Flax Seeds In Telugu : అవిసె గింజలతో ఆరోగ్యానికి కలిగే అద్భుతాలు.. వీటిని ఎలా తీసుకోవాలి? Avise Ginjalu
Flax Seeds In Telugu : ఫ్లాక్స్ సీడ్స్‌ను తెలుగులో అవిసె గింజలు అంటారు. వీటితో ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. చెప్పలేనన్నీఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తాయి ఈ అవిసె గింజలు. అయితే వాటిని ఎలా తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.
అవిసె గింజల యొక్క ప్రయోజనాలు :
Avise Ginjalu : ఇంగ్లీషులో ఫ్లాక్స్ సీడ్స్గా పిలుచుకునే అవిసె గింజలు చాలా పోషకాలను కలిగి ఉంటాయి. ఆరోగ్యంగా ఉండాలంటే మనం సరైన ఆహారం తీసుకోవాలి. ఇందులో భాగంగా విత్తనాలు ఆహారంలో చేర్చుకొని తినడం వలన ఎంతో మేలు జరుగుతుంది. అవిసె గింజలను తినడం వలన ఇంకా ప్రయోజనాలు కలుగుతాయి. అవిసె గింజలు మన ఆరోగ్యానికి అత్యంత ఉపయోగకరమైన విత్తనాలుగా ఉన్నాయి. ఇప్పుడు కాదు పురాతన కాలం నుండి కూడా వీటిని మంచి ఆరోగ్యం కోసం తింటున్నారు.
Flax Seeds In Telugu : అవిసె గింజలు (Flax seeds) సహజాంగా ఉండే ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి దీని కోసం ఎక్కువగా వీటిని ఉపయోగిస్తారు. ఇది ఇండియాలో ప్రధానంగా గ్రామాల్లో విస్తృతంగా ఉపయోగిస్తారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో దీని ఆరోగ్య ప్రయోజనాలు తెలిసిన వారు మాత్రమే ఎక్కువగా తీసుకుంటున్నారు. కానీ నిజానికి ఈ అవిసె గింజలను అందరూ తినాలి.
అవిసె గింజలు ఎలా తీసుకోవాలి?
Flax Seeds In Telugu : అవిసె గింజలను రోజూ నీళ్లతో కలిపి తీసుకోవాలి. వీటిలో పోషకాలు అధికంగా ఉన్నాయి. అనేక వైద్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. ఇప్పటికి ఈ విత్తనాలను అద్భుతమైన కొలెస్ట్రాల్ తగ్గించే విత్తనాలుగా చెబుతారు.మనిషి శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. ఇందులోని మరో ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే వీటిని పొడి చేసి కూడా తీసుకోవచ్చు. అవిసె గింజల పొడిని ప్రతిరోజూ నీటితో సేవించవచ్చు. ఇది మీ శరీరానికి అవసరమైన ఫైబర్‌ని అందిస్తుంది. వీటిని తీసుకునేటప్పుడు నీళ్లు ఎక్కువగా తాగాలని నిర్ధారించుకోండి. కావాలంటే వేయించి కూడా తినవచ్చు. ఫ్లాక్స్ సీడ్స్‌తో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
కొలెస్ట్రాల్ తగ్గుతుంది :
మీరు ఎవరికైనా మంచి ఆరోగ్యకరమైన ఆహారమును ఇవ్వాలని అనుకుంటే ,మాత్రం అవిసె గింజలను ఇవ్వవచ్చు. రెండు టీ చెంచా అవిసె గింజలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ సాధారణంగా చేపలలో ఉంటాయి. చేపలు తినని వారు ఈ అవిసె గింజలు తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వీటి వలన అందమైన చర్మాన్ని కూడా పొందవచ్చు.
అధిక రక్తపోటు నివారించవచ్చు:
అవిసె గింజలు వివిధ వ్యాధులతో పోరాడటానికి సహజంగా లభించే పెస్కాటేరియన్లను తినడానికి ఇది మంచి మార్గం. ఇవి సాధారణంగా ఆల్ఫా లినోలెయిక్ ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఈ యాసిడ్ హృదయ జబ్బులు, కీళ్లనొప్పులు, ఆస్తమా, మధుమేహం మొదలైన సమస్యల వల్ల వచ్చే మంటను నివారిస్తుంది. అలాగే క్యాన్సర్ వంటి వాటిపై కూడా ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. చేపలు, వాల్‌నట్‌లతో పాటు కూడా ఈ అవిసె గింజలను తినడం వల్ల మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు. అధిక రక్తపోటును కూడా నివారించవచ్చు.
ఫ్లాక్స్ సీడ్స్‌లో ఉండే ఎక్కువ మొత్తంలో ఫైబర్ మన శరీరానికి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పీచు పదార్థం త్వరగా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. తక్కువగా తినేలా చేస్తుంది. ఇది మీ రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది. మీ పేగులు బాగా పని చేస్తాయి.
