ఆముదం
నునేతో ఆరోగ్య
ప్రయోజనాలు
ఆముదం నూనె యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి మొటిమలు, బ్లాక్ హెడ్స్ రాకుండా రక్షిస్తాయి.
మొటిమలతో బాధపడేవారు రోజూ ఉదయాన్నే గోరువెచ్చటి ఆముదాన్ని ముఖానికి మర్దన చేసుకుంటే.. మంచి రిజల్ట్స్ ఉంటాయి.
ఆముదం నూనెలో ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. రోజూ ఆముదం రాసుకోవడం వల్ల చర్మానికి అవసరమైన స్థాయిలో తేమ అందుతుంది.
చర్మం ముడతలు పడకుండా చేయడానికి కూడా ఆముదం ఉపకరిస్తుంది.
పొద్దున లేచినప్పుడు లేదా రాత్రి పడుకునే ముందు ఒక చుక్క ఆముదాన్ని పెదవులకు రాసుకుంటే కొద్ది రోజుల్లోనే లేలేత, కోమలమైన పెదవులు మన సొంతమవుతాయి.
రోజూ ఆముదం అప్లై చేసుకుంటే.. చర్మ సమస్యలు దూరం అవుతాయి. ఆముదానికుండే యాంటీ అలర్జిక్ గుణం వల్ల అలర్జీల బెడద కూడా ఉండదు.
కొంతమంది అమ్మాయిలకి కనుబొమ్మలు, రెప్పలు చాలా పలుచగా ఉంటాయి.
ఇలాంటివారు రోజూ రాత్రి పడుకునే ముందు ఆముదాన్ని రాసుకోవడం వల్ల క్రమేపీ వాటిలో ఎదుగుదల ఉంటుంది.
మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలకోసం ఇక్కడ క్లిక్ చేయండి :
Click Here