Tata Curvv EV : టాటా కర్వ్ ఎలక్ట్రిక్ కార్ వచ్చేసింది.. ధర రూ.17.49 లక్షలు.. ఫీచర్లు మాత్రం అదుర్స్!
Tata Curvv EV : Tata Curvv EV శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటారుతో మరియు శ్రేష్ఠమైన డిజైన్‌తో.. అందుబాటు ధరలో Tata Curvv EV మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చారు.ఈ కార్ యొక్క పూర్తి వివరాలను పరిశీలిస్తే..
Tata Curvv EV launched in India : గత కొన్ని నెలలుగా ఊరిస్తున్న Electric కారు వచ్చేసింది. దేశీయ వ్యాపార దిగ్గజం Tata Motors భారత్‌లో మరో కొత్త ఎలక్ట్రిక్ కారు టాటా కర్వ్ ఈవీ ను విడుదల చేసింది.Tata Curvv EV పేరిట ఈ ఎలక్ట్రిక్ కారును మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. ధర, ఫీచర్లను పరిశీలిస్తే..
ఈ కార్ లో 55 kWh, 44 kWh బ్యాటరీ ఆప్షన్లతో వస్తోంది. ఈ Segmentలో ఇవే అతిపెద్ద బ్యాటరీ ప్యాక్‌లని Tata కంపెనీ వెల్లడించింది. Tata Curvv EV 1.2C ఛార్జింగ్ రేట్‌ను కలిగి ఉంటుంది. దీని సహాయంతో కేవలం 15 నిమిషాల ఛార్జింగ్‌తో 150 కిమీల రేంజ్ వరకు ఈ కార్ ప్రయాణించగలదు. ఇందులోని 123 kWh Motor కేవలం 8.6 సెకన్లలో 0 నుంచి 100 వేగాన్ని అందుకుంటుంది. అంతే కాకుండా ఇది గంటకు 160 కి.మీ టాప్ వేగంతో ప్రయాణిస్తుంది. టాటా కర్వ్ ఈవి కార్లో ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌పీ, ఆల్ వీల్ డిస్క్ బ్రేక్స్, లెవెల్ 2 ఏడీఏఎస్, ఆటో హోల్డ్ వంటి భద్రతా ఫీచర్లు Tata Curvv EV కారులో అమర్చారు. గరిష్ఠంగా 160 kmph వేగాన్ని అందుకుంటుంది.
అలాగే.. 500 లీటర్ల బూట్ స్పేస్ ని కలిగి ఉంది. BNCAP 5 స్టార్ రేటింగ్ ఉన్నట్లు కంపెనీ తెలిపింది. 45 kWh వేరియంట్ 502 కిలోమీటర్లు, 55 kWh వేరియంట్ 585 కిలోమీటర్లు రేంజ్‌ను ఈ కార్ ఇస్తుందని తెలియజేసారు.Real world conditions లో వరుసగా ఈ దూరం 350 కి.మీ, 425 కి.మీ. వరకు ఉండొచ్చని చెప్పారు. ఈ కార్ల ధరల పంక్తి రూ.17.49 లక్షల నుంచి రూ.21.99 లక్షల మధ్య ఉంటుంది. ఈ కొత్త కూపే ఎస్‌యూవీని August 12 నుంచి బుకింగ్ చేసుకోవచ్చు.
Tata Curvv EV launched in India
EV కార్లు ఎలాంటి సౌండ్ చేయకుండా ప్రయాణిస్తాయి కనుక పాదచారులను అప్రమత్తం చేసేలా ప్రత్యేక సౌండింగ్ సిస్టమ్‌ను టాటా కర్వ్‌లో ఏర్పాటుచేసినట్లు చెపింది. పానరోమిక్ సన్‌రూఫ్, పవర్డ్ టెయిల్ గేట్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వైర్‌లెస్ చార్జర్, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, స్టార్ట్-స్టాప్ బటన్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బర్గండీ ఇంటీరియర్స్‌ను కూడా ఈ కారులో అమర్చారు. అల్ట్రా ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది.
మరిన్ని ఫీచర్ల విషయానికి వస్తే ఇందులో 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్, టచ్ క్లైమేట్ కంట్రోల్‌తో డాష్‌బోర్డ్ ఉంటుంది. దీని ఇంటీరియర్ వైట్ మరియు Grey కలర్‌తో వస్తుంది. ఈ కార్లో 10.25-అంగుళాల డిజిటల్ క్లస్టర్ వుంది. ఇక టాప్ వేరియంట్‌లో లెథెరెట్ సీట్లు, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు 320W JBL సౌండ్ సిస్టమ్ వంటి సదుపాయాలను ఈ కార్లో అమర్చారు.దీనిలో 500-లీటర్ల భారీ బూట్ స్పేస్‌ని (వెనుక భాగాన ఉండే స్థలం) కలిగి ఉంది.
carలో.. 6 వే అడ్జస్టబుల్ ఫ్రంట్ సీట్లు, వెనక 2-పొజిషన్ రిక్లయిన్ సీట్ ఉంటాయి.Tata కార్లో ఎకో, సిటీ, స్పోర్ట్ డ్రైవ్ మోడ్‌లతో వస్తుంది. ఇది V2V, V2L ఛార్జింగ్ సదుపాయం కలిగి ఉంటుంది. మొదట ఈ ఆప్షన్ Nexon EV కారులో అందించబడింది. Tata Curvv EV 18-ఇంచెస్ వీల్, 190 mm గ్రౌండ్ Clearance మరియు 450 mm వాటర్ వేడింగ్ డెప్త్ వంటి features ఉన్నాయి.
Tata Curvv EV ICE ఇంజిన్ ఆప్షన్‌లోకి అందుబాటులో ఉండనుంది. ఇందులో రెండు Petrol, ఒక Diesel ఇంజిన్ ఆప్షన్ ఉన్నాయి. వీటిలో కొత్త హైపెరియన్ (Hyperion) GDi ఇంజిన్ కూడా ఉంటుంది. ఈ కారులో 125 hp మరియు 225 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 1.2-లీటర్ టర్బో పెట్రోల్ రెవోట్రాన్ ఇంజిన్‌తో పాటు అప్‌డేటెడ్ 1.5-లీటర్ క్రయోటెక్ డీజిల్ యూనిట్‌ని అందించారు. ఈ 1.5 లీటర్ క్రయోటెక్ డీజిల్ ఇంజిన్ 115 హెచ్‌పీ ఎనర్జీ, 260 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.ఈ కార్ లో బ్లాక్, గ్రే ఇంటీరియర్స్‌ను ఇచ్చారు. ఐసీఈ వెర్షన్ల ధరను September 2న ప్రకటిస్తామని టాటా మోటార్స్ సంస్థ తెలియజేసింది.