Snoring Meaning in Telugu : అసలు గురక ఎందుకు పెడతారో మీకు తెలుసా..?

Snoring Meaning in Telugu : అసలు గురక ఎందుకు పెడతారో మీకు తెలుసా..?

Snoring Meaning in Telugu : గురకను చాలా మంది చిన్న సమస్యగా చూస్తారు. కానీ ,ఇది ఎన్నో అనారోగ్యాలకు సంకేతం అని నిపుణులు చెబుతున్నారు. గురక రావడానికి చాలా కారణాలు ఉంటాయి.

Snoring Meaning in Telugu : నిద్రలో గురక చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. గురక పెడుతున్న వారి కంటే, వారితో కలసి ఒకే రూమ్లో పడుకునేవారికి మరింత సమస్య.30 ఏళ్లలోపువారిలో సుమారు 10 శాతం మంది,60 ఏళ్లు దాటినవారిలో 60% మంది గురక పెడుతుంటారని నివేదికలు చెబుతున్నాయి. National Sleep Foundation గణాంకాల ప్రకారం, ప్రతి 3 మంది పురుషులలో ఒకరికి, ప్రతి 4 మంది స్త్రీలలో ఒకరికి రాత్రి గురక పెట్టే అలవాటు ఉంతుంది.

నిద్రపోతున్న సమయంలో శ్వాస తీసుకోవడం, వదులతున్నప్పుడు మన మెడ, తలలోని మృదు కణజాలంలో కంపనల వల్ల మనం గురక పెడుతుంటాం. ఈ సున్నితమైన కణజాలం మన ముక్కు రంధ్రాల, టాన్సిల్స్, నోటి పైభాగంలో ఉంటాయి. నిద్రపోతున్నప్పుడు వాయుమార్గం Relaxed state లో ఉంటాయి. ఆ టైంలో గాలి చాలా Forced గా లోపలికి వెళ్లాల్సి ఉంటుంది . అందుకే మృదు కణజాలంలో కంపనలు ఏర్పడతాయి.గరుక రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అవేంటో తెలుసుకుని జాగ్రత్తపడటం ఉత్తమం.

Snoring Meaning in Telugu : మీ నోటి Anatomy తక్కువగా, మందపాటి మృదువైన Palate ఉంటే , వాయుమార్గం తగ్గే అవకాశం ఉంది. అధిక బరువు ఉన్న వ్యక్తుల గొంతు వెనక భాగంలో ఎక్స్ట్రా కణజాలం ఉంటుంది. దీని కారణంగా వారి వాయుమార్గాలు తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా, Soft Palate నుంచి వేలాడుతున్న త్రిభుజాకార కణజాలం Long గా ఉంటే, గాలి ప్రవహించుటకు ఆపద కలిగే అవకాశం ఉంది, దీని వల్ల కూడా కంపనం పెరుగుతుంది.

డ్రింక్ చేసే, అలవాటు ఉన్నవారు గురక పెట్టే , అవకాశం అధికంగా ఉంటుంది. రాత్రి పూట ఆల్కహాల్ తాగినా గురక వస్తుంది. ఆల్కహాల్ గొంతు కండరాలను సడలిస్తుంది. వాయుమార్గ అవరోధానికి వ్యతిరేకంగా మీ సహజ రక్షణను తగ్గిస్తుంది.

Chronic Nasal Congestion, నాసికా రంధ్రాల మధ్య విభజన అనేది వంకరగా ఉండటం వల్ల కూడా గురక వచ్చే అవకాశం ఉంది. గాలి గదుల్లో Bubble (పాలిప్స్‌) పెరిగి, ముక్కులోకి జారి వేలాడుతుండటం వంటివన్నీ కూడా కారణమే. ఇలాంటి సమస్యల్లో గాలి సరిగా ఆడదు. దీంతో నోటితో శ్వాస తీసుకుంటారు. ఇది గురకకు దారితీస్తుంది. అదేపనిగా నోటితో శ్వాస తీసుకుంటుంటే కొండనాలుక, అంగిలి క్రమంగా పెరుగుతూ,వస్తాయి. ఇవి జారి శ్వాస మార్గానికి అడ్డుపడొచ్చు.

నిద్ర లేమి సమస్య వలన అంటే,తగినంత నిద్ర లేకపోవటం వల్ల కూడా గొంతు మరింత సడలిపోయే అకాశం ఉంది.

గొంతుపై గురుత్వాకర్షణ ప్రభావం వాయుమార్గాన్ని ఇరుకుగా మారుస్తుంది. బోర్లా పడుకున్నప్పుడు గురక వస్తూ ఉంటుంది.

ఎక్కువ బరువు, ఊబకాయం ఉన్న వ్యక్తులు గురక, Obstructive Sleep Apnea ఉండే అవకాశం ఉంది.

కొంతమందికి పొడవైన మృదువైన అంగిలి, పెద్ద టాన్సిల్స్, Adenoids ఉండవచ్చు, ఇవి వాయుమార్గాన్ని ఇరుకుగా మారుస్తాయి. దీని కారణంగా గురక వస్తుంది.

బ్రెయిన్ లో శ్వాస ప్రక్రియను నియంత్రించే భాగం సరిగా పనిచేయకపోవటంతోనూ నిద్రలో శ్వాస ఆగిపోవచ్చు. దీన్నే సెంట్రల్‌ అప్నియా అంటారు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి చిన్న సమస్య ఉన్నా , వైద్యులను సంప్రదించడమే ఉత్తమమైన మార్గం. అని గమనించగలరు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top