పుట్టెడు పోషకాలను కలిగినటువంటి ఈ ఆకును ఎలా వాడినా సరే అద్భుతమైన ప్రయోజనాలే! Pudina in Telugu.Mint Leaves in Telugu.

పుట్టెడు పోషకాలను కలిగినటువంటి ఈ ఆకును ఎలా వాడినా సరే అద్భుతమైన ప్రయోజనాలే! Pudina in Telugu.Mint Leaves in Telugu.

Pudina in Teluguప్రకృతి ప్రసాదించిన వాటిలో పుదీనా కూడా ఒకటి. ఫ్రెష్ ఫీలింగ్ ను ఇచ్చేటువంటి మరియు ఎన్నోరకాల ఆరోగ్య సుగుణాలు ఉన్నటువంటి ఆకు ఈ పుదీనా . ఈ పుదీనాను మన రోజువారీ ఆహారంలో తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

Mint Leaves in Telugu : బరువు తగ్గడానికి పుదీనా నీళ్లు ఎంతగానో సహాయపడుతుంది. మంచి టేస్ట్ తో పాటు దాని మంచి సువాసన కూడా కలిగి ఉండే పుదీనా జ్యూస్ ను తీసుకోవడం వల్ల, మరియు పుదీనా ను టీ చేసుకుని తాగడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Pudeena : మన తెలుగింటి ప్రత్యేకమైన వంటకాల్లో పుదీనా ఉండి తీరాల్సిందే. ఇక పుదీనా గురించి చెప్పాలంటే , తేనీటి నుంచి మొదలు పెడితే ఆల్కహాల్ వరకూ అనేక పానీయాల్లో దీనిని వినియోగన జరుగుతుంది . చాలా సలాడ్స్‌లో, డెజర్ట్స్‌లో కూడా పుదీనాను వాడుతారు.

Pudina in Telugu : ఇక చాలా మంది ఇష్టపడే,బిర్యానీల వంటకాలలో ఈ పుదీనాను బాగా వాడుతారు. Non Veg వంటకాల్లో చాలా వరకు పుదీనా వాడతారు. ఇంత ప్రత్యేకత పొందిన ఈ పుదీనాలో ఏముంది? పుదీనా అంటే అంత స్పెషల్. ముందుగా పుదీనా ఆకుల్లో ఉండే పోషకాలను తెలుసుకుందా.

క్యాలరీలు 70 టోటల్ ఫ్యాట్ – 0.9 గ్రాములు శాచ్యురేటెడ్ ఫ్యాట్ — 0.2 గ్రాములు సోడియం – 31 మి.గ్రా. పొటాషియం – 569 మి.గ్రా. కార్బొహైడ్రేట్లు — 15 గ్రా. డైటరీ ఫైబర్ – 8 గ్రాములు ప్రోటీన్ – 3.8 గ్రాములు.

ఇందులో విటమిన్ A , విటమిన్ C, ఐరన్ చాలా అధికంగా ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ B 6, మాంగనీస్, ఫోలేట్ కూడా గణనీయంగా ఉంటాయి.

=> కంటి చూపు బాగా కనిపించేందుకు తోడ్పడేటువంటి Vitamin A పుదీనాలో బాగా లభిస్తుంది. కావున దీనిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే ,మంచి రిసల్ట్ ఉంటుంది.

=> పుదీనాలో ఉండే Antacids are oxidative మనకు కలిగే స్ట్రెస్ నుంచి మన బడి ని కాపాడడంతో పాటు .వేరే మూలికల కంటే కూడా ఈ విషయంలో ఇది బాగా పనిచేస్తుంది.

=> పుదీనాలో ఉండే మెంథాల్ అనే మిశ్రమం ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ (IBS) నుంచి ఉపశమనాన్ని ఇస్తుంది. జీర్ణ వ్యవస్థ అదుపు తప్పి IBS (ప్రకోప ప్రేగు సిండ్రోమ్) అనే సమస్య ఏర్పడుతుంది. కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం, అనుకోని నొప్పితో కలిగేటువంటి విరేచనాలు అవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా స్ట్రెస్ కారణంగా ఈ సమస్య ఏర్పడుతుంది. దీనికి పుదీనా మంచి ఉపశమనంగా ఉంటుందని, అయితే పచ్చి పుదీనా ఆకు కంటే పుదీనా ఆయిల్ ఉండేటువంటి క్యాప్సూల్స్ బాగా పనిచేస్తాయని కొన్ని అధ్యయనాల్లో తేలిందని,చెప్పారు.

=> పుదీనా ఆకులు జీర్ణ వ్యవస్థను బాగు చేస్తాయి. ముఖ్యంగా గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి, చాతీలో మంట, ఎసిడిటీ వంటి వాటికి ఇది Home remedy గా చెప్పవచ్చు. భోజనంలో పుదీనా గానీ, మింట్ ఆయిల్ గానీ ఉంటే ఈ జీర్ణ క్రియ సమస్యలన్నీ ఒక దారికొస్తాయన్నట్టే, బిర్యానీ, నాన్ వెజ్ వంటకాలలోమసాల ఫుడ్‌లో పుదీనా కలపడం వల్ల ఈజీ గా జీర్ణమవుతాయి అని ఈ పుదీనాని వేయడం జరుగుతుంది.

=> చిన్నా పిల్లలకు పాలు పట్టే తల్లులు చనుమొనలు పగిలినప్పుడు, నొప్పి తగ్గడానికి ఈ పుదీనా రసం రాస్తే అది తగ్గిపోతుంది. అని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది.
=> జలుబు నుంచి పుదీనా బాగా ఉపశమనం ఇస్తుంది. ముక్కు నుంచి శ్వాస తీసుకోలేని పరిస్థితిలో పుదీనా Decongestant గా పనిచేస్తుంది. శ్వాసకోశ వ్యాధులు ఉన్నప్పుడు కూడా పుదీనా వాసన పీల్చడం ద్వారా కూడా ఉపశమనం లభిస్తుంది.

=> నోట్లో ఉన్న బ్యాక్టీరియాను నాశనం చేసి , నోటి చేదు వాసనను అరికట్టడంలో పుదీనా బాగా పనిచేస్తుంది.

=> పుదీనాలో ఉండేటువంటి విటమిన్లు, యాంటాక్సిడెంట్ల మీ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి.

=> మింట్ లీవ్స్ లో ఉండే Salicylic acid, విటమిన్ A కారణంగా మొటిమలను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇదొక Cleanser గా, మాయిశ్చరైజర్‌గా కూడా పనిచేస్తుంది.

=> పుదీనా ఆకుల్లో ఉండేటువంటి కెరోటీన్, యాంటాక్సిడంట్లు మీ వెంట్రుకలు పెరగడంలో సాయపడడంతోపాటు, హెయిర్ ఫాల్ కాకుండా కాపాడుతుంది. ఇందులో ఉండే Anti fungal గుణాలు పేలను, చుండ్రు సమస్యలను తొలగిస్తాయి.

Pudeena : మనం రోజు వారీ ఆహారాల్లో ఉపయోగించుకునే వాటిల్లో ఈ పుదీనా ఒకటి అనుకున్నాం కదా. వీటిని ఎక్కువగా నాన్ వెజ్ కూరలు , పులావ్, బిర్యానీలు వంటి వాటిల్లోనే తరుచు ఎక్కువగా ఉపయోగిస్తూంటారు. ఇది వంటలకు మంచి సువాసన, టేస్ట్ ని ఇస్తుంది. పుదీనా లేకపోతే బిర్యానీ చేయలేం. పుదీనాతోనే అసలు రుచి వస్తుంది బిర్యానీకి. కానీ పుదీనాలో ఉన్న పోషకాలు గురించి తెలిస్తే మాత్రం ఎలాగైనా సరే దీన్ని వాడాలని అనుకుంటారు.

Pudina in Telugu : అన్ని పోషక విలువలు ఉన్నాయి పుదీనాలో. ఆయుర్వేదంలో కూడా పుదీనాను తరచుగా ఉపయోగిస్తూంటారు. పుదీనా నూనె కు కూడా మంచి ప్రాముఖ్యత ఉంది. పుదీనాలో ఉండే ఘాటు, మింట్ ఫ్లేవర్ ఇష్టపడని వారుండరు. పుదీనాతో అనారోగ్య సమస్యలనే కాదు.ఇంకా చాలా రకాల ఉపయోగాలు కూడా ఉన్నాయి. పుదీనాను ఎలా ఉపయోగిస్తే.. ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ ఇంకా కొన్ని ప్రయోజనాలు తెలుసుకుందాం.

పుదీనాతో ఒత్తిడి, ఆందోళనను దూరం చేసుకోవచ్చు. పుదీనాలో మనసును తేలిక పరిచి, విశ్రాంతిని ఇచ్చేటువంటి గుణాలు ఉన్నాయి. అంతే కాకుండా పుదీనా యొక్క ఆకుల స్మెల్ చూసినా మనస్సుకు హ్యాపీగా ఉంటుంది. పుదీనాను అరోమా థెరపీలో విశ్రాంతిని కలిగించేందుకు కూడా యూజ్ చేస్తూంటారు.

పుదీనాలో రోగ నిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది. ఇది ప్రకృతిలో మార్పుల ద్వారా వచ్చే అనారోగ్య సమస్యలను దరి చేరనివ్వదు. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటిని కూడా తగ్గిస్తుంది. అప్పుడప్పుడు కప్పు పుదీనా టీ ని కూడా తాగితే, ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

జీర్ణ క్రియను సాఫీగా చేయడంలో పుదీనా బాగా ఉపయోగ పడుతుంది. తరచుగా పుదీనా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తుంది. కడుపులో నొప్పి, కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు రాకుండా చేస్తుంది. మనం తీసుకునే ఆహారంలో పుదీనా యాడ్ చేసి తీసుకుంటే జీర్ణ క్రియ సమస్యలు అనేవి ఉండవు.

Pudina in Telugu : కొంతమందికి నోటి నుంచి దుర్వాసన వస్తూ ఉంటుంది. ఎన్నో రకరకాల ప్రయత్నాలు, ప్రయోగాలు చేసి ఉంటారు. పొద్దున్నే 2 మింట్ ఆకులను బాగా నమిలి ఆ రసాన్ని మిగితే, నోటిచేదు వాసన పోవడమే కాకుండా క్రిములు, బ్యాక్టీరియా ఉన్నా కూడా తొలగిపోతాయి. నోరు తాజా గా ఉంటుంది.

పుదీనా జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. పుదీనాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, carotene జుట్టు పెరిగేందుకు సహాయం చేయడమే కాకుండా రాలకుండా చూస్తుంది. జుట్టు సమస్యలతో ఇబ్బంది పడేవారు పుదీనాను వాడొచ్చు.

పుదీనాలో ఉండే Vitamin A కారణంగా కంటి చూపు మెరుగు పడుతుంది. అలాగే వయసు రీత్యా వచ్చే కళ్ళ సమస్యలను రాకుండా చేస్తుంది పుదీనా.

అయితే , మీ రోజువారీ ఆహారంలో పుదీనా చేర్చుకుంటే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఇది వైద్య నిపుణుల నుంచి మరియు అంతర్జాలం నుండి సేకరించిన సమాచారం.మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వైద్యుల సలహా తీసుకోని వాడడం ఉత్తమమైన మార్గం. అని గమనించగలరు.Pudina in Telugu

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top