Bathukamma:రేవంత్ ప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుక సరికొత్తగా అదరహో అనిపించేలా, నేరుగా మహిళల అకౌంట్లలోకే డబ్బులు…! 2024
Bathukamma:బతుకమ్మ పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలంగాణలోని ప్రముఖ పండుగల్లో ఇది కూడా ఒకటి. బతుకమ్మ పండుగ దగ్గరకు వస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఈ ఫెస్టివల్‌కు మహిళలకు సర్ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.
Bathukamma:గతంలోఉన్నటువంటి ప్రభుత్వం ఏటా బతుకమ్మ పండుగ వస్తోందంటే చాలు.మహిళలకు చీరలు అందించేది. ప్రతి ఏటా బతుకమ్మకు ప్రభుత్వం నుంచి మహిళలకు చీరలు వస్తూనే ఉండేవి. అయితే ఇప్పటి ప్రభుత్వం కూడా కొత్తగా ఆలోచిస్తోంది.
గత ప్రభుత్వంలో ఇచ్చే బతుకమ్మ చీరలపై పలు విమర్శలు వచ్చేవి. చీరలలో నాణ్యత లేదని మహిళలు విమర్శించిన ఘటనలు మనం చూసే ఉంటాం. అయితే ఈసారి మాత్రం ఇలా జరగకుండా ఉండాలని ఇప్పుడున్న ప్రభుత్వం అనుకుంటోంది.
వెలువడుతున్న నివేదికల ప్రకారం చూస్తే,రేవంత్ రెడ్డి సర్కార్ ప్రస్తుతం చీరలు పంపిణీ చేయవద్దనే నిర్ణయానికి వచ్చింది. అంటే బతుకమ్మ చీరలు ఉండకపోవచ్చు. మరీ చీరలు లేకపోతే ఎలా? మహిళలకు ఏం ఇస్తుంది?
about bathukamma in telugu:బతుకమ్మ పండగకి మహిళలకు చీరలు బదులుగా పండుగ కానుకగా ఏం ఇస్తే బాగుంటుందనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మహిళలకు ఏదైనా బహుమతి ఇవ్వాలా? అలా కాకుంటే నగదు రూపంలో అందించాలనే అనే అంశాలపై చర్చ జరుగుతున్నట్లు సర్వత్రా వినిపిస్తోంది.
Bathukamma:ఒకవేళ డబ్బులు ఇవ్వాలనే నిర్ణయానికి వస్త, అవి ఎవరికి ఇవ్వాలి? అందుకు అర్హతలు ఏంటి? అని విషయం పైనా కసరత్తు చేస్తున్నట్టు వినికిడి. ఏదేమైనా రానున్న రోజులలో ఇప్పుడున్న ప్రభుత్వం నుంచి ఈ అంశంపై స్పష్టత రానుంది.
కాగా గత ప్రభుత్వం బతుకమ్మ చీరల కోసం ఏటా రూ.370 కోట్లు ఖర్చు చేసేది. కానీ ఇందులో సగం వరకు మొత్తం మధ్యన ఉన్న దళారుల చేతిలోకి వెళ్లాయనే కొన్ని ఆరోపణలు కూడా వచ్చాయి. అలాగే చీరల నాణ్యత కూడా బాగులేదనే విమర్శలు వచ్చాయి.
Bathukamma:అయితే ప్రభుత్వం ఖర్చు చేసే డబ్బులు నేరుగా తమకు అందిస్తే పండుగ ఖర్చులకు అయినా వస్తాయని మహిళలు పేర్కొంటున్నారు. ఇది కూడా సరైన అంశమే. నాణ్యతలేని కానుకలు , చీరలు ఇవ్వడం కాన్నా నేరుగా డబ్బులు అందిస్తేనే బాగుంటుందని చెప్పుకోవచ్చు.
అలాగే పండుగ సందర్భంగా ప్రజలకు ఉచితంగా నిత్యావసర దినుసుల వంటివి పంపిణీ చేస్తే, ఎలా ఉంటుందనే అంశంపై కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
కాగా బతుకమ్మ అంశంపై రేవంత్ గవర్నమెంట్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. త్వరలో CM రేవంత్ రెడ్డి ఈ అంశంపై ఒక నిర్ణయానికి రావొచ్చని తెలుస్తోంది. తర్వాత బతుకమ్మ చీరలపై కీలక ప్రకటన ఉండొచ్చు.