About Bathukamma in Telugu : ఈ ఏడాది బతుకమ్మ పండుగ ఎప్పుడు వచ్చింది? ఈ పండగ యొక్క ప్రాముఖ్యత ఏంటి? Bathukamma 2024

About Bathukamma in Telugu : ఈ ఏడాది బతుకమ్మ పండుగ ఎప్పుడు వచ్చింది? ఈ పండగ యొక్క ప్రాముఖ్యత ఏంటి? Bathukamma 2024

About Bathukamma in Telugu : బతుకమ్మ పండుగను అశ్విన్ ఆశ్వయుజములో తొమ్మిది రోజులు జరుపుకుంటారు. భాద్రపద అమావాస్య లేదా మహాలయ అమావాస్య నాడు బతుకమ్మ ప్రారంభమవుతుంది. మరియు అష్టమి 9వ రోజున సద్దుల బతుకమ్మ వేడుకతో ముగుస్తుంది. ఇది భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల్లో దుర్గా అష్టమిగా ప్రసిద్ధి చెందింది.

Bathukamma 2024 Date : విజయ దశమి సమయంలో తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ జరుపుకుంటారు. ఈ సంవత్సరం భాద్రపద అమావాస్య అక్టోబర్ 2వ తేదీన వచ్చింది. ఈరోజు నుంచి బతుకమ్మ వేడుకలు ప్రారంభమవుతాయి. తొమ్మిది రోజుల పాటు జరుపుకునే ఈ వేడుకలు దుర్గాష్టమి రోజు జరుపుకునే సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి.

Bathukamma 2024 :సంస్కృతి, సాంప్రదాయాలకు తెలంగాణ ఒక నిలయమైతే అందుకు ప్రతీకగా నిలిచేది ఈ బతుకమ్మ పండుగ. ప్రకృతిని ఆరాధిస్తూ.. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పేటువంటి పండుగ బతుకమ్మ. ఇదొక పూల జాతర పండుగ. ఎక్కడా లేని విధంగా ప్రకృతిని పూజించేటువంటి పండుగ. దసరా నవ రాత్రుల వేళ తొమ్మిది రోజుల పాటు తెలంగాణ ఆడపడుచులు ఆడి పాడి గౌరీ దేవిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించే,ఈ పండగ తెలంగాణకే ప్రత్యేకమైన పూల సంబురం బతుకమ్మ పండుగ.

About Bathukamma in Telugu : ప్రతి సంవత్సరం ఆశ్వయుజ అమావాస్య నాడు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమయ్యే, ఈ సంబరాలు తొమ్మిది రోజులపాటు సాగి సద్దుల బతుకమ్మ రోజు గౌరమ్మను సాగనంపడంతో ఈ బతుకమ్మ సంబరాలు ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజుల పాటు మహిళలు చేసే హడావుడి అంతా ఇంతా ఉండదు మరి.

ప్రకృతిలో మనకు లభించేటువంటి ప్రతి పువ్వు ను వెతికి వెతికి తెచ్చి, రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, నిత్యం గౌరీదేవిని తమ ఆటపాటలతో ఆనందంగా పూజిస్తారు. అందరూ కలిసి సంతోషంగా ఆనందంతో హుషారుగా పాటలు పాడుతూ, బతుకమ్మ ఆటలను ఆడతారు. ఒకరు పాడుతుంటే మిగతా వారంతా వారికి కోరస్ పాడతారు. పితృ అమావాస్య రోజు తమ తమ పెద్దలను పూజించుకుంటూ, వారి పేర్లమీద బ్రాహ్మణుడికి బియ్యం,కూరగాయలు,నూనెలు,పప్పులు,ఇంకా వారికి తోచిన పారితోషకంను పంచి పెడతారు. అదే రోజు నుండి బతుకమ్మలను పేర్చి మహిళలు సంబరాలు జరుపుకోవడంని స్టార్ట్ చేస్తారు.

