White Onion vs Red Onion : తెల్ల ఉల్లిగడ్డలు & ఎర్ర ఉల్లిగడ్డలు ఎందులో పోషకాలు ఎక్కువ ఉంటాయో తెలుసా ?
White Onion vs Red Onion: కూరలు రుచికరంగా ఉండాలి అంటే అందులో ఉల్లిగడ్డలు కావాల్సిందే..మన ఆరోగ్యానికి ఉల్లి చేసే మేలు ఎంతో ఉంటుంది..అందుకే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని మన పూర్వికులు అంటూ ఉండేవారు.మన భారత దేశం అంతటా కూడా ప్రతి కూరలోనూ ఉల్లిపాయ వేస్తుంటారు..ఉల్లి మనకు రెండు రంగులలో చూస్తుంటాం, అయితే..వాటిలో దేనిలో పోషకాలు ఎక్కువుంటాయి అనే సందేహం మీకు ఎపుడైనా వచ్చిందా ? ఐతే ఇక్కడ మనం ఎర్రటి ఉల్లి మంచిదా…లేక తెల్లటి ఉల్లి మంచిదా ? తెలుసుకుందాం రండి..!
White Onion vs Red Onion : మనవాళ్లు ఏ కూర చేసిన.. తాళింపులో తప్పకుండా ఉల్లిపాయ ఉండాల్సిందే. అంతేకాదు.. కొందరు వీటిని పచ్చిగానే ఎంతో ఇష్టంగా తింటూవుంటారు.ఇంతగా మన కూరల్లో కలిసిపోయిన ఉల్లిపాయలో తెల్లవి, ఎర్రవి ఉన్నాయనే సంగతి మన అందరికి తెలిసిందే. మరి.. ఈ రెండింటిలో ఎర్రటి మరియు తెల్లవి ఏవి మంచివి అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.మరి రెండిటిలో ఏది మంచిది…నిపుణులు ఎంచెప్తున్నారు అని తెలుసుకుందాం
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఎర్ర ఉల్లిపాయలు కాస్త ఎక్కువ రుచిని కలిగి ఉంటాయి. తెల్లఉల్లి గడ్డలు మాత్రం కాస్త ఘాటు వాసన కలిగి ఉంటాయి. అయితే.. ఎర్రగడ్డలతో పోల్చితే తెల్ల ఉల్లిపాయల్లోనే పోషకాలు ఎక్కువ మోతాదులో ఉంటాయట. ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు తెల్ల ఉల్లిగడ్డలు వాటిలోనే ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. అందుకే.. ఈ రెండింటిలో ది బెస్ట్ ఏవీ అంటే.. తెల్లవే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
White Onions vs Red Onions
పోషకాలు : వైట్ ఆనియన్స్ను పోషకాల పవర్ హౌస్ అని చెపుతున్నారు నిపుణులు. ఎందుకంటే వీటిలో కేలరీలు తక్కువగా ఉండి Vitamins, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. నార్మల్ సైజ్ వైట్ ఆనియన్లో 44 శాతం కేలరీలు ఉంటే.. విటమిన్స్, ఖనిజాలు, ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉంటాయని చెబుతున్నారు.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది : తెల్ల ఉల్లిగడ్డలో విటమిన్ C ఎక్కువ. ఇది ఇమ్యూనిటీ పవర్ పవర్ పెంచడానికి, కణజాల మరమ్మతుకు, బాడీలో కొవ్వును కరిగించడానికి చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. అంతేకాకుండా వీటిలో పుష్కలంగా ఉండే B Vitamin బాడీలో ఎర్ర రక్త కణాలను పెంచడంలో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.