తెలంగాణాలో కొత్త రేషన్ కార్డుల హవా ? ఎలా దరఖాస్తూ చేసుకోవాలి పూర్తి వివరాలు…! How to Apply for New Ration Card 2024

How to Apply for New Ration Card : తెలంగాణాలో కొత్త రేషన్ కార్డుల హవా ? ఎలా దరఖాస్తూ చేసుకోవాలి పూర్తి వివరాలు…!

How to Apply for New Ration Card : తెలంగాణలో త్వరలో కొత్త New Ration Card జారీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ విషయం పైన ఇప్పటికే కేబినెట్‌ భేటీ సమావేశ లో నిర్ణయం తీసుకోగా.. సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులను అప్లయ్ చేసుకునే విధానం ఇదేనంటూ డిజిటల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్‌గా మారాయి. ఐతే ఇక్కడ కొత్త రేషన్ కార్డులకు ఎలా అప్ప్లయ్ చేసుకోవాలో ఇక్కడ వివరించం.

గత ప్రభుత్వ హయం నుంచి కూడా తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు.ఎట్టకేలకు కొన్నీ సంవత్సరాలుగా రేషన్ కార్డు దరఖాస్తూ కోసం చూస్తున వారికీ ఈ ప్రభుత్వం మంచి విషయం తెలియజేసింది.. ఇప్పటికే కొన్ని ఏళ్లుగా, పెళ్లిళ్లు జరిగి, కుటుంబాల నుంచి వేరు ఐనా వారు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు ?. ఈ సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ .. ప్రజాపాలన పేరితో దరఖాస్తులు స్వీకరణను మొదలుపెటింది. అయితే ఇంకా కొత్త రేషన్ కార్డులను మాత్రం ఇంకా మంజారు చేయలేదు.ఐతే తాజాగా..New Ration Card లను జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రెండ్రోజుల ముందు రాష్ట్ర కేబినెట్ సమావేశమై పలు నిర్ణయాలను తీసుకోవడం జరిగింది.

How to Apply for New Ration Card : తెలంగాణాలో New Ration Card లను జారీ విధానాల మరియు రూపకల్పనకు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని మంత్రివర్గం తీర్మాణం చేసారు. మంత్రులు మొదలగు పొన్నం ప్రభాకర్, సీతక్క మరియు శ్రీధర్ బాబు ఈ కమిటీలో ముఖ్య సభ్యులుగా ఉంటారు. Ration Card మరియు ఆరోగ్యశ్రీ కార్డు లను విడిగా ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

How to Apply for New Ration Card

కొత్త రేషన్ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేయాలి అని క్రింద వివరించాము…!

  • కొత్త రేషన్ కార్డులను కావాలి అనుకున్న వారు మీ దగ్గరలోని మీసేవా కేంద్రానికి సంప్రదించాలి.
  • తెల్ల రేషన్ కార్డు కోసం అఫ్లికేషన్ ఫారమ్‌ని పొంది పూర్తి వివరాలను జత చేయండి.
  • ఫారం లో పేర్కొన్న అన్ని వివరాలు ఖచ్చితంగా మరియు క్లుప్తంగా పూరించండి.
  • ఫారం లో అడిగిన వివరాలతో పాటు, కొన్ని ముఖ్యమైన పత్రాలతో పాటు దరఖాస్తు ఫారమ్‌ను మీ సేవలో సమర్పించండి.
  • వీటిలో సాధారణంగా గుర్తింపు రుజువు (ఆధార్ కార్డు), మీ నివాస (అడ్రస్) రుజువు, కుటుంబo యొక్క పూర్తి వివరాలు ఉంటాయి.
  • దరఖాస్తును సమర్పించిన తర్వాత.. మీరు మీ అఫ్లికేషన్ నంబర్‌తో కూడిన రసీదుని పొందుతారు.
  • మీ అప్లికేషన్ మరియు స్టేటస్ వివరాలను ట్రాక్ చేయడానికి ఈ నంబర్ పాత్ర కీలకంగా ఉంటుంది.దీనిని మీరు భద్రపరుచుకోవాలి.

How to Apply for New Ration Card స్టేటస్ మరియు వివరాలను ఈ విధంగా తెలుసుకోండి…!

  • తెలంగాణ EPDS (Electronic Public Distribution System) అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • అందులో ఆహార భద్రత కార్డు విండోను ఎంచుకోవాలి.
  • Click Here : Food Security Card
  • తర్వాత హోమ్‌పేజీలో ఆహార భద్రత కార్డు విభాగంపై క్లిక్ చేయండి.
  • అప్లికేషన్ స్టేటస్ లో, మీ దరఖాస్తు నెంబర్ ఎంటర్ చేసి క్లిక్ చేయండి.
  • తర్వాత మీ కొత్త రేషన్ కార్డు ఏ స్టేజీ లో ఉందో తెలుసుకోండి.

How to Apply for New Ration Card అయితే ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న పోస్టు మాత్రమే. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు అఫ్లికేషన్లకు సంబంధించిన అధికారిక ప్రకటనలు రాలేదు. గతంలో ప్రజా పాలన నుంచి దరఖాస్తులు స్వీకరించారు. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక తర్వాత అఫ్లికేషన్లకు సంబంధించిన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top