి తిన్నాసరే..! రోగాలే రావు…
Ponnaganti Kura Benefits in Telugu:మన చుట్టూ ఉండే ఔషధ గుణాలు కలిగిన మొక్కల్లో పొన్నగంటి కూరమొక్క కూడా ఒకటి. ఇది మంచి పోషక విలువలు గలిగినటువంటి ఆకుకూర. ఇది (Alternanthera sessilis) అమరాంథేసి జాతికి చెందిన ఒక ఆకుకూర. తడి ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఈ కూర మొక్క ఎక్కువగా పెరుగుతుంది.
ఈ మొక్క ఆకులు ఆకు పచ్చ రంగులో కొద్దిగా మందపాటిగా పొడుగ్గా, సన్నగా ఉంటాయి. ఈ మొక్క పువ్వులు తెల్లగా చిన్నచిన్నగా చాలా ముద్దగా ఉంటాయి. కాయలు పలుచవిగా ఉంటాయి. ఇది అతి సులువుగా, అతి తక్కువ కాలంలో అభివృద్ధి చెందేటువంటి ఆకు కూర. దీనికి విత్తనాలు అనేసి వుండవు. ఇది కేవలం కాండం ద్వారానే అభివృద్ధి చెందగలదు.పొన్నగంటి కూర ఆకులు సంవత్సరం పొడవునా లభిస్తాయి. ఇక ఈ ఆకుకూర యొక్క లాభాలు తెలిస్తే, మాత్రం అస్సలు విడిచిపెట్టరు.
Ponnaganti Kura Benefits in Telugu: పొన్నగంటి కూరలో Vitamin A, Vitamin C, Riboflavin, Potassium, Magnesium, Iron, Zinc లతోపాటు ప్రోటీన్స్ కూడా అధికంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారు ఈ ఆకు కూరను తరచూ తెచ్చుకొని తింటే చాలా మంచిది. తరచూ తీసుకోవడం వల్ల ఒంట్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ పొన్నగంటి కూర ఆకులలో లభించేటువంటి నూనె పదార్థాలు అధిక రక్తపోటుని తగ్గించి, హృదయ సమస్యల్ని అదుపులో ఉంచడానికి సహాయపడతాయి.రక్తంలో బాడ్ కొలెస్ట్రాల్ దరి చేరుకోకుండా కాపాడతాయి. ఆస్తమా,శ్వాస నాళముల వాపుతో బాధపడేవారు పొన్నగంటి రసంలో కొంచెం తేనెను కలిపి తింటే మంచిది. దీనీలో లభించేటువంటి క్యాల్షియం ఎముకల యొక్క ఎదుగుదలకూ, బోలు ఎముకల వ్యాధి వంటి వాటిని దూరం చేయడానికీ ఉపయోగపడుతుంది.
ఈ పొన్నగంటి కూర జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఒక ఔషధ చికిత్సగా కూడా ఉపయోగిస్తారు. ఆయుర్వేద ఔషధంలోశరీరంలోని రుగ్మతలను శుభ్రపరిచేందుకు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అధిక శరీర వేడి, తలనొప్పిని తగ్గించటానికి దీని నుండి తీసిన థైలాన్ని ఉపయోగిస్తారని తెలుస్తుంది.
Ponnaganti Kura Benefits in Telugu:ఈ ఆకుకూరను వారంలో ఒక్కసారి తిన్నాసరే..! రోగాలే రావు…వైద్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం చుస్తే, పొన్నగంటి కూర ఆకులు నలభై ఎనిమిది రోజులు తింటే, కీలకమైన ఖనిజాలు, పోషకాల అధిక కంటెంట్‌ను అందిస్తుందని, ఇది కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుందని, చర్మానికి సహజమైన సౌందర్యాన్ని కలిగిస్తుందని తెలుస్తుంది. పొన్నగంటి కూరలో జుట్టుకు కూడా పోషణనిచ్చే బయోటిన్ పుష్కలంగా ఉంటుంది.
ఆకుకూరల్లో చాలా రకాలుగా ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఇంకా ఎక్కువ ఆకు కూరలు మన ముందుకు వస్తూనే , వస్తున్నాయి. ఆకు కూరలు ఏవైనా సరే ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని రోజూ తినకపోయినా సరే వారంలో ఒక్కసారి అయినా మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో రకాల దీర్ఘకాలిక, అనారోగ్య సమస్యలకు టాటా చెప్పొచ్చు. ఆకు కూరల్లో పొన్నగంటి ఆకుకూర కూడా ఒకటి.
Ponnaganti Kura Benefits in Telugu:ఈ ఆకుకూరను వారంలో ఒక్కసారి తిన్నాసరే..! రోగాలే రావు…చాలా మంది కేవలం పాలకూర, తోట కూర, గోంగూర వంటి ఆకు కూరలు మాత్రమే తీసుకుంటారు. కానీ వాటితో పాటు పొన్నగంటి కూరను కూడా తీసుకుంటే, ఉండే ఉపయోగాలు అన్నీ ఇన్నీ కావు. కాబట్టి ఈ ఆకుకూరను పోషకాలకు మంచి ఘని గా చెబుతారు. ఈ ఆకు కూరలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఈ ఆకు కూర సంవత్సరం పొడవునా లభిస్తుంది. ఈ ఆకు కూర తీసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది :
పొన్నగంటి కూరలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది తినడం వల్ల శరీరంలో ఇమ్యూనిటీ వ్యవస్థ అనేది బాగా బల పడుతుంది. దీంతో రోగాలు, ఇన్ఫెక్షన్లు, వైరస్‌లతో పోరాడే శక్తి లభిస్తుంది. సీజనల్ వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి.
