Bilva Patra in Telugu : బిల్వపత్రం విశిష్టత.. శివపూజకు మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎన్ని లాభాలో తెలిస్తే…

Bilva Patra in Telugu : బిల్వపత్రం విశిష్టత.. శివపూజకు మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎన్ని లాభాలో తెలిస్తే…

శివలింగార్చనతో కూడిన శివపూజకు బిల్వ పత్రం అత్యంత శ్రేష్టమైనది. శివార్చనలో మారేడుకు చాలా ప్రాముఖ్యత ఉందని, ఈ ఆకులతో పరమశివుణ్ణి పూజించడం ఆధ్యాత్మి కవేత్తలు , పంచాంగకర్తలు తెలిపారు. ఈ Bel Patra అపురూపమైనది. దీని ఆకులు విశిష్ట ఆకారంలో ఉంటాయి. మూడు ఆకులు ఒకే సమూహంగా ఉన్నట్టు కనిపిస్తాయి. పూర్వము భక్తకన్నప్ప మారేడు దళాలతో శివుణ్ణి పూజించి మోక్షప్రాప్తిని పొందాడు.

త్రిదళం త్రిగుణాకారం

త్రినేత్రంచ త్రియాయుధం

త్రిజన్మపాప సంహారం

ఏకబిల్వం శివార్పణం

ఈ శ్లోకం శివస్తుతిలో బహుళప్రాచుర్యం పొందింది. శివపురాణంలో Bilva Patra విశిష్టత వివరించబడి ఉంది. పరమపవిత్రమైనటువంటి ఈ బిల్వపత్రంతో శివుణ్ణి పూజించడం వల్ల కలిగేటువంటి పుణ్య ఫలం చాలా గొప్పది. బిల్వపత్రం లేదా మారేడుదళంగా పిలువబడే ఈ ఆకులు ఎండినా కూడా పూజకు ఉపయోగిస్తారు.

Bilva Patra in Telugu : కోటి ఏనుగుల దానఫలంగా చెబుతారు. వంద యజ్ఞాలఫలం, కోటి కన్యాదానాలు చేస్తే, వచ్చేటువంటి ఫలం ఈ బిల్వపత్రం శివపూజకు సమర్చించడం వల్ల మనకు గొప్ప ఫలం కలుగుతుందని, సిద్ధిస్తుందని ప్రతీతి.

అఖండ విల్వపత్రేణ పూజితే

నందికేశ్వరే శుధ్యంతిసర్వపాపేభ్యో

ఏకబిల్వం శివార్పణం

సకల పాపాల నివారణకు ఈ బిల్వ పత్రం ఒక్కటి చాలు అని చెప్తోంది మన శివరపురాణం. ఒకసారి పరమశివుడు పార్వతి దేవితో కలసి ఇద్దరు భూలోకంలో నవవిహారం చేస్తుండగా అక్కడున్న వృక్షాల్లో మారేడు వృక్షం పార్వతిదేవికి కనిపించిందట.

Bilva Patra in Telugu :అపుడు ఆమెకు ఆ చెట్టు యొక్క ఆకులు వింతగా కనిపించాయట. ఆ ఆకుల్ని పార్వతీదేవి చేతుల్లోకి తీసుకోగానే ఆ ఆకు నమస్కారం చేస్తూ అమ్మా పార్వతీదేవి! నా జన్మ తరించింది అమ్మా.. అంటూ నీ ఈ స్పర్శతో అని అందట. అందుకు బదులుగా ఏమైనా వరం కోరుకో అని పార్వతీ దేవి ఆ ఆకును అడిగిందట.

అందుకు బిల్వపత్రం నేను చెట్టు గా పుట్టాను, ఆకుగా పెరిగాను. ఈ జన్మను సార్థకమయ్యేలా చూడు తల్లీ అని వేడుకొంటూటే .. అప్పుడు పార్వతీదేవి సరేనని ఆ ఆకుకు వరం ప్రసాదించిందట.

అప్పటినుంచి శివస్తుతి, శివారాధనపూజకు తప్పనిసరి అయింది ఈ బిల్వపత్రం. పార్వతి దేవి ప్రసాదించిన ఈ వరంతో ఆ ఆకూ యొక్క జన్మ సార్థకమైంది. కైలాసనాథుడు ఎక్కువగా ఇష్టపడే వృక్షం మారేడువృక్షం. సకల శుభాలు ఇచ్చేటువంటి ఈ మారేడువృక్షం పరమశివునికి ప్రీతికరం.అని, కార్తీక మాసంలో బిల్వ పత్రాలతో నిత్యం శివపూజ చేయగలిగితే, ఎంతో పుణ్యం కలుగుతుందని, చెప్తుంటారు.

