తెలంగాణ రాష్ట్రంలో కొత్త ట్రాఫిక్ రూల్స్, వాటిని ఉల్లంఘిస్తే మాత్రం ఆస్తులు అమ్ముకోవాల్సిందే….! కొత్త జరిమానాల లిస్ట్ ఇదే..! New Traffic Rules 2024.
New Traffic Rules 2024. 🚒 సంచలనమైనటువంటి నిర్ణయాలతో దూసుకెళ్తున్న రేవంత్ రెడ్డి సర్కార్. రోడ్డుపై నిబంధనలను గాలికి వదిలేసి రయ్యిమంటూ దూసుకెళ్తున్న వాహనదారులకు కళ్లెం వేసేందుకు సిద్ధమైంది. తెలంగాణ రాష్ట్