Bathukamma 2024 : బతుకమ్మ పండుగ జరుపుకోవడానికి వినియోగించే, పూలకు కూడా ఒక విశిష్టత ఉంది. ఔషధ గుణాలున్న పువ్వులను బతుకమ్మలుగా పేర్చడం కోసం ఉపయోగిస్తారు. తంగేడు, గునుగు, బంతి, చేమంతి, కట్ల, సంపెంగ, మొల్ల, సీత జడలు, మరువం, పారిజాతం, కమలం, తామర, గన్నేరు గుమ్మడి, రుద్రాక్ష, పోక బంతి, మల్లె, మందార, గులాబీ, పట్టుకుచ్చులు పూలతో చక్కగా బతుకమ్మలను పేర్చి బతుకమ్మ సంబరాలను జరుపుకుంటారు.

About Bathukamma in Telugu : ఈ బతుకమ్మ సంబరాలలో భాగంగా మహిళలు అందంగా ముస్తాబై ,అత్యంత భక్తి శ్రద్ధలతో తయారుచేసిన బతుకమ్మలను గౌరమ్మలను తీసుకొని ఆలయాలలో, వీధులలో అందరూ గుంపుగా కూడి బతుకమ్మ ఆటలు ఆడుతూ ఉంటారు. తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ గ్రామీణ జీవనాన్ని ప్రతిబింబించేలా జానపద పాటలను పాడుతూ ఈ పండుగను జరుపుకుంటారు. బతుకమ్మ పాటలు పాడే కొందరు మహిళలు యూట్యూబ్‌ ద్వారా పాపులర్ కూడా అయ్యారు.

ధర్మాంగతుడు అనే చోళ చక్రవర్తి దక్షణపథాన్ని పాలించేవాడు. పేరుకు తగ్గట్టుగానే ఆయన చాలా ధర్మాత్ముడు. ఆయన భార్య సత్యవతి. కానీ ఒక యుద్ధంలో ఆయన తన రాజ్యాన్ని కోల్పోయి, తన భార్య సత్యవతితో కలిసి అడవులకు వెళ్తాడు. అక్కడ ఆయన ఆయన శ్రీ మహాలక్ష్మి కోసం తపస్సు చేస్తాడు.

About Bathukamma in Telugu : కొంత కాలానికి లక్ష్మీదేవి కరుణించి సాక్షాత్కరించి ఏం వరం కావాలో కోరుకొమ్మని తనను అడుగుతుంది. వాళ్లకు సంతానం లేక వాళ్ళు ఎంతో బాధ పడుతున్నామని, నీవే మా కుమార్తెగా జన్మించాలని వేడుకుంటారు. అందుకు శ్రీ మహాలక్ష్మి దేవి వాళ్ళ యొక్క వరాన్ని మన్నించి ,సంతోషింతో వరాన్ని ప్రసాదిస్తుంది. కొంత కాలానికి తన భార్య అయిన సత్యవతి గర్భాన సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి దేవి యే జన్మిస్తుంది. ఆ బాలికను చూసి మునులు, ఋషులు మరియు పండితులు ఎంతో సంతోషించి ఆమెకు ‘బతుకమ్మ’ అని పేరు పెట్టి , దీవిస్తారు.

నాటి నుంచి ఆమెను బతుకమ్మగా పిలుస్తారు. బతుకమ్మ జన్మించిన కొంత కాలానికి ధర్మాంగతుడు తన రాజ్యాన్ని పొండుతాడు. బతుకమ్మ యుక్త వయస్సుకు వస్తుంది. శ్రీ మహా విష్ణువు యే చక్రంశకుడు అనే రాజుగా జన్మించి, బతుకమ్మను వివాహము చేసుకుంటాడు. ఆ దంపతులు ఇద్దరు సిరిసంపదలతో రాజ్యపాలన చేశారని తెలంగాణలో పౌరాణిక కథ ప్రచారంలో ఉంది.

