Vakkaya in Telugu : వాక్కాయ తిన్నారంటే వారెవ్వా అనాల్సిందే…వాక్కాయ తో ఆరోగ్య ప్రయోజనాలు…
Vakkaya in Telugu : ఈ వాక్కాయ ని ఆంగ్లములో Carissa Carandas అని పిలుస్తారు.ఈ పండు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో దొరికే పండ్లలో ఇది ఒకటి.ఈ పండ్లు చూడటానికి ద్రాక్షపళ్లకంటే చిన్న సైజ్లులో ఉంటాయి, ఈ పళ్ళను కూరలలో పులుపుకు, పచ్చళ్ళకు విరివిగా ఉపయోగిస్తారు…
Carissa Carandas: ఈ పండు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ లో దొరికే పండ్లలో ఇది ఒకటి.ఈ పండ్లు చూడడానికి ద్రాక్షపళ్లకంటే చిన్నసైజు లో ఉంటాయి, ఈ పళ్ళను కూరలలో పులుపుకు, పచ్చళ్ళకు విరివిగా ఉపయోగిస్తారు. వాక్కాయ తో పులిహోర, మాంసం వాక్కాయ, వాక్కాయ పచ్చడి వంటి మొదలైన అనేక రకాల వంటకాలను తయారు చేస్తారు.సాధారణంగా అడవులలో సహజసిద్ధంగా పెరిగే ఈ మొక్కలనుండి పండ్లు కేవలం వర్షాకాలం లో కొన్నిరోజులు మాత్రమే లభిస్తాయి. వీటిని సాధారణంగా భారతీయ ఊరగాయలు మరియు సుగంధ ద్రవ్యాలలో ఒక రుచికోసం కలిపే ఐటమ్ గా వీటిని ఉపయోగిస్తున్నారు. ఈ పండ్లను కాన్ బెర్రీస్ అని కూడా పిలుస్తారు.
Vakkaya in Telugu ఈ వాక్కాయ పండ్లలో మధుమేహాన్ని నివారించే ఎన్నో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయని Jermany లోని డ్యుసెల్ డోర్స్ యూనివర్శిటీ శాస్త్రవేత్త అనా రోడ్రిగ్స్ చెప్పారు. ఈ వాక్కాయ వగరుగా కాస్త పుల్లగా ఉంటుంది.ఈ పండ్లు మూత్రపిండాలలో రాళ్ళని కరిగించే వాటిగా మరియు మూత్ర నాళాలని శుభ్రపరిచేవిగా ప్రసిధ్ధి చెందినవి. Vitamin c అధికంగా ఉన్న ఈ పండు అద్భుతమైన యాంటీ బాక్టీరియల్, మరియు యాంటీ ఇన్ఫలమేటరీ గుణాలు కలిగి ఉంటాయి. ఈ వాక్కాయ లో ఉన్న ఆరోగ్య ఉపయోగాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.Vakkaya in Telugu
- వగరుపులుపు కలిసిన ఈ వాక్కాయ పండ్లలో అధికంగా ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. ఉదర సమస్యలను నివారించడంలో ముఖ్యంగా అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం వంటి మొదలైన సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది.ఈ పండ్లను ఎండబెట్టి, ఆలా ఎండిన పండ్ల పొడిని నిలతో కలిపి తీసుకుంటే.. కడుపుని తేలికపరుస్తుంది మరియు జీర్ణవ్యవస్థ పనితీరును బలపరుస్తుంది, దీనితో మనకు ఆకలి ఎక్కువ వేయడంలో ఉపయోగపడుతుంది.
- వాక్కాయలో Vitamin సి పుష్కలంగా ఉంటుంది. దీంతో పూర్వకాలంలో జ్వరం వస్తే చికిత్స కోసం ఈ పండ్లను వాడేవారు. ఈ పండ్లు గొప్ప యాంటీఆక్సిడెంట్ కావడం కారణంగా, ఇందులో వున్న పోషకాలు, అంటువ్యాధులతో పోరాడటం ద్వారా జ్వరాన్ని తగ్గించడంలో ఉపయోగపడతాయి.
- సీజన్ లో దొరికే ఈ పండ్లనును మన రోజువారి ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని మురుగుపరుచుకోవడానికి సహాయపడుతుంది. Vitamin లు మరియు ట్రిప్టోఫాన్లతో పాటు మెగ్నీషియం ఉండటం సిరోటోనిన్ ఉత్పత్తిని ఉత్తేజపరచడంలో ఇది ఉపయోగపడతాయి.
- ఈ వాక్కాయ పండ్ల జ్యూస్ తాగడం వలన గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.గుండె కండరాలను బలోపేతం చేయడానికి రోజూ 15 నుండి 20 మి.లీ వాక్కాయ రసాన్ని తీసుకోవాలి.
- శరీరం డీహైడ్రేషన్ బారిన పడితే..ఈ వాక్కాయ పండ్ల యొక్క జ్యూస్ తక్షణ శక్తిని ఇస్తుంది. అంతేకాదు శరీరంలోని మంటను కూడా ఇది నివారిస్తుంది.
- వాక్కాయ శరీరంలోని పిత్తాశయం, చిగుళ్ళలో రక్తస్రావం మరియు అంతర్గత రక్తస్రావం వంటి ఎన్నో సమస్యలను తొలగిస్తుంది.
- ప్రతిరోజూ ఈ పండ్ల రసం తీసుకోవటం వలన ఊపిరితిత్తులు, బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా చేస్తుంది.
- ఈ పండ్లు దంతాలను పుచ్చిపోకుండా చేయడమే కాదు నోటి దుర్వాసన నుంచి రక్షిస్తుంది.
- మెదడు సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడటంలో అత్యంత ప్రయోజనకారి ఈ వాక్కాయ పండు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. మీ యొక్క అందం మరియు ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా డాక్టర్లను సంప్రదించడమే ఉత్తమమైన మార్గం. అని గమనించగలరు.