Groundnut in Telugu : వేరుశెనగలోని టాప్ 12 ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

వేరుశెనగలోని టాప్ 12 ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..Groundnut in Telugu.

Groundnut in Telugu వేరుశెనగలు మన ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలిసిన విషయమే.ఇందులో అధికంగా మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. వీటిని అలాగే పచ్చిగా లేదా వేయించినవి లేదా ఉప్పుపట్టించుకొని కూడా తినవచ్చు. రోజుకో ఒక గుప్పెడు పల్లీలు తినడం వలన ఆరోగ్యంగా ఉండవచ్చు. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పల్లీల్లో బోలెడన్ని పోషకాలు దాగివున్నాయని న్యూట్రీషన్లు కూడా చెప్తున్నారు.

పల్లీల్లో Monounsaturated కొవ్వుల కారణంగా వీటిని మోతాదుకు మించకుండా తినటం వల్ల హృదయ జబ్బులను 20 శాతం వరకూ తగ్గించుకోవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

ఇందులోని Monounsaturated కొవ్వు హృదయానికి చాలా మంచిది. శరీరానికి మేలు చేసే,యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో ఎక్కువ. విటమిన్ E , నియాసిన్, ప్రోటీన్, మాంగనీసు వేరుశెనగల్లో అధికం. అలాగే అమినో యాసిడ్స్ కూడా ఎక్కువ.

Groundnut in Telugu యాంటీఆక్సిడెంట్స్ గుండె సంబంధిత వ్యాధులను తగ్గిస్తే, ఇందులో ఉండేటువంటి ప్రోటీనలు కణాలు, కణజాల మర్మత్తులను చేసి, కొత్త కణాలు ఏర్పడేలా చేయడంలో సహాయపడుతుంది. ఫ్రీరాడికల్స్ ను కూడా ఏర్పడకుండా కాపాడుతుంది.

వంటింట్లో తప్పనిసరిగా వుండేవి పల్లీలు అంటే వేరుశెనగలు. ఇవిలేకుండా పొద్దున్న ఇడ్లీలోకి చట్నీ రాదు. వేపుడు కూరల్లో అందం, రుచి రాదు. బగారా బేంగన్లో కమ్మదనం రాదు. సాయంత్రం పిల్లలకు చిక్కీ, కాలక్షేపం అసలే కాదు!

ఇవికాక పిల్లలంతా ఇష్టపడేటువంటి స్నిక్కర్స్ వంటి చాక్లెట్లకు ఆ రుచి పల్లీల వల్లనే వచ్చింది. విదేశాల్లో పీనట్ బటర్, బ్రెడ్ బెస్ట్ కాంబినేషన్. వీటిని రోజుకో గుప్పెడు తింటే చాలు.మీ ఆరోగ్యం పదిలంగా కాపాడతామని కమ్మగా చెప్పే పల్లీ కబుర్లేమిటంటే..,

వేరుశెనగలోని Unsaturated fat మీ గుండెను ఆరోగ్యంగా ఉండేలా కాపాడుతుంది. హార్ట్ స్ట్రోక్ మరియు Coronary heart disease ను తగ్గిస్తుంది. వేరుశెనగలు వారంలో రెండు సార్లు కొంచెం కొంచెంగా తినడం వలన హృదయ సంబంధిత జబ్బులను దూరం చేయవచ్చు.

Groundnut in Telugu వేరుశెనగులు మన శరీర ఆరోగ్యం మీద బహుముఖంగా పనిచేస్తుంది. పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడకుండా నివారిస్తుంది. అలాగే పిత్తాశయంలో రాళ్ళు అభివ్రుద్ది చెందకుండా కాపాడుతుంది.

వేరుశెనగలోని అవసరం అయ్యే అమైనో ఆమ్లాలలు మెదుడు నాడీకణాలకు సంబంధించిన కెరోటినిన్ ఉత్పత్తి చేస్తుంది. అది మన బ్రెయిన్ సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది.

వేరుశెనగపప్పులో అధిక న్యూట్రీషియంట్స్ ఉంటాయి. ఇవి బాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడంలో ప్రముఖ పాత్రపోషిస్తుంది. అలాగే మంచి కొలెస్ట్రాల్ ను పెంచడంలో గొప్పగా సహాయపడుతుంది.

వేరుశనగల్లోని విటమిన్స్ మన మొత్తం శరీరము యొక్క ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. పల్లీల్లోని Fat శక్తిగా మార్పు చెందుతుంది మరియు మెటబాలీజంను మెరుగుపరుస్తుంది. మానవ శరీరంలో జీవక్రియలన్నీ సక్రమంగా జరగడానికి ఇది బాగా సహాయపడుతుంది.

పల్లీల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. వీటిలోని కేల్షియమ్, విటమిన్ డిలు ఎముకపుష్టికి దోహదపడతాయి.

శరీరంలో సెల్స్ డ్యామేజ్ కాకుండా రక్షణ కల్పిస్తుంది. ఇందులో ఉండేటువంటి యాంటీఆక్సిడెంట్స్ అల్జీమర్స్ వంటి వ్యాధులను బారిన పడకుండా మనల్ని రక్షిస్తుంది.

Groundnut in Telugu మన శరీరంలో అన్ని జీవక్రియలను నియంత్రించడానికి అవసరం అయ్యేటువంటి విటమిన్లు మరియు ఖనిజాలు అధికంగా కలిగి ఉన్నాయి. వేరుశెనగలో విటమిన్ B పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఇది మెదడు యొక్క పని తీరును మెరుగుపరచడానికి మరియు జ్ఞాపకశక్తిని కూడా పెంచడానికి సహాయపడుతుంది.

పల్లీల్లో ఉండే Resveratrol అనే పాలిఫినాలిక్ యాంటీ ఆక్సిడెంటుకు క్యాన్సర్లు, గుండెజబ్బులు, నరాలకు సంబంధించిన వ్యాధులు, అల్జీమర్స్, వైరల్ ఇన్ఫెక్షన్లు రాకుండా చేసే శక్తి వుంటుంది. ప్రతి 100 గ్రాముల వేరుశెనగల్లో 8 గ్రాముల విటమిన్ ‘E’ ఉంటుంది.

ఇది చర్మానికి హాని కలగకుండా చూస్తుంది. శరీరంలోని ఫ్రీరాడికల్స్ చర్యలను నిరోధిస్తుంది. ఇంకా పల్లీల్లో రెబోఫ్లేవిన్, Niacin, థయామిన్, విటమిన్ బి6, ఫొలేట్లు పుష్కలంగా ఉంటాయి.

వీటిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉండడం వల్ల ఎదిగే పిల్లలకు వీటి నుండి మంచి పోషకాలను అందించవచ్చు. ఫలితంగా పిల్లల్లో ఎదుగుదల కూడా బాగుంటుంది. అలాగే వీటిలో ఉండే ఆమ్లాలు పొట్టలో క్యాన్సర్ కారకాలు పేరుకోకుండా వాటిని అదుపులో ఉంచడంలో సహాయపడతాయి.

Groundnut in Telugu ఇవన్నీ కూడా వ్యాధినిరోధక శక్తిని పెంచేవే. మన రోజువారీ అవసరాలకు కావాల్సినంత 86 % నియాసిన్ను పల్లీల నుండే తీసుకోవచ్చు. కాబట్టి ఈ వేరుశనగలను రోజుకో గుప్పెడు తినడం అలవాటు చేసుకుంటే , మీరు ఆరోగ్యంగా ఉండొచ్చునని న్యూట్రీషన్లు సలహాలు,సూచనలు ఇస్తున్నారు.

గమనిక : ఈ సమాచారం అంతర్జాలం నుండి మరియు నిపుణుల సలహా మేరకు తీసుకోవడం జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. మీ ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమమైన మార్గం అని గమనించగలరు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top