Crow at Home: మీ ఇంటి ముందు కాకి అరిస్తే, మంచిదా లేదా చెడు అనుకుంటున్నారా…అదేంటో ఇక్కడ తెలుసుకోండి..
భారతీయ సంస్కృతిలో జంతువులు, పక్షులకు కూడా ప్రముఖ ప్రాధాన్యత ఇస్తారు. జంతువులు, పక్షుల ప్రవర్తనను కూడా లెక్కలోకి తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా కాకుల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.
కాకులు పర్యావరణానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. కానీ కాకులను అశుభంగా భావిస్తారు. కాకులు ఇంటి ముందు అరుస్తే మంచిది కాదంటారు. ఇలా అరవడం వల్ల చెడు జరుగుతుందా లేక మంచి జరుగుతుందా అనే విషయం గురించి ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.
Crow at Home: కాకులు ఇంటి ముందు అరుస్తే మంచిది కాదంటారు. ఇలా అరవడం వల్ల చెడు జరుగుతుందా లేక మంచి జరుగుతుందా అనే విషయం గురించి ఇప్పుడు ఇక్కడ తెలుసుకుందాం.సూర్యోదయ సమయంలో అంటే, ప్రొద్దున్నే మన ఇంటి ముందు కాకులు ఇంటి ముందుకు వచ్చి అరుస్తే, అది శుభ ప్రదమే. మీ జీవితంలో ఆర్థిక పురోభివృద్ధి రాబోతుందని సూచిస్తారు.
ఇంటి ఆవరణలో లేదా ఇంటి పై కప్పుపై ఉండి కాకి అరిస్తే, ఇంటికి ఎవరో అతిథులు రాబోతున్నారని కూడా సంకేతంగా పరిగణిస్తారు. అతిథులు ఇంటికి రావడం వల్ల మంచి జరుగుతుందని ఆశిస్తారు. అయితే కాకి ఇంటి ముందుకి అనుకోకుండా వచ్చి పదే పదేగా గట్టిగా అరుస్తే, అది సంక్షోభానికి సంకేతంగా భావిస్తారు.
ఇవే కాకుండా కాకులు ఇంటి ముందుకు కాకి వచ్చి అదే పనిగా అరవడం వల్ల ఇంట్లో వివాదాలు, కలహాలు, గొడవలకు కూడా జరుగుతాయని భావిస్తారు. ఇలా అరవడం వలన ఇంట్లోని కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, విభేదాలు పెరగచ్చని శకున శాస్త్రం చెబుతోంది.