బిల్వ పత్రం లేదా Maredu Dalam అనగానే ముందుగా శివుడే గుర్తొస్తాడు. శివపూజ జరిగినప్పుడు కచ్చితంగా బిల్వ పత్రాన్ని వాడతారు. ఈ బిల్వ పత్రం లేనిదే శివపూజ పూర్తి కాదు.అందుకే ప్రతి శివాలయంలో నూ ఈ బిల్వ చెట్టు ఉంటుంది.

భక్తులు కూడా ఈ చెట్టును అంతే శ్రద్ధగా పూజిస్తారు. అంతేకాదు, ఈ Bel Patra Benefits ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా దాగి ఉన్నాయని చెబుతున్నారు కొందరు ఆయుర్వేద నిపుణులు. వీటిని డైరెక్టుగా తీసుకున్నా లేదా కషాయం చేసి తాగినా అనేక ఆరోగ్య సమస్యలకుకూడా ఇది ఔషధంగా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఆ ప్రయోజనాలేంటో ఇక్కడ ఇప్పుడు కొన్ని తెల్సుకుందాం.

Bilva Patra in Telugu :మారేడు ఆకులు లేదా బిల్వ పత్రాలను వాడే విధంగా వాడితే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఇవి బీపీని తగ్గించడమే కాడు,షుగర్‌ని కూడా కంట్రోల్ చేస్తుంది. అంతేనా వీటిలోని ప్రత్యేక గుణాలు మలబద్ధకాన్ని దూరం చేస్తుంది. వీటితో పాటు చర్మ వ్యాధుల సమస్యలు కూడా తగ్గిపోతాయి.

Bilva Patra in Telugu :మారేడు ఆకులతో శరీరంలోని వేడిని తగ్గించొచ్చు. ఇందుకోసం మారేడు పండు గుజ్జుని మెంతులతో కలిసి దంచాలి. అయితే, ముందుగా మెంతులను నానబెట్టాలి. అప్పుడు మంచిగా పేస్ట్‌లా అవుతుంది. ఇలా తయారైన పేస్ట్‌ని తలకి ప్యాక్‌లా వేసి తలస్నానం చేయండి. ఇలా చేయడం వల్ల శరీరంలోని వేడి తగ్గడమే కాకుండా జుట్టు సమస్యలు కూడా దూరం అవుతాయి.

మారేడు పండు గుజ్జుని కూడా నేరుగా తినొచ్చు. దీని వల్ల కడుపులోని అల్సర్స్, పురుగులు తగ్గిపోతాయి. అందుకే వీటిని అనేక ఆయుర్వేద మందుల తయారీల్లో వాడతారు. కాబట్టి వీటిని నేరుగా తీసుకోవచ్చు..

అదే విధంగా, దీంతో కషాయం కూడా చేసుకుని తాగొచ్చు. దీని వల్ల కూడా బీపీ, షుగర్ కంట్రోల్‌లో ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అయితే ఇప్పుడు ఆ కషాయాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం..

Bilva Patra in Telugu :ముందుగా ఒక పాత్ర తీసుకుని అందులో ఒక గ్లాసు నీటిని పోయండి. అందులో ఒక ఐదారు Maredu Dalam వేసి ఒక 5 నిమిషాల పాటు ఆ నీటిని మరిగించండి. ఆ తర్వాత గిన్నెపై మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు అలానే ఉంచండి.ఇలా కషాయం తయారవుతుంది. దీనిని టీలా తాగొచ్చు. అంతే కాదు , ఇందులో మీ రుచికి తగ్గట్లుగా తియ్యగానైనా, ఉప్పగా అయినా తీసుకోవచ్చు. అదెలాగ అంటే తయారైన కషాయంలో కొద్దిగా ఉప్పు, నల్ల మిరియాల పొడి కలిపి తాగొచ్చు. లేదంటే, తాటిబెల్లం, తేనెతో కలిపి కూడా తాగొచ్చు.

Bilva Patra in Telugu :ఇలా రెగ్యులర్‌గ తాగుతుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెబుతున్నారు. ఇలా తయారుచేసిన కషాయంను తీసుకోవడం వల్ల బీపీ, షుగర్, వైరల్ ఫీవర్ వంటివి కూడా దూరం అవుతాయని చెబుతున్నారు. కాబట్టి రెగ్యులర్‌గా తాగండి..

గమనిక : అంతర్జాలం నుండి ఈ సమాచారాన్ని తీసుకోవడం జరిగింది. ఇది కేవలం మీ యొక్క అవగాహన కోసము మాత్రమే. మీరు దీనిని తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడమే ఉత్తమమైన మార్గం. అని గమనించగలరు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top