పండ్లలో రారాజు అయిన అనాసతో కలిగే ప్రయోజనాలతో పాటు, అధికంగా తింటే కలిగే, దుష్ప్రభావాలు తెలుసా? Pineapple in Telugu.
రుచికరమైన పండ్లలో పైనాపిల్ ఒకటి. Pineapple in Telugu పైనాపిల్ నే ఇంకా అనాస అని కూడా పిలుస్తారు. పైనాపిల్ తినడానికి తీయ్యగా, పుల్లని రుచి కలిగి ఉంటుంది. ఇందులో అధిక మొత్తంలో పొటాషియం, సోడియం నిల్వలు ఉంటాయి. అంతే, కాకుండా వీటిలో విటమిన్స్, ఇతర పోషకాలు కూడా చాలా విరివిగా లభిస్తాయి.ఎన్నో పోషక విలువలు కలిగిన పైనాపిల్ ను తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను మన సొంతం చేసుకోవచ్చు.
పైనాపిల్ ను తినడం వల్ల ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను మన సొంతం చేసుకోవచ్చు.
Pineapple in Telugu పైనాపిల్ తో చాలా ఉపయోగాలు ఉన్నాయి. అయితే మరీ ఎక్కువగా కాకుండా తగినంత తింటే మంచిది. శరీరం(Body)లో ఏర్పడే అధిక రక్తపోటును నియంత్రించేందుకు పైనాపిల్ ఉపయోగపడతుంది. పైనాపిల్‌లో ‘సి’ విటమిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది డయాబెటిక్ , గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సర్ కు కారకాలైన ఫ్రీ రాడికల్స్‌తో ఇది పోరాడుతుంది. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యల్ని కూడా దూరం చేస్తాయి.
మన బాడీలో ఏర్పడేటువంటి అధిక రక్తపోటును నియంత్రించడానికి కూడా ఈ పైనాపిల్ ఎంతో కీలకమైన పాత్ర వహిస్తుంది. పైనాపిల్ లో ఉండేటువంటి Bromelain అనే ఎంజైమ్ క్యాన్సర్ పేషెంట్లలో కలిగే దుష్ప్రభావాలను దూరం చేస్తుంది. ఇటీవల పరిశోధనలప్రకారం పైనాపిల్ లోని బీటా-కెరోటిన్ ప్రొస్టేట్ క్యాన్సర్ నుంచి రక్షిస్తుందని వెల్లడయింది.
డయాబెటిక్, గుండె పోటు సమస్యలు, దంతాల సమస్యలతో బాధపడేవారికి పైనాపిల్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. తీవ్రమైన వాంతులతో బాధపడేవారు పైనాపిల్ జ్యూస్ ని తాగడం వల్ల తొందరగా వాటి నుంచి విమోచనం పొందవచ్చు. బాగా పండిన పైనాపిల్ ను రోజూ తినడం వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. అంతేకాకుండా బాలింతలు పైనాపిల్ ను తినడం వల్ల పిల్లలకు కావలసినంత పాల ఉత్పత్తి కూడా జరుగుతుంది.
Anasa Pandu in Telugu అనాస లేదా పైనాపిల్ లో నీటి శాతం 87.8 గ్రాములు (ప్రతి 100 గ్రాముల పండులో), ప్రొటీన్ 0.4 మి.గ్రా, కొవ్వు 0.1 మి.గ్రా, పిండి పదార్థం 10.8 మి.గ్రా, కాల్షియం 20 మి.గ్రా, పాస్పరస్ 9 మి.గ్రా, ఇనుము 2.4 మి.గ్రా, సోడియం 34.7 మి.గ్రా, పొటాషియం 37 మి.గ్రా, మాంగనీస్ 0.56 మి.గ్రా, కెరోటిన్ 18 మైక్రోగ్రాములు, ఎనర్జీ 46 కిలో కాలరీలు ఉంటాయి.
ఈ పైనాపిల్ ను తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందటం మాత్రమే కాకుండా చర్మ సౌందర్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చని నిపుణులు తెలియజేస్తున్నారు. పైనాపిల్ జీర్ణక్రియ సక్రమంగా పనిచేయడంలో దోహదపడుతుంది. పైనాపిల్ జుట్టు రాలడంను కూడా తగ్గించడంలో సహాయపడుతుంది.
Anasa Pandu రక్త నాళాల్లో రక్తం గడ్డకట్ట కుండా కాపాడుతుంది. ఆడవారికైతే నెలసరి సక్రమంగా వచ్చేందుకు తోడ్పడుతుంది.బాగా పండిన పైనాపిల్ పండును తింటుంటే పళ్ళ నుండి రక్తం కారే స్కర్వే వ్యాధి రాకుండా కూడా రక్షణ కలిగిస్తుంది. పూర్తిగా పండని పైనాపిల్ రసం తీసుకుంటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి.
Pineapple in Telugu పైనాపిల్‌లో ఉండేటువంటి ఎంజైమ్స్ వాపులను, Nasal సంబంధమైన వ్యాధులను, టైఫాయిడ్‌ని ఉపశమనం చేస్తుంది. పచ్చి పైనాపిల్ యొక్క రసాన్ని తెగిన గాయా లపై రాస్తే, రక్తస్రావం ఆగేలా చేస్తుంది. పచ్చకామెర్ల వ్యాధి, కాలేయ వ్యాధులున్నవారు ప్రతిరోజు ఈ రసాన్నితీసుకుంటే, మంచి రిజల్టిని ఇస్తుంది. పైనాపిల్‌లో అమినో యాసిడ్ ట్రైపోటాన్ అధికంగా ఉండటం వల్ల హార్మోన్‌ల ఆరోగ్యానికి మంచిది.
Anasa Pandu న్యూరోలాజిక్ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి ఈ పైనాపిల్‌లోఉన్నటువంటి పోషకాలు ఎంతగానో ఉపయోగపడతాయి. వీటి ద్వారా పాజిటివ్, మూడ్ ని తెచ్చే, హార్మోన్‌లకు శక్తి అందుతుంది. పైనాపిల్ పూర్తిగా పండిన పండు యొక్క రసాన్ని ముఖానికి రాసుకుని మర్థన చేస్తే, ముఖ చర్మం కోమలంగా, అందంగా మారుతుంది. పండులోని ఎంజైములు ముఖ చర్మంలో నశించిన కణాలను తొలగిస్తాయి. అంతే కాకుండా నల్లటి మచ్చలను తొలగింపచేస్తుంది.
Pineapple Side Effects : పైనాపిల్ ఎక్కువగా తింటున్నారా? జాగ్రత్త..!
Pineapple in Telugu పైనాపిల్ పండు తినడానికి చాలా రుచిగా ఉంటుంది. తీపి కంటే పులుపు ఎక్కువ అయినప్పటికీ పంచదార లేదా తేనె కలిపి తినవచ్చు. పైనాపిల్ పండు వేసవి కాలంలో మిమ్మల్ని చల్లగా ఉంచుతుంది. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే ఎక్కువ తింటే సమస్యలు వస్తాయి.
పైనాపిల్ తింటే.. చాలా మంచిది. అయితే అతిగా తింటే మాత్రం సమస్యలే. రుచిగా ఉంటుంది, తీపి కంటే పులుపు ఎక్కువ. పంచదార(Sugar) లేదా తేనె కలిపి తినవచ్చు. పైనాపిల్(Pineapple) పండు వేసవి కాలంలో మిమ్మల్ని చల్లగా ఉంచుతుంది. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పండు తినడం వల్ల రోగనిరోధక శక్తి(Immunity) పెరుగుతుంది. అంతే కాకుండా ,రక్తంలో షుగర్ స్థాయిని స్థిరంగా ఉంచడంలో దోహదపడుతుంది. పైనాపిల్‌లో Vitamin C, మాంగనీస్, జీర్ణశక్తిని పెంచే,ఎంజైమ్‌లు వంటి పోషకాలు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పని చేస్తాయి.
ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ, Pineapple in Telugu పైనాపిల్(Pineapple) ఎక్కువగాతీసుకోవడం వలన గుండెల్లో మంట, వికారం వంటి అనేక లక్షణాలు కనిపిస్తాయి. విటమిన్ సి(Vitamin C) ఎక్కువగా ఉండేటువంటి పండును పచ్చిగా తినకూడదు. ఎందుకంటే ఇది తీవ్రమైన విరేచనాలు, వాంతులు కలిగిస్తుంది. పైనాపిల్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు, మీరు తెలుసుకోవలసిన అనేక ప్రతికూలతలు కూడా కొన్ని ఉన్నాయి.
Anasa Pandu in Telugu పైనాపిల్‌లో గ్లూకోజ్, సుక్రోజ్ పుష్కలంగా ఉంటాయి. ఈ అనాసాను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొంతమందిలో రక్తంలో షుగర్ లెవల్స్ వేగంగా పెరుగుతాయి. చాలా పండ్లలోని కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అర కప్పు పైనాపిల్‌లో 15 గ్రాముల వరకు కార్బోహైడ్రేట్లు ఉంటాయి.
Anasa Pandu in Telugu బ్రోమిలైన్ అనే ఎంజైమ్ పైనాపిల్ పండు రసం, కాండంలో ఉంటుంది. సహజ బ్రోమిలైన్ ప్రమాదకరమైనది కాదు. అయినప్పటికీ, మందులు తీసుకున్నప్పుడు రక్తస్రావం ప్రమాదం పెరుగుతుంది. Pineapple in Telugu పైనాపిల్ ఆమ్లత్వం కారణంగా, చిగుళ్ళు, పంటి ఎనామిల్ దెబ్బతింటుంది. నోటి కుహరం, చిగురువాపు సంభవించవచ్చు. పైనాపిల్ జ్యూస్(Pineapple Juice) తీసుకునే వారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది కడుపు సమస్యలను కలిగిస్తుంది. ఈ కారణంగా, ఈ పండు ఖాళీ కడుపుతో తినకూడదు.
గమనిక : ఈ సమాచారాన్ని అంతర్జాలం నుండి మరియు నిపుణుల సలహామేరకు సేకరించడం జరిగింది. ఇది కేవలం మీ యొక్క అవగాహన కోసం మాత్రమే. దీనిని అధికంగా తీసుకునేవారు వైద్యుల సలహా మేరకు తీసుకోవడం ఉత్తమైన మార్గం అని గమనించగలరు.Pineapple in Telugu.