పొట్లకాయను చూసి ముఖం దాచేస్తున్నారా? అయితే,ఈ బెనిఫిట్స్​ మీరు మిస్​ అయినట్లే! Potlakaya in Telugu.

పొట్లకాయను చూసి ముఖం దాచేస్తున్నారా? ఈ బెనిఫిట్స్​ మీరు మిస్​ అయినట్లే! Potlakaya in Telugu.

Potlakaya in Telugu : పొట్లకాయ పేరు వింటేనే చాలా మంది ముఖం చాటేస్తారు. దాన్ని కనీసం దగ్గరికి కూడా రానివ్వరు. ఇక తినడం గురించి అయితే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే పొట్లకాయలోని ప్రయోజనాలు తెలిస్తే,మాత్రం ఇకముందు ఆహారంలో భాగం చేసుకుంటారని నిపుణులు అంటున్నారు. ఆ వివరాలలోకి వెళ్తే,

Potlakaya in Telugu :పొట్ల‌కాయ‌ దీని గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పొడ‌వుగా ఉండే ఈ కాయను కొంద‌రు ఇష్టంగా తింటే.. ఇంకొంద‌రు మాత్రం ద‌గ్గ‌ర‌కు కూడా రానివ్వ‌రు. ఇక ఇంట్లో వండిన రోజయితే అమ్మల మీద చాలా మంది యుద్ధమే చేస్తారు. అయితే పొట్లకాయను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే ఇష్టం లేని వారు కూడా ఆహారంలో భాగం చేసుకుంటారని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పొట్లకాయలో మన శరీరానికి అవసరమయ్యేటువంటి కాల్షియం, ఫాస్పరస్, కార్బోహైడ్రేట్లు, ఖనిజాలు, ఇనుము, మెగ్నీషియం, అయోడిన్, పొటాషియం, మాంగనీస్ వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి అలాగే ఇందులో Vitamin A, E, B6, C వంటివి కూడా ఉన్నాయి. ఇవన్నీ జీవక్రియలను సక్రమంగా నిర్వహించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.

Potlakaya in Telugu : పొట్లకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుతుంది.
మలబద్ధకం సమస్యతో బాధపడే వారు రోజూ రెండు స్పూన్ల పొట్లకాయ రసం తాగడం వల్ల ప్రయోజనం ఉంటుందని అంటున్నారు. ఇందులో ఉండే ఫైబర్‌ ఈ సమస్యను తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుందని నిపుణులంటున్నారు. పొట్లకాయ తినడం వల్ల కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి ఇతర సమస్యలను కూడా తగ్గించుకోవచ్చంటున్నారు.
బరువు తగ్గాలనుకునే వారు దీనిని తినడం వల్ల తొందరగా ఆకలి కాకుండా, కడుపు నిండిన భావన కలుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.


Potlakaya in Telugu : పొట్లకాయలో ఉండే అమైన్‌లు, ఫ్లేవనాయిడ్‌లు బ్రెయిన్ నరాల కణాలను ఆక్సీకరణ నష్టం నుంచి కాపాడతాయి. అలాగే నాడీ వ్యవస్థ యొక్క పనితీరును మెరుగుపరచడంలో ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నారు.
పొట్లకాయలో కొలెస్ట్రాల్ యొక్క కంటెంట్ సున్నా. కాబట్టి హృదయ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ఇది మంచి ఆహారం. వీరుతినే ఆహారంలో ఉడకబెట్టిన పొట్లకాయను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని సూచిస్తున్నారు.

కిడ్నీలో రాళ్లు, ఇతర వ్యర్థాలను తొలగించడంలో పొట్లకాయ ఎంతో ఉపయోగపడతుందని అంటున్నారు. ఇది మంచి కిడ్నీ డిటాక్సిఫైయర్‌గా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మూత్రపిండాలు, మూత్రాశయం పనితీరు మెరుగుపడటానికి పొట్లకాయ రసం తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.

Snake Gourd in Telugu: ఆరోగ్యకరమైన కూరగాయల్లో పొట్లకాయ ముందుంటుంది. కానీ దీన్ని తినేవారు ఎంత మంది? మార్కెట్లో కూడా ఎక్కడో గాని వీటిని అమ్మట్లేదు. మన దేశంతో పాటూ, ఇతర ఆసియా దేశాల్లో మరియు ఆఫ్రికా దేశాల్లో, ఆస్ట్రేలియాలోనూ పొట్లకాయలను వంట చేసుకొని తింటారు. కానీ ఎందుకో మన దగ్గర మాత్రం తినడం తగ్గింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పొట్లకాయ, నువ్వులు కలిపి చేసే కూరకు చాలా ప్రాధాన్యత ఉండేది. ఇప్పుడు ఆ కూరను అందరూ మర్చిపోయినట్టే కనిపిస్తున్నారు. పొట్లకాయ, నువ్వుల్లోని మంచి గుణాలు తెలుసుకుంటే, మీరు మళ్లీ ఆ కూర వండడం ఖాయం.

Snake Gourd in Telugu: పొట్లాకాయలో నీటి శాతం అధికం. డీ హైడ్రేషన్ బారిన పడకుండా శరీరాన్ని కాపాడుతుంది. దీని ఫైబర్ అధికంగా ఉంటుంది. అంతేకాదు విటమిన్ ఎ, బి1, బి2, బి3, బి6, బి9, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి. వీటివతో పాటూ మన శరీరానికి అత్యవసరమయ్యే మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, జింక్, సోడియం వంటి ఖనిజాలు కూడా లభిస్తాయి. పొట్లకాయ కర్రీ తరచూ తినడం వల్ల కడుపుబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు కలగవు. డయాబెటిక్ పేషెంట్లకు కూడా చాలా మంచిది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. పథ్యం భోజనంగా పొట్లకాయను తినొచ్చు.


Potlakaya in Telugu రోజుకు గుప్పెడు నువ్వులు తింటే చాలు శరీరానికి ఎంతో ఆరోగ్యం. టైప్ 2 మధుమేహం రాకుండా అడ్డుకోవడం నువ్వుల్లోని పోషకాలు ముందుంటాయి. కొలెస్ట్రాల్ ను కూడా ఇది తగ్గిస్తుంది. హృదయ జబ్బులు, క్యాన్సర్లను సమర్థవంతంగా అడ్డుకుంటుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. హైబీపీ ఉన్నవారికి నువ్వులు చాలా మేలు చేస్తాయి. వీటిలో కాల్షియం కూడా అధికంగా ఉంటుంది కనుక ఎముకలు గట్టిగా మారతాయి.

పొట్లకాయ – నువ్వల పొడి కూర
కావాల్సిన పదార్ధాలు
పొట్లాకాయ ముక్కలు – అరకిలో
నువ్వులు – ఆరు స్పూనులు
ఉల్లిపాయ తరుగు – పావు కప్పు
జీలకర్ర – ఒక స్పూను
ఎండు మిర్చి – నాలుగు
వెల్లుల్లి – మూడు రెబ్బలు
కరివేపాకు – రెండు రెమ్మలు
ఆవాలు – అరటీస్పూను
పసుపు – కొద్దిగా
ఉప్పు – మీ రుచికి సరిపడా
నూనె -తగినంత


పొట్లకాయ ముక్కలను సన్నగా తరుగు కోవాలి. ఇప్పుడు ఒక కడాయి స్టవ్ మీద పెట్టి , వేడెక్కాక అందులో ఎండు మిర్చి, జీలకర్ర వేసి, తరువాత నువ్వులు కూడా వేసి వేయించుకొని,తీసేయాలి. ఇప్పుడు ఆ మూడింటిని కలిపి మిక్సీలోపౌడర్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక ఆవాలు వేసి వేయించాలి. సన్నగా తురిమిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అవి వేగాక వెల్లుల్లి, కరివేపాకు, పసుపు వేసి వేయించాలి.

Potlakaya in Telugu తరవాత పొట్లకాయ ముక్కలు వేసి ఉప్పువేయాలి. వాటిని బాగా మగ్గించాలి. పొట్లకాయ ముక్కలు కొంచెం ఉడికాక నువ్వుల పొడి వేసి మంచిగా కలపాలి. ఒక పదినిమిషాలు ఉడికిస్తే చాలు. కూర సిద్ధమైపోతుంది. ఈ మొత్తం ప్రక్రియలో ఎప్పుడైన కూర అడుగంటుతోందని అనిపిస్తే కొన్ని నీళ్లు పోయండి. లేకుంటే అలా చిన్న మంట మీద కూర సిద్ధమైపోతుంది. చాలా మేరకు పొట్లకాయల్లోని నీరు సరిపోతుంది. ఈ కూర రుచి మామూలుగా ఉండదు.మంచి టేస్ట్ తో చాలా బావుంటుంది.


గమనిక : ఈ సమాచారాన్ని అంతర్జాలం నుండి మరియు నిపుణుల సలహా మేరకు సేకరించడం జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కోసము మాత్రమే. మీరు దీన్ని అతిగా తినాలని అనుకునే, వారు మాత్రం డాక్టర్ సలహా మేరకు తీసుకోవడం ఉత్తమమైన మార్గం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top