విజయదశమిని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..? vijayadashami wishes Dussehra : 2024

దసరా హిందువుల ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ మాస శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు జరుపుకునే దేవీ నవరాత్రులలో, పదవ రోజు జరుపుకునే విజయ దశమిని దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని అంటారు.

vijayadashami : విజయదశమి వచ్చిందంటే దేశమంతా ఒకటే కోలాహలం. ఎందుకంటే దేశంలో విభిన్నరకాల ప్రజలు ఉన్నప్పటికీ ఈ దసరాపండగను అందరూ కలిసి ఆనందంగా జరుపుకుంటారు. ఈ రోజు ఎటువంటి పనిని ప్రారంభించిన విజయ చేకూరుతుందని,ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఆశ్వయుజ మాసంలో మొదటి తొమ్మిది రోజులను శరన్నవరాత్రుల పేరుతో పిలుస్తూ, రోజుకో రూపంలో అమ్మవారిని కొలుస్తారు. ఆఖరి మూడు రోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి లేదా దసరా పండుగ జరుపుకోవడానికి ఎన్నో పురాణ కథలు , చరిత్ర ఉందని చెప్పవచ్చు.

vijayadashami : చెడు పైన మంచిని గెలిచిన విజయానికి ప్రతీకగా ఈ పండుగను “విజయదశమి లేదా దసరా ” అని పిలుస్తారు. మనిషి తనలోని కామ, క్రోద, మధ, మత్సర, మోహ, లోభ, స్వార్ధ, అన్యాయ, అమానవత, అహంకార అనే పది దుర్గుణాలను ఈ నవరాత్రులలో అమ్మ వారి శరణుజొచ్చి తమలో ఉన్న దుర్గుణాలను తొలగించుకునుటకు ఆధ్యాత్మికంగా ఉత్తమైన మార్గం ఈ శరన్నవరాత్రులు. దీనిని పది రోజులపాటు జరుపుకుంటారు. ముందు నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది.
2024 లో దసరా పండుగ ఎప్పుడు వచ్చిందంటే.,

2024 సంవత్సరంలో శుక్ల పక్షం దశమి తిథి అక్టోబర్ 12 శనివారం ఉదయం 10.58 గంటలకి ప్రారంభమై అక్టోబర్ 13 ఉదయం 9.08 గంటలకు ముగుస్తుంది. అంటే October 12 న విజయదశమి (దసరా) పండుగ జరుపుకుంటారు.
ముహూర్తం చూడకుండా ఏ పనైనా మొదలుపెట్టవచ్చు..

vijayadashami : దేవతామూర్తిలందరు కలిసి పాలసముద్రాన్ని మధించినప్పుడు లేదా చిలికినపుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాస పురాణ కథల్లో పేర్కొన్నారు. శ్రవణ నక్షత్రంతో కలిసిన ఈ ఆశ్వయుజ మాస దశమికి విజయ అనే సంకేతముంది. కాబట్టి అందుకే దీనికి విజయదశమి అనే పేరు కూడా వచ్చింది.అని చెప్పవచ్చు.

తిథి, వారం, తారాబలం, గ్రహబలం మరియు ముహూర్తం మొదలైనవి చూడకూండా దసరా పండగ రోజు చేపట్టిన ఏ పనిలోనైనా విజయం ఖాయం . చతుర్వర్గ చింతామణి గ్రంథం ప్రకారం ఆశ్వయుజ శుక్ల దశమి నాటి నక్షత్రోదయ వేళనే విజయం అని తెలిపడం జరిగింది. కాబట్టి ఈ పవిత్ర సమయం సకల వాంచితార్థ సాధకమైందని గురువాక్యంగా చెప్పబడుతుంది.

విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రావణుని పై చేసిన యుద్ధంలో గెలిచిన సందర్భమే కాకుండా, పాండవులు వనవాసం వెళ్తూ, జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజుగా, అందుకే ఈ సందర్భమున రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేయటం ఆచారంగా ఇప్పటికి జరుగుతూ వస్తుంది.

జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధము చేసి, అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా కలిసి సంతోషముతో ఈ దసరా పండగ జరుపుకున్నారు.ఇప్పటికి జరుపుకుంటూనే ఉన్నారు.

శమీ పూజ దశమి రోజు చేయడంలో ఎంతో ప్రత్యేకత సంతరించుకున్నది. శమీ వృక్షమంటే జమ్మిచెట్టు. పాండవుల అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు తమ ఆయుధాలను శమీవృక్షంపైనే అంటే జమ్మి చెట్టు పైనే దాచిపెట్టారు. ఈ సమయంలో విరాటుడి కొలువులో ఉన్న పాండవులు, వారి యొక్క ఏడాది అజ్ఞాతవాసం పూర్తి కాగానే ఆ వృక్షాన్ని ప్రార్ధించి, ఆ చెట్టుకు పూజలు కూడా చేసి, తిరిగి ఆయుధాలను పొందుతారు. కాబట్టి శమీవృక్ష రూపంలో అపరాజితా దేవి ఆశీస్సులను పొంది,వారు కౌరవులపై పాండవులు విజయాన్ని సాధిస్తారు.

రాముడు విజయదశమి రోజే అపరాజితా దేవిని పూజించి, రావణుడిని సహరించడం జరిగిందని ప్రతీక. తెలంగాణలో శమీపూజ తర్వాత పాలపిట్టను చూసే సంప్రదాయము కూడా ఉంది. విజయదశమి రోజు సాయంత్రం నక్షత్ర దర్శనం అనంతరం శమీవృక్షం వద్ద అపరాజితాదేవిని పూజించడం జరుగుతుంది. అంతే కాకుండా “శమీ శమయతే పాపం శమీ శతృ నివారిణీ, అర్జునస్య ధనుర్థారీ రామస్య ప్రియదర్శినీ” అని ఈ మంత్రాన్ని స్మరిస్తూ, జమ్మి చెట్టు చుట్టూ, ప్రదక్షిణలు చేస్తారు. ఈ శ్లోకం రాసుకున్న చీటీలు ఆ చెట్టు కొమ్మలకు తగిలిస్తారు.లేదా కడతారు. ఇలా చేయడం వల్ల అమ్మవారి యొక్క కృపతో పాటు, శనిదోష నివారణ కూడా జరుగుతుందని ప్రజలు విశ్వసిస్తారు.

vijayadashami : బ్రహ్మదేవుని వరాల వలన వరంతో గర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్దం చేసి, వారిని ఓడించి, ఇంద్ర పదవిని చేపడతాడు. అప్పుడు దేవేంద్రుడు త్రిమూర్తుల దగ్గరకు వెళ్లి తను మొర పెట్టుకొంటాడు. అప్పుడు వారికి మహిషునిపై వారిలో రగిలిన క్రోధాగ్నికి ఒక ప్రకాశవంతమైన తేజముగా మారి, ఒక ప్రకాశవంతమైన మరియు ఒక అద్భుతమైన రూపం ఉద్భవిస్తుంది.

vijayadashami : త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీరూపమై జన్మించింది. శివుని తేజముతో ముఖముగా, విష్ణు తేజముతో బాహువులుగా, బ్రహ్మ తేజముతో పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె పదునేనమిది చేతులను కలిగి ఉండే విదంగా , ఆమెకు శివుడు యొక్క శూలమును, విష్ణువు యొక్క చక్రమును, ఇంద్రుడు యొక్క వజ్రాయుధమును, వరుణ దేవుడు యొక్క పాశము, బ్రహ్మదేవుడు అక్షరమాల, కమండలము హిమవంతుడు యొక్క సింహమును వాహనంగాను ఇచ్చారు.

ఇలా సర్వదేవతల నుండి ఆయుధములను సమకూర్చుకొని, మహిషాసురుని సైన్యంతో తలపడి,అతి భీకరమైన యుద్ధాన్ని చేసి విజయురాలవుతుంది. మహిషాసురుని తరపున యుద్దానికి వచ్చిన ఉదద్రుడు, మహాహనుడు, అసిలోముడు, బాష్కలుడు, బిడాలుడు మొదలైన వారినందరిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది.

ఈ యుద్దములో ఆదేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మాత్రం మహిషిరూపము, సింహరూపము, మానవ రూపముతో కలిసి భీకరముగా పోరు జరుగుతుంది. చివరకు మహిషిరూపములో దేవిచేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషుని సంహరించిన రోజును దసరా పర్వదినంగా పిలవబడింది.

అదే విజయదశమి కూడా.విజయదశమి రోజునే శమీ పూజ కుడా నిర్వహిస్తారు. శ్రీరాముని వనవాస సమయంలో కుటీరం జమ్మి చెట్టు చెక్కతోనే నిర్మించారని కూడా చెబుతారు. శమి అంటే పాపాల్ని, శత్రువుల్ని నశింపజేసేది. పంచ పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్ళే ముందు తమ ఆయుధాలను శమీ లేదా జమ్మి చెట్టుపై దాచి పెట్టడం జరిగింది. సామాన్యులే గాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ఆలయాలలో అమ్మవారికి విశేష అలంకరణలు చేసి పూజిస్తారు.

దుర్గాదేవి మహిషాసురుడితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతడిని వధించింది. కాబట్టి ఈ సందర్భంగా పదో రోజు ప్రజలంతా పండగ జరుపుకున్నారు. కాబట్టే , అదే విజయదశమి. దేవి పూజా ప్రాధాన్యత ఈస్ట్ ఇండియా లో చాలా అధికంగా ఉంటుంది. దేవాతామూర్తులు పాల సముద్రం మధించినప్పుడు అమృతం జన్మించిన శుభముహూర్తాన్నే, విజయదశణిగా పేర్కొన్నారు.

దసరా పండుగకు నీలి రంగులో మెరుస్తూ, కనిపించే పాలపిట్టకు సంబంధమముంది. నవరాత్రులు పూర్తయ్యాక విజయదశమి రోజున పాలపిట్టను చూడటాన్ని అదృష్టంగా మరియు శుభసూచికంగా ప్రజలు భావిస్తారు. ఎందుకంటే దసరా అంటేనే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ఇదే రోజున రావణాసురుడిని అంతమొందించి, శ్రీరాముడు యుద్ధంలో ఘనవిజయం సాధించాడు. మహిషారుడి వధ లాంటి విజయాలు ప్రతీకగా పాలపిట్టను సూచిస్తారు. ఆ పిట్ట కనిపిస్తే విజయం వరించినట్లే. అందుకే విజయదశమి లేదా దసరా పండుగ రోజున పాలపిట్టను చూడడం ను అదృష్టంగా భావించాలని పండితులు,పురోహితులు చెబుతున్నారు. అంతే కాకుండా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలన్న, కొత్త వాహనాలు కొనుక్కోవాలనుకున్న , వాటికీ పూజలు చేసుకోవాలనుకున్న మరియు ఎటువంటి పనులకైనా ఆ రోజు ముహూర్తం చూడనవసరం లేదు . ఎందుకంటే ఆ రోజు మొదలు పెట్టిన ఎటువంటి పనైనా విజయవంతం అవుతుందనే నమ్మకం. ప్రజలలో ప్రగాఢంగా ఉంది కాబట్టి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top