Nuvvulu in Telugu : నువ్వులను తింటున్నారా..!అసలు ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు చేస్తాయి.?తెల్ల నువ్వులా?నల్ల నువ్వులా?Nuvvulu in Telugu.

నువ్వులను తింటున్నారా..!అసలు ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు చేస్తాయి.?తెల్ల నువ్వులా?నల్ల నువ్వులా?Nuvvulu in Telugu.

Nuvvulu in Telugu నువ్వులు ఎప్పట్నుంచో మన వంటింట్లో ఒక భాగం. వీటిని మనం వంటల్లో అనేక రకాలుగా వాడుకుంటాం. కూరల్లో, సలాడ్స్లో వేసుకుంటాం. ఈ నువ్వులతో స్వీట్స్,పచ్చళ్ళు, పిండి వంటలు ఇలా ఒక్కటేమిటి చెప్పుకుంటూపోతే ఎన్నో ఉన్నాయి. కేవలం రుచి మాత్రమే కాదు. వీటిని తినడం వల్ల చాలా లాభాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. రెగ్యులర్గా వీటిని తింటే చాలా వరకూ సమస్యలు దూరమవుతాయని చెబుతున్నారు. కాబట్టి వీటిని ఏవిధంగా తింటే , మంచిదో తెలుసుకోండి.

Sesame Seeds in Telugu బ్లడ్ ప్రెజర్ ఎక్కువగా ఉండడం గుండె జబ్బులు, స్ట్రోక్స్కి కారణం. నువ్వుల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించేందుకు సాయపడుతుంది. అదనంగా,ఈ నువ్వుల్లో Lignans, vitamin E,మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ మీ ధమనుల్లో ఫలకం ఏర్పడకుండా అడ్డుకుంటాయి. రక్తపోటు పెరగకుండా చూస్తాయి. కొన్ని అధ్యయనాలా ప్రకారం అధిక రక్తపోటు ఉన్నవారు ప్రతి రోజూ నువ్వులు తీసుకోవడం వల్ల Systolic రక్తపోటులు తగ్గుదల ఉందని తేలింది.

Nuvvulu in Telugu కొన్ని అధ్యయనాల ప్రకారం నువ్వులు తీసుకోవడం వల్ల Cholesterol, triglycerides తగ్గుతాయి. ఈ రెండింటి కారణంగానే గుండె సమస్యలు పెరుగుతాయి. నువ్వుల్లో saturated fat, Polyunsaturated fat, Monounsaturated fats ఉన్నాయి. వీటిని తినడం వల్ల హృదయ జబ్బుల ప్రమాదం తగ్గుతుందని, పరిశోధనలో సూచిస్తున్నాయి. నువ్వుల్లో 2 రకాల సమ్మేళనాలు ఉంటాయి. అవి Lignans, phytosterols.ఇవి రెండు కూడా కొలెస్ట్రాల్ని తగ్గుంచేవే.అధికంగా కొవ్వు ఉన్నవారు 2 నెలల పాటు రోజూ కొన్ని నువ్వులు తిన్న వారిని పరిశీలిస్తే, ఆ తర్వాత వారిని పరీక్షించాక బాడ్ కొలెస్ట్రాల్ తగ్గినట్లు తేలింది.

Nuvvulu in Telugu Nuvvuluలలో ఎముకల ఆరోగ్యాన్ని పెంచే ఎన్నో పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా కాల్షియం. వీటితో పాటు ఆక్సలేట్స్, ఫైలేట్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి.ఇవి మన బాడికి అంతగా మంచివి కావు. వీటిని తినడం వల్ల ఖనిజాల శోషణ తగ్గుతుంది. అందుకే వీటిని యాంటీ న్యూట్రియెంట్స్ అంటారు. అయితే, వీటి ప్రభావం అధికంగా ఉండొద్దంటే,నువ్వులను పచ్చిగా అస్సలు తినకుండా వాటిని వేయించడం, మొలకెత్తించి, నానబెట్టి తినడం ఉత్తమం.

Nuvvulu in Telugu కీళ్ళనొప్పులతో బాధపడేవారు రెగ్యులర్గా వీటిని తినడం వల్ల మేలు జరుగుతుంది. ఆస్టియో ఆర్థరైటిస్ కారణంగా కీళ్ళనొప్పులు పెరుగుతాయి. నువ్వుల్లో Sesamin అనే సమ్మేళనం యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ ప్రభావాలను కలిగి ఉంటుంది. అది మీ మృదుత్వాన్ని కాపాడుతుంది.

Nuvvulu in Telugu నువ్వుల్లో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండడమే కాకుండా ప్రోటీన్, ఆర్గ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవన్నీ రక్తంలో చక్కెరను కంట్రోల్ చేస్తాయి. అదనంగా, ఈ విత్తనాల్లో పినోరెసినోల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణ ఎంజైమ్ Maltese చర్యను నిరోధించడం ద్వారా రక్తంలో చక్కెరను కంట్రోల్ చేస్తుంది. మాల్టేస్ని కొన్ని ఫుడ్స్లో స్వీటెనర్ గా కూడా వాడతారు.