పూలను జాగ్రత్తగా అడవి నుండి తెచ్చి , వాటినన్నింటిని ఒక రాగి పళ్లెంలో వాటిని అందంగా వలయాకారంగా, రంగులు మార్చుకుంటూ, రంగు రంగు పూలను పేరుస్తారు. మొదట గుమ్మడి ఆకులు , గుమ్మడి పూలతో ఆ రాగి పళ్లెంలో వేసి, తంగెడు ఆకులు, పూలు పళ్లెంలో పేర్చుతూ ,ఆపై తంగేడు పూలతో కట్టలుగా కట్టిన పులా కట్టలను పేర్చుతారు. మధ్యమధ్యలో ఇతర రకాల పూలను ఉపయోగిస్తారు. ఈ పులా అమరికలతో ఎంత పెద్దదిగా ఉంటే అంత అందంగా ఉంటుంది.

About Bathukamma in Telugu : తెల్లని గునుగు పూలను రంగులతో అద్ది పేర్చుతారు. బంతి పూలు,పట్టుకుచ్చుల పూలు,పోకబంతి పూలు,గడ్డి పూలు ఇలా ప్రకృతిలో దొరికే ప్రతి ఒక పువ్వును కూడా ఈ బతుకమ్మ పేర్చే, వరుసలలో పెట్టి, మొత్తము పేర్చడం పూర్తి, అయ్యాక బతుకమ్మ పైభాగంలో.. పసుపుతో చేసిన గౌరీ మాతను ఉంచుతారు. ఇలా పేర్చిన బతుకమ్మను దేవుడి గదిలో పెట్టి, కొవ్వొత్తులు, అగరొత్తులతో అలంకరించి నైవేద్యం పెట్టి పూజిస్తారు. సాయంత్రం టైం కాగానే , మహిళందరూ కలిసి తమ బతుకమ్మలతో ఒక చోటకి చేరి వాటిని మధ్యలో పెట్టి వాటి చుట్టూ తిరుగుకుంటూ, గౌరీ దేవిని కీర్తిస్తూ పాటలు పాడుతూ సంతోషంగా ఆడుకుంటారు.

About Bathukamma in Telugu : సద్దుల బతుకమ్మ రోజు తెలంగాణ లో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకుతాయి. లక్షలాది మంది మహిళలు పట్టు చీరలు కట్టుకొని, నగలతో సింగారించుకుని,పుత్తడి బొమ్మల్లా ముస్తాబై సద్దుల బతుకమ్మ పండగను జరుపుకుంటారు. పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఒక్క చోట చేరి ఆడి పాడి డాన్సలతో సంతోషంగా గడుపుతారు. ఇలా చాలా సేపు ఆడాక ఆడవాళ్లు మగవారు కలిసి వెళ్లి వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అంటూ పళ్లెంలో గౌరీ మాత ప్రతిమ అయిన పసుపు ముద్దను ముత్తైదువులందరు కలిసి ఒకరికొకరు మొహాలకి , తాళిబొట్టులకి పెట్టుకుంటారు.ఇలా వాయనాలు ఇచ్చి పుచ్చుకుంటారు.

తెలంగాణా లో జరిగే ఈ బతుకమ్మ వేడుకలలో మొదటి రోజూ నుండి చివరి రోజు వరకు ఒక్కో రోజు చేసే ఒక్కో బతుకమ్మకు ఒక్కో పేరుతో పిలుస్తూ, ఒక్కో రోజు ఒక్కొక్క ప్రసాదాన్ని చేసుకొని తీసుకెళ్తారు. అవి ఏంటో ఇక్కడ చూద్దాం.

About Bathukamma in Telugu : ఎంగిలి పూల బతుకమ్మ అమావాస్య రోజు పేరుస్తారు. ఆ రోజు ప్రసాదంగా ఆకు వాక్క తీసుకెళ్తారు. కొంతమంది పాన్ కట్టించుకొని తిసుకెళ్తారు.