రక్త హీనత సమస్య ఉండదు :
పొన్నగంటి కూరలో ఐరన్ శాతం అధికంగా ఉంటుంది. కాబట్ టిఅనీమియా సమస్య ఉన్నవారు ఈ ఆకు కూర తింటే సమస్య నుంచి బయట పడొచ్చు. ఐరన్ లోపం కూడా తగ్గుతుంది.
డయాబెటీస్ కంట్రోల్:
ఈ ఆకు కూర తినడం వల్ల షుగర్ వ్యాధి కూడా నియంత్రణలోకి వస్తుంది. మధుమెహం సమస్య ఉన్నవారు తరచూ మీ డైట్‌లో పొన్నగంటి కూరను చేర్చుకోనేలా చేసుకోవాలి. ఇందులో ఫైబర్, యాంటీ డయాబెటిక్ లక్షణాలు కూడా ఉన్నాయి. కాబట్టి రక్తంలో షుగర్ స్థాయిలు అనేవి కంట్రోల్ అవుతుంది.
చర్మానికి మేలు:
పొన్నగంటి కూర తినడం వల్ల చర్మానికి కూడా మేలు జరుగుతుంది. ఈ ఆకుల్లో Vitamin A, C, antioxidants ఉన్నాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి.
క్యాన్సర్ కణాలు నశిస్తాయి:
ఈ పొన్నగంటి కూరలో యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ ఆకు కూర తింటే ఒంట్లో పెరిగే క్యాన్సర్ కారక కణాలు అనేవి నశిస్తాయి.
కంటి ఆరోగ్యం :
పొన్నగంటి కూరలో విటమిన్ A కూడా లభ్యమవుతుంది. ఈ విటమిన్ కంటి ఆరోగ్యాన్ని పెంచడంలో చక్కగా సహాయం చేస్తుంది. కంటికి సంబంధించిన అన్ని సమస్యలను తగ్గిస్తుంది. కంటి చూపు కూడా బాగుపడుతుంది.
మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. ఆకు కూరలు తినడానికి చాలా మంది అయిష్టపడతారు.దానికి రీజన్ అవి కొద్దిగా పసరు వాసన వస్తాయని, నోటికి రుచిగా ఉంటేనే తినే రోజులు అయ్యాయి. అయితే ఈ ఆకు కూరను కొంచెం టెస్ట్ గా వండుకుని తింటే చాలా ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి వాటిలో మొదటిది పొన్నగంటి కూర. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది.
Ponnaganti Kura Benefits in Telugu: ప్రస్తుత జీవనశైలిలో టివి, కంప్యూటర్ లేనిదే రోజు గడవడం లేదు. వీటి వల్ల వచ్చే కాంతి కళ్లకు చాలా హని చేస్తుంది. చిన్న వయస్సులోనే దృష్టి లోపం వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఇలాంటప్పుడు తరచూ పొన్నగంటి కూరను తింటే కళ్లకు ఎంతో మంచిది అని వైద్య నిపుణులు చెబుతున్నారు. పొన్నగంటి ఆకు రసంలో వెల్లుల్లి ని దంచి,దానితో పాటుగా తీసుకుంటే గొంతు, ఉబ్బసం, ఆయాసం వంటి సమస్యలు మాటు మాయమవుతాయి. కండరాలు, నడుము నొప్పి మరి ఇతర నొప్పులకు కూడా పొన్నగంటి కూర తింటే మంచి ఫలితం ఉంటుంది.
Ponnaganti Kura Benefits in Telugu: పొన్నగంటి కూర సంతాన సాఫల్యతను పెంచుతుందని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు. మలబద్దకం, మూలశంక వ్యాధితో బాధపడేవారు క్రమం తప్పకుండా ఆవు నేయ్యి తో కలిపి ఈ పొన్నగంటి కూరను వండుకుని తింటే మొలల వ్యాధి, మలబద్దకం నివారణ అవుతాయి. పొన్నగంటి కూర మన శరీరంలో ఉన్న చెడు రక్తాన్ని క్లీన్ చేస్తుంది. దీని వల్ల బీపీ అదుపులో ఉంటుంది. తరచు పొన్నగంటి కూర తినడం వల్ల శరీర ఛాయలో మెరుపు వస్తుందని, చర్మం మంచి కాంతివంతంగా తయారవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
రక్తపోటును నివారిస్తుంది. తద్వారా గుండెకు సంబంధిచిన సమస్యలు దరి చేరవు. శ్వాస నాళముల వాపుతో బాధపడుతున్న వారు ఒక చెంచాడు పొన్నగంటి ఆకు రసాన్ని తేనెతో కలిపి తీసుకుంటే, మంచి ఫలితం ఉంటుంది. పొన్నగంటి కూరలో ప్రోటీన్లు అధిక శాతం ఉన్నాయి. కాబట్టి ఈ కూరను తరచు తీసుకుంటే ఎంతో మేలు. ఇందులో అన్ని రకాల విటమిన్లు, మోగ్నీషియం, ప్రొటీన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి
గమనిక : ఇందులోని అంశాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. మీకు ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.Ponnaganti Kura Benefits in Telugu