చర్మానికి అవిసె గింజలు మంచివి :
Anti aging cream ప్రకటనల గురించి మీరు విని ఉండవచ్చు.ఫ్లాక్స్ సీడ్స్‌లో చర్మం బాగుండేటువంటి పోషకాలు దొరుకుతాయి. ఇవి పేగులపై పనిచేసి స్త్రీల హార్మోన్లను సమతుల్యం teluguvanam.comచేస్తాయి. సంతానోత్పత్తిని కూడా పెంచడంలో సహాయపడతాయి. బ్రెస్ట్ క్యాన్సర్, పెరి-మెనోపాజల్ లక్షణాలను తగ్గిస్తాయి.
ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మార్కెట్లో దొరికే ఎన్నో రసాయన ఉత్పత్తులు వాడి మీ ఆరోగ్యాన్నీ పాడు చేసుకునే బదులు అవిసె గింజలను తినండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మీ సొంతమవుతాయి. చాలా ఆరోగ్యంగా ఉంటారు. కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు ఉన్నవారు బయటపడతారు.
అవిసె గింజల్ని వీరు అస్సలు తినొద్దొట..
Flax Seeds In Telugu :ఆయుర్వేదంలో ఈ అవిసె గింజల గురించి మాట్లాడేప్పుడు.. ఈ గింజలు శరీరంలో వాతాన్ని సమతుల్యం చేస్తాయని చెబుతుంటారు. వాటిని ఇమ్యూనిటీ, మేధ్య అని లేదా మెదడు బూస్టర్‌గా కూడా పిలుస్తారు. కాబట్టి.. వీటిని తీసుకోవడం చాలా మంచిది. ఈ విత్తనాలలో ఒమేగా 3, ఒమేగా 6లు పుష్కలంగా ఉంటాయి. ADHD, హైడర్ టెన్షన్, అల్జీమర్స్ వంటి వ్యాధులు వీటిని తినడం వల్ల దూరమవుతాయి.
ఆయుర్వేదం ప్రకారం, వీటిని తినేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవి వేడిని కలిగిస్తాయి. శరీరంలోని పిత్త, కఫా మూలకాలలో అసమతుల్యతను కలిగిస్తాయి. కాబట్టి వీటి పొడిని , అకాల ముడతలు, పుండ్లు వంటి చర్మ సమస్యలను రాకుండా ఉండేందుకు దీనిని మందులా మితంగా తీసుకోవాలి.
Flax Seeds In Telugu : ఆయుర్వేదం ప్రకారం చుస్తే, పోషకాహార లోపం, ఎముకలు, కీళ్ళ నొప్పులు, బలహీనత, పీరియడ్స్ టైమ్‌లో తక్కువ బ్లీడింగ్ వంటి సమస్యలు ఉన్నవారు ఈ ఫ్లాక్స్ సీడ్స్‌ని తమ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇలాంటి సమస్యలన్నీ కూడా దూరమయిపోతాయి. అలాగే, మీరు డీహైడ్రేషన్ వంటి సమస్యలు ఎదుర్కొన్నా ఈ అవిసె గింజలు మీకు సహాయం చేస్తాయి. అదే కాకుండా.. తక్కువ బరువుతో బాధపడేవారు కూడా వీటిని తినడం వల్ల సరైన బరువుకి గేన్ అవుతారు.
వీటిని ఎక్కువ తినడం వల్ల హార్మోన్ల సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు పీరియడ్స్ టైమ్‌లో ఉన్నా, శరీరంలో అధికంగా వేడితో ఉన్నా లేదా ప్రెగ్నెంట్ కావాలనుకుంటున్నా, శృంగార సమస్యలు ఉన్నా.. ఈ గింజలను తీసుకోకపోవడమే మంచిది.
Flax Seeds In Telugu :వీటిని ఎలా తినాలంటే.. వీటిని లడ్డూల్లా చేసుకుని తినొచ్చు. పౌడర్ లాగా చేసుకొని, ఇడ్లీ, అన్నం, దోశ వంటి వాటితో కలుపుకొని తినొచ్చు.మనం వండుకొనే కూరల్లో ఆ పొడిని కూడా వాడుకోవచ్చు. అయితే, వీటిని చేసుకునేందుకు అంతర్జాలంలో ఎన్నో వీడియోస్ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ముందుగా చెప్పుకున్నట్లు వీటి కొలత విషయంలో జాగ్రత్త అవసరమని చెబుతున్నారు నిపుణులు.
గమనిక: ఈ సమాచారాన్ని కేవలం మీ అవగాహన కోసం మాత్రమే ఈ విషయాలన్నీ అంతర్జాలం నుండి సేకరించడం జరిగింది. ఈ Avise Ginjalu ని ఎక్కువగా తీసుకునేవారు వైద్యుల సలహా మేరకు తీసుకోవడం ఉత్తమం.