Parijatham Flower : పారిజాతం పూజలకే కాదు, ఆరోగ్యానికి కూడా ఔషధ గని…!
Parijatham Flower : పారిజాతo పువ్వు అంటే తెలీని వారు ఉండరు కదా ? దేవుళ్లకు ఈ పువ్వు ఎంతో ఇష్టం అని మన పురాణాలు చెప్తున్నాయి, పురాణ కథనం ప్రకారం పారిజాత పువ్వులను శ్రీకృష్ణుడు భూమిపైకి తెచ్చిన స్వర్గలోకపు వృక్షం దీని నుంచి వచ్చిన పువ్వులే పారిజాతం పువ్వులు.పారిజాతాన్ని రాత్రి మల్లె అని కూడా పిలుస్తారు.ఈ పువ్వులు మంచి సువాసనను వెదజిలుతూ ఉంటాయి.
సాధారణంగా ఈ పూవులకు 7 లేదా 8 రెక్కలు కలిగి ఉంటాయి.తెల్లటి రేకుల మధ్య కుంకుమపువ్వు చుక్కలా ఉంటుంది ఈ పువ్వుల మధ్యలో. ఈ పువ్వులను అనేక పూజ కార్యక్రమాలలో ఉపయోగిస్తారు.మరి ఇంతటి చరిత్ర గలిగిన పారిజాతం పూలలో ఆయుర్వేద గుణాలు కూడా అంతే పుష్కలంగా ఉంటాయి. క్రింద వాటి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
Parijatham Flower పారిజాతం చెట్టు ఆయుర్వేదంలో ఒక అద్భుతమైన మొక్క అని చెపొచ్చు. ఇది అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి. ఈ మొక్క లోని ఆకులో యాంటీఆక్సిడెంట్, ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి.కీళ్ల నొప్పి నివారణ నుంచి జ్వరాన్ని తగ్గించడం వరకు అనేక ఆరోగ్య ఉపయోగాలను కలిగి ఉంటుంది.
పారిజాత గొప్ప జ్వర నివారిణి. ఇది మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా జ్వరంతో సహా వివిధ జ్వరాలను నయం చేయడడంలో లో దోహదపడుతుంది. పారిజాత ఆకులు, పువ్వులు రోగ నిరోధక లక్షణాలు కలిగి ఉంటాయి. ఆర్థరైటిస్, మోకాళ్ల నొప్పుల చికిత్సలో వీటిని ఉపయోగిస్తారు.
నిరంతరం దగ్గు, గొంతు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లైతే పారిజాత ఆకులు మరియు పువ్వులతో తయారు చేసిన టీ తాగవచ్చు. ఇది దగ్గు, జలుబు, బ్రోన్కైటిస్ నుంచి ఉపశమనం కల్పిచడంలో ఉపయోగపడుతుంది.
గమనిక : ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. మీ యొక్క అందం మరియు ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా డాక్టర్లను సంప్రదించడమే ఉత్తమమైన మార్గం. అని గమనించగలరు.