Amla Benefits : ఉసిరికాయ రోజూ తింటే.. ఎన్ని లాభాలు ఉన్నాయో, తెలుసా..? 2024

కార్తికమాసంలో ఉసిరి సందడి మొదలవుతుందనే చెప్పాలి . ఉసిరిలో, షడ్ రసాలలో ఉన్నటువంటి గుణాలను కలిగి ఉంటుంది. ఒక ఉప్పును తప్పించి మిగిలిన అన్ని రుచులూ ఉంటాయి. ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని అందరికీ తెలుసు. చాలా మంది ఉసిరిని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటారు. ఉసిరిని జ్యూస్చేసి తాగినా , ఎండబెట్టుకొని వరుగులు చేసినా, మురబ్బా లాంటివి చేసినా, రోటి పచ్చడి చేసినా, నిల్వ ఉండేలాగ ఊరగాయ లాంటివి చేసుకొని తిన్నా కానీ ఉసిరిలోని పోషక విలువలు మాత్రం పదిలంగా , అలాగే ఉంటాయి.

Amla Benefits : ఉసిరిని సింపుల్గా సూపర్ ఫుడ్ అని పిలవచ్చు. ఆయుర్వేదంలో ఉసిరి వినియోగం చాలా ఎక్కువ. దీనిలో విటమిన్-C,కాల్షియం, ఫాస్పరస్, ఇనుము , కెరోటిన్, B-కాంప్లెక్స్తోపాటు ఇతర విటమిన్లు, మినరల్స్ మెండుగా ఉంటాయి. దీనిలో ఔషధ గుణాలూ పుష్కలంగా ఉంటాయని నిపుణుల చెబుతున్నారు. ఉసిరి రోజు తీసుకుంటే కలిగే ప్రయోజనాలు తెలుసుకోవాలంటే.

షుగర్ వ్యాధిని అదుపులో ఉంచేందుకు ఉసిరి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే క్రోమియం షుగర్ను అదుపులో ఉంచేందుకు తోడ్పడుతుంది. గుండె కవాటాలు మూసుకుపోకుండా క్రోమియం నివారిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది.

Amla Benefits : అధిక బరువుతో బాధపడేవారికి.. ఉసిరి ఎంతగానో సహాయపడుతుంది. ఉసరిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ కారణంగా.. త్వరగా ఆకలి వేయకుండా ఉంటుంది. మీరు ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉంటారు. ఉసిరిలోని పోషకాలు గట్ హెల్త్కు మంచిది. జీర్ణవ్యవస్థ కి సంబందించిన సమస్యలు ఏమి లేకుండా తిన్న ఆహారం బాగా జీర్ణం అవడానికి కూడా ఉసిరి మనకు చాలా మేలు చేస్తుంది. 2015 లో చేసిన ఒక స్టడీ ప్రకారం, ఉసిరి తరచుగా తీసుకుంటే, త్వరగా బరువు తగ్గుతారు. బెల్లీ ఫ్యాట్ కూడా కరుగుతుందని చెప్పారు.

ఉసిరిలో విటమిన్-C అధికంగా ఉంటుంది. ఉసిరి రోజువారి మన డైట్లో చేర్చుకుంటే, దీని వలన ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలానే ఉసిరిలో ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు, యాంటీ గ్లైసమిక్ గుణాలు కూడా ఉన్నాయి. దీనిలో fiber , మినరల్స్, ప్రోటీన్స్ కూడా చాలా సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరిచేలా , సహకరిస్తాయి.

Amla Benefits : ఉసిరిని ఏ విధంగా అయినా తీసుకోవచ్చు. కొందరు ఉసిరి కాయను పచ్చిగా కూడా తింటారు, మరికొందరు ఉసిరిని ఎండబెట్టి పొడి చేసుకుని, నిల్వ పచ్చడిని కూడా చేసుకుని తింటుంటారు. ఇలా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఉసిరిని తింటూవుంటారు. ఉసిరిని మిగతా కూరగాయలతో పాటు కలిపి జ్యూస్లాగా చేసుకుని కూడా తీసుకోవచ్చు.

Amla Juice Benefits : ఉసిరికాయలను జ్యూస్లాగా తయారు చేయడానికి, రెండు ఉసిరి కాయలు తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోండి. ఈ ముక్కలను మిక్సీ జార్లో వేసి కొన్ని నీళ్లు పోసి గ్రాండ్ చేసుకోండి. జ్యూస్ రెడీ అయిన తర్వా దానిలో కొంచె నల్ల ఉప్పు, తేనె వేసుకుని తాగడం మంచిది. ఈ జ్యూస్ను ఎప్పటికప్పుడు తయారు చేసుకుని తాగితేనే మంచిది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. మీ ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమమైన మార్గం. అని గమనించగలరు.

3 thoughts on “Amla Benefits : ఉసిరికాయ రోజూ తింటే.. ఎన్ని లాభాలు ఉన్నాయో, తెలుసా..? 2024”

  1. Pingback: vijayadashami wishes dasara dussehra date 2024

  2. Pingback: Boda kakarakaya :కేవలం వర్షాకాలం లో దొరికే కూరగాయ…వీటిలోని పోషకాలు తెలిస్తే వెంటనే తెచ్చుకుంటారు…! 2024 Boda ka

  3. Pingback: Parijatham Flower : పారిజాతం పూజలకే కాదు, ఆరోగ్యానికి కూడా ఔషధ గని…! - TodayinTelugu

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top