తొమ్మిది రోజుల బతుకమ్మ సంబురాల్లో భాగంగా రెండో రోజును అటుకుల బతుకమ్మగా పిలుస్తారు. అటుకులు,బెల్లం,ను ప్రసాదంగా స్వీకరిస్తారు.

మూడో రోజు పేర్చే బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మగా పిలుస్తారు. బతుకమ్మ నిమజ్జనం అనంతరం ప్రసాదంగా ముద్దపుప్పు మరియు బెల్లం, పాలతో కలిపి తయారు చేసిన పాయసాన్ని స్వీకరిస్తారు.

4వ రోజు నాన బియ్యం బతుకమ్మగా పిలుస్తారు. పాలు, బెల్లం, నానపెట్టిన బియ్యంతో తయుచేసిన స్వీట్ తయారు చేసి, ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుంటూ,ప్రసాదాన్ని తీసుకుంటారు.

ఐదో రోజు పేర్చే బతుకమ్మను అట్ల బతుకమ్మగా పిలుస్తారు. బతుకమ్మ నిమజ్జనం అనంతరం బియ్యం పిండితో వేసిన అట్ల (దోశలు)ను ప్రసాదంగా స్వీకరిస్తారు.

ఆరో రోజు బతుకమ్మను అలిగిన బతుకమ్మగా పిలుస్తారు. ఆ రోజు అరిష్టంగా భావించి బతుకమ్మను పేర్చరు, ఆడరు. కొన్ని ప్రాంతాల్లో బతుకమ్మను పేర్చినా ప్రసాదం ఏమీచేయరు.

ఈ రోజు బతుకమ్మను పేర్చి ప్రసాదంగా సకినాలు తయారు చేసే పిండితోనే వేపకాయలంత సైజు లో ముద్దలలాగా చేసి నూనెలో వేయించి తిన వాటిని ప్రసాదంగా తీసుకుంటారు.

వెన్నముద్దల బతుకమ్మగా పిలిచే ఈ రోజు నువ్వులు, వెన్న, బెల్లం, నెయ్యితో కలిపి తయారు చేసిన లడ్డులను ఫలహారం ఈ రోజు ప్రత్యేకం.

బతుకమ్మ సంబురాల్లో చివరి బతుకమ్మ సద్దుల బతుకమ్మ. ఈ రోజు ఫలహారంగా మలీద , పెరుగన్నం ఆవకాయతో సద్దిఅన్నం చింతపండు లేదా నిమ్మకాయలతో తయారు చేసిన పులిహోర, కొబ్బరి తురుముతో చేసిన సద్ది అన్నం , నువ్వుల పొడి కలిపిన సద్ది అన్నం , సద్దుల బతుకమ్మ రోజు వండి తినే ప్రసాదాలు.ఇవే కాకుండా తినడానికి ఇంకా రకరకాల వంటకాలను కూడా చేసుకొని తిసుకెల్త్తారు.

About Bathukamma in Telugu : బతుకమ్మ పండుగ అంటే, ప్రకృతి మాత, నీరు మరియు మానవుల మధ్య సంబంధాన్ని తెలిపే పండుగ అని చెప్పవచ్చు. మొదట మహిళలు దుర్గాదేవికి మట్టి రూపాన్ని తయారు చేస్తారు. ఈ మట్టి రూపాన్ని ‘బొడ్డెమ్మ’ అని అంటారు. మహిళలు బతుకమ్మ కంటే ముందురోజే బావిలో లేదా చెరువులలో ఈ ‘బొడ్డెమ్మ’ను నిమజ్జనం చేస్తారు.

ప్రజల విశ్వాసాలలో ఈ ప్రక్రియ చాలా ముఖ్యమైనది. ఈ విగ్రహ రూపాలను నిమజ్జనం చేయడం వల్ల చెరువు లేదా బావి యొక్క శక్తిని పెద్దది చేయడంలో సహాయపడుతుంది. మరియు ఎక్కువ నీరు నిలుపుకోవడంలో సహాయపడుతుందని ప్రతీక. చెరువులో గాని బావిలో గాని నిమజ్జనం చేసిన పూలతో అందులోని నీటిని శుద్ధి చేసి శుభ్రపరుస్తాయి. చెరువు , బావి నీటి నాణ్యత కూడా మెరుగుపడుతుంది.

About Bathukamma in Telugu : బతుకమ్మకి సాంస్కృతిక ప్రాముఖ్యత ఎంతో ఉంది. ఇది ప్రాంత సంస్కృతిని కాపాడే పద్ధతి. ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇటీవల, నీటి వనరులు క్షీణిస్తున్నాయని ప్రజల అందరికి తెలిసిన విషయమే. బతుకమ్మ పండుగలో పూలతో పాటు విగ్రహ రూపాలను నిమజ్జనం చేయడం ఒక ముఖ్యమైన భాగం.

చెరువులో నిమజ్జనం చేసిన పూలు చెరువును శుద్ధి చేయడంతోపాటు చెరువులోని నీటి నాణ్యతను మెరుగుపరుస్తాయి. ఈ విధంగా, బతుకమ్మ అనేది సంస్కృతిని పరిరక్షించే మార్గం మాత్రమే కాదు, ఇది మానవుల మరియు ఇతర జీవుల మనుగడకు ముఖ్యమైన నీటి వంటి సహజ వనరులను సంరక్షించే పండుగ కూడా .

About Bathukamma in Telugu : బతుకమ్మ సంబరాలు సద్దుల బతుకమ్మకు ఒక వారం ముందు ప్రారంభమవుతాయి.లాస్ట్ రోజు ఇది బతుకమ్మ చివరి రోజును సూచిస్తుంది. తెలంగాణ మహిళలు, కొత్తగా పెళ్లిళ్లు అయిన మహిళలు తమ తమ పుట్టింటికి వెళ్లి , చిన్ననాటి స్నేహితులను కలుసుకొని ఆనందంతో ఎంతో వేడుకగా ఈ పండగను సామూహికంగా జరుపుకుంటారు.

రంగులతో రంగోలీలు వేసి, వాటి మధ్యలో అందంగా పేర్చిన బతుకమ్మలను పెట్టి , వాటి చుట్టూ ఆడుకుంటూ, పాటలు పాడుకుంటుంటారు బతుకమ్మ చివరి రోజున, కుటుంబంలోని పురుషులు ‘గునుగు ‘ మరియు ‘తంగేడి’ పువ్వుల కోసం అడవి లోన దొరికే పులా కోసం అన్వేషిస్తారు, ఇవే కాకుండా ప్రకృతి ఒడిలో దొరికే అన్ని రకాల అడవి పువ్వులు తీసుకొచ్చి వాటితో బతుకమ్మను పేర్చుతారు.

About Bathukamma in Telugu :సద్దుల బతుకమ్మ రోజు తెలంగాణ లో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని తాకుతాయి. లక్షలాది మంది మహిళలు సాంప్రదాయకంగా ఉండేటువంటి దుస్తులు,పట్టు చీరలు కట్టుకొని, నగలతో సింగారించుకుని,పుత్తడి బొమ్మల్లా ముస్తాబై సద్దుల బతుకమ్మ పండగను జరుపుకుంటారు. పేద, ధనిక అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఒక్క చోట చేరి ఆడి పాడి డాన్సలతో సంతోషంగా గడుపుతారు.

ఇలా చాలా సేపు ఆడాక ఆడవాళ్లు మగవారు కలిసి వెళ్లి వాటిని చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆపై ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అంటూ పళ్లెంలో గౌరీ మాత ప్రతిమ అయిన పసుపు ముద్దను ముత్తైదువులందరు కలిసి ఒకరికొకరు మొహాలకి , తాళిబొట్టులకి పెట్టుకుంటారు.ఇలా వాయనాలు ఇచ్చి పుచ్చుకుంటారు.About Bathukamma in Telugu

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top