Nuvvulu in Telugu చలి కాలంలో నలుపు మరియు తెలుపు నువ్వుల ఉపయోగం గురించి ప్రజలు తరచుగా గందరగోళానికి గురవుతుంటారు. నల్ల నువ్వులు తింటే, ఆరోగ్యకరమని కొందరి నమ్మకం, మరికొందరికేమో తెల్ల నువ్వులు ఆరోగ్యానికి బాగా మేలు చేస్తుందని నమ్ముతారు.

Sesame Seeds in Telugu తెల్ల నువ్వులతో పోలిస్తే , నల్ల నువ్వులు దాని పై పొట్టును నిలుపుకుంటుంది, ఇందులో ఎక్కువ కాల్షియం ఉంటుంది, కాబట్టి చలి కాలంలో తెల్ల నువ్వులు ఎక్కువగా తినడానికి బదులుగా, నల్ల నువ్వులతో తయారు చేసినటువంటి లడ్డూ లేదా చిక్కీ లను తినడం వల్ల ఎముకల ఆరోగ్యంగా బలంగా కూడా మారుతాయి. ఈ నల్ల నువ్వులు కరకరలాడుతూ, మంచిగా పెళుసైనవిగా మరియు రుచిలో కొంచెం వెరైటీగా ఉంటాయి, అయితే తెల్ల నువ్వులు మృదువుగా, తీపిగా మరియు తేలికపాటివిగా ఉంటాయి.

Black Sesame Seeds in Telugu బ్లాక్ Nuvvulu తెల్ల నువ్వుల కంటే కొద్దిగా ఎక్కువ పోషకాలను కలిగి ఉంటాయి, ఇవి ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఎందుకంటే నల్ల నువ్వులు పొడవుగా ఉండేటువంటి పై పొట్టును కలిగి ఉంటాయి, కాబట్టి దీని కారణంగా కొన్ని సూక్ష్మపోషకాలు చెక్కుచెదరకుండా ఉంటాయి.

నల్ల నువ్వులు తెల్ల నువ్వుల కంటే కొంచెం అధిక ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటాయి. కాబట్టి అవిహృదయం తో సహా , అనేక ఇతర అవయవాలను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రయోజనకరంగా ఉంటాయి. అదనంగా, ఇందులో ఫైబర్, ప్రోటీన్, కాల్షియం, ఇనుము, కాపర్, మెగ్నీషియం, ఫాస్పరస్ మరియు యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి. కాబట్టి ఈ నల్ల విత్తనం అనేక వృద్ధాప్య వ్యాధుల నుండి కాపాడుతుంది.

శీతా కాలంలో ఇన్ఫెక్షన్లు లేదా ఇతర వ్యాధులు రాకుండా ఉండాలంటే, మాత్రము నల్ల నువ్వులను అధికంగా తీసుకోవాలి. ఇది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది, దాని ద్వారా శరీరం ఈజీగా వ్యాధులతో పోరాడుతుంది.

Black Sesame Seeds in Telugu నల్ల నువ్వులను తీసుకోవడం వల్ల జీవక్రియలు కూడా నియంత్రిస్తాయి. ఇంతే,కాకుండా, ఇందులో మెగ్నీషియం ఉండటం వల్ల, ఇది బ్లడ్ ప్రెజర్ ను మెరుగుపరుస్తుంది. మీ రక్తపోటు అహికమైనప్పుడు ,మీరు నల్ల నువ్వుల గింజలతో తయారు చేసిన ఎటువంటి ఉత్పత్తులనైనా సరే, తీసుకోవాలి. మీరు దీన్ని వేయించుకొని కూడా తినవచ్చు. సలాడ్లు, సూప్‌లకు కలుపుకోవచ్చు.

నల్ల నువ్వులు తినడం వల్ల కాలేయం ఫ్రీ రాడికల్స్ పాడవకుండా కాపాడుతుంది. జ్ఞాపకశక్తి తగ్గకుండా ఉంటుంది. మెదడు యొక్క పని సామర్థ్యం కూడా పెరుగుతుంది. అదనంగా, ఇది క్యాన్సర్ నిరోదించే,లక్షణాలను బాగా కలిగి ఉంటుంది. ఇది అనేక రకాల క్యాన్సర్ ప్రమాదాల నుండి కాపాడుతుంది.

గమనిక : ఏం తినాలన్నా ఎంత పరిమాణంలో తినాలన్నా ఒక్కసారి మీ హెల్త్ కండీషన్ ఏంటి.. ఎంత మోతాదులో తింటే లాభం ఇవన్నీ తెలుసుకుని తినడం మంచిది. ఇందుకోసం మీ డాక్టర్ని సంప్రదించాల్సిందే.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top