ఈ రోజు నుంచి ప్రారంభమైన బొడ్డెమ్మ పండుగ.పురాతన కాలం నుండే జంటగా వస్తున్న బతుకమ్మ,బొడ్డెమ్మ : Boddemma Festival in Telugu.

ఈ రోజు నుంచి ప్రారంభమైన బొడ్డెమ్మ పండుగ.పురాతన కాలం నుండే జంటగా వస్తున్న బతుకమ్మ,బొడ్డెమ్మ : Boddemma Festival in Telugu.

Boddemma : సృష్టిలో ప్రతి జీవిది బ్రతుకు పోరాటమే, బ్రతుకుతో ప్రత్యక్ష సంబంధం ఉన్న పం డుగ బతుకమ్మ ప్రకృతితో మనిషికి ఉండే సంబం ధాన్ని స్పష్టంగా చెప్పే పండుగ ప్రత్యేకంగా తెలంగాణ ఆడపడుచులకు అన్ని పండగల కెల్లా పెద్ద పండుగ బతుకమ్మ.

Boddemma Festival in Telugu : స్త్రీలలో ఉన్న అద్వితీయమైన శక్తిని వెలికి తీసే పండుగ తెలంగాణ స్త్రీల హృదయం బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ గురించి అందరికీ సుపరి చితమే కానీ బతుకమ్మ కంటే ముందు బొడ్డెమ్మ పండుగను చేసుకోవడం పురాతన కాలం నుండి వస్తున్న సంప్రదాయం.

Boddemma Festival in Telugu : పెళ్లి కావలసిన కన్నెపిల్లలు బొడ్డెమ్మను పూజి స్తారు. దీర్ఘసుమంగళి భాగ్యం కోరుకునే ముతైదువలందరు కలిసి సద్దుల బతుకమ్మను పేర్చి,జరుపుకునే పూర్తిస్థాయి మహిళలల పండుగ ఈ బతుకమ్మ. గౌరీదేవి బొడ్డెమ్మగా అవతరించి సకల ప్రాణులకు మరియు బాలలకు సంతోషాన్నిస్తుంది.

Boddemma Festival in Telugu : బొడ్డెమ్మ బతుకమ్మ పండుగలు ఒక దాని వెంట ఒకటి జరుపుకునేవే ఒకదానికి ఒకటి సంబంధం ఉన్న పండుగలు. ఈ ఇద్దరు కూడా గౌరీదేవి రూపాలే ఈ రెండు పండుగల్లో పాటలు కూడా ఒకే విధంగా పడుతుంటారు. బొడ్డెమ్మ పిల్లల పండుగ అని బతుకమ్మ పెద్దల పండుగ అని అంటారు.

Boddemma Festival in Telugu :ఈ పండగను వినాయక చవితి తర్వాత వచ్చే భాద్రపద బహుళ పంచమి నుండి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి ముందు వచ్చే అమావాస్య వరకు బొడ్డెమ్మ పండగ జరుపుకుంటాం.మన తెలంగాణలో సాధారణంగా భాద్రపద బహుళ పంచమి నాటికి మెట్ట పంటలన్నీ ఇండ్లకు చేరుతాయి. ధాన్యలక్ష్మి ఇంట్లో కలకలలాడుతుంది. రాబోయే బతుకమ్మ పండుగకు ఇల్లు వాకిలి శుభ్రం చేసి ముగ్గులు పెట్టడంలో పెద్దలు నిమగ్నమై ఉంటారు వారికి బొడ్డెమ్మను ఆడే తీరిక ఉండదు. ఉత్సాహం ఆపుకోలేని పిల్లలు సంబురంగా బొడ్డెమ్మను ఆడుకుంటారు.

వినాయక చవితి తర్వాత వచ్చేటువంటి భాద్రపద బహుళ పంచమి నుంచి శుద్ధ పాడ్యమికి ముందు అంటే వచ్చే అమావాస్య ముందు రోజు వరకు బొడ్డెమ్మ పండగను జరుపుకుంటాం.బొడ్డెమ్మ అనే పేరుకు ఇంకా బొట్టే, బొడప, బొటిమ, పొట్టి అని అర్థాలు ఉంటాయి. మొత్తానికి బొడ్డెమ్మ అంటే చిన్నదని అర్థం. ధాన్యపు కుప్ప మరియు ధాన్యపు రాశి అని కూడా చెప్పుకోవచ్చు.

పిల్లలందరూ ఉదయాన్నే సుచిగా శుభ్రంగా తయారై పాలు నీళ్లు పసుపు కుంకుమ మరియు పువ్వులు, అగరుబత్తులు తీసుకొని, పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు నీళ్లు చల్లి పసుపు కుంకుమను సమర్పించి పూలతో పూజించి అలంకరించి, అగర్బత్తిలు వెలిగించి, పుట్టకు భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, పుట్ట మన్నును తవ్వుకొని తీసుకొస్తారు.

Boddemma Festival in Telugu ఒక చెక్క పీటపై మూడు లేదా ఐదు లేదా తొమ్మిది దొంతరలు (మెట్లు)గా బొడ్డెమ్మను తయారు చేసి ఎర్ర మట్టితో అలికి పసుపు కుంకుమలతో బొట్టు పెట్టి గన్నేరు రుద్రాక్ష కట్ల కాకర బీర బంతి జాజిపూలతో అలంకరించి పైన శిఖరం ప్రదేశంలో బియ్యంతో నిండిన కలశాన్ని పెట్టి కొత్త రవిక బట్టలు దానిపై ఉంచి తమలపాకులు, పసుపు గౌరమ్మను పెడతారు.

నేలపైన ఎర్ర మట్టి లేదా జాజు తో అలికి ముగ్గులు పెట్టి , ఆ ముగ్గుపైన తయారు చేసిన బొడ్డెమ్మ పీఠను తెచ్చి ఉంచి , ప్రతిరోజు కూడా పసుపు కుంకుమలను వేసి పూలతో బొడ్డెమ్మను అలంకరించి పిల్లలందరూ చుట్టి చేరి ఆడుతూ పాడుతూ కోలాటాలు వేస్తూ భక్తిశ్రద్ధలతో బొడ్డెమ్మ పేరుతో పిలవబడే గౌరమ్మను భక్తితో పూజిస్తారు.

అంటూ పాట ఇలా సాగుతుంది. బొడ్డెమ్మ బిడ్డ పేరు నీలగౌరు ఆమె ఒక నిత్యమల్లె చెట్టును పెట్టి నిత్యం నీళ్లు పోసేదిందట, అలా పెట్టిన చెట్టు పెరిగి కాయలు పండ్లు ఘనంగా కాసిందట ఆ పండ్లన్నీ తెంపి యాదగిరి నరసింహ్మ స్వామికి, ఐలేని లోని మల్లన్నకు, కొమ్మాల నృసింహ స్వామికి పంపించగా వాటిని ఎవరు స్వీకరించలేదట. చివరకు వరం గల్‌ భద్రకాళి మాత తీసుకుందని తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా వరంగల్‌ జిల్లాలో ఈ విధంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను తలచుకుంటూ ఈ విధంగా పాడుకుంటారు.

రామాయణము భారతము భాగవత ఘట్టాలు శివపార్వ తుల యొక్క కళ్యాణం సీతారాముల కళ్యాణం ఘట్టాలకు సంబంధించినటువంటి కథలన్నింటిని పాటల రూపంలోకి మార్చి మరియు చారిత్రక మహిళల జీవిత చరిత్రలను పాటల రూపంలో జానపదులు జానపదాలుగా పాడుతూ భక్తి శ్రద్ధలతో వేడుతూ , చేసుకునే పండుగ బొడ్డెమ్మ. ప్రతిరోజు ప్రసాదాలను బొడ్డెమ్మకి సమర్పించి, అటుకులు బెల్లం, కొబ్బరి నువ్వులు బెల్లం,వంటి ప్రసాదాలు తిచ్చి ఒకరికొకరు పంచుకుంటారు.

ఇలా తొమ్మిది రోజులు కొంత మంది ఐదు రోజులు కొంతమంది మూడు రోజులు కొంతమంది భక్తిశ్రద్ధలతో పూజించి, చతుర్దశి నాడు సాయంత్రం యధావిధిగా బొడ్డెమ్మను పూజించి, అమ్మవారికి నైవేద్యం సమ ర్పించి అందరూ కూడా ప్రసాదం తీసుకొని, బొడ్డెమ్మ పీఠాన్ని పెట్టుకొని చెరువు దగ్గరికి తీసుకెళ్లి బావిలో లేదా చెరువులో లేదా నీళ్లలో నిమజ్జనం చేస్తారు.

పసుపుతో చేసిన గౌరమ్మను పిల్లలకు గంధంపెట్టి లేదా చెంపలకు పూస్తారు. పెద్దలైతే మంగళ సూత్రాలకు ధరిస్తారు. అత్యంత వైభవంగా జరిగే ఈ బొడ్డెమ్మ పండగ ద్వారా పిల్లల్లో కలివిడి తనం, స్నేహపూరిత వాతావరణం మరియు సృజ నాత్మక శక్తిని వెలికి తీసి, చక్కటి ఆలోచనను మానసి కోలాసాన్ని పెంపొందించడానికి Boddemma Festival in Telugu పండుగ ఎంతగానో తోడ్పడుతుందని చెప్పవచ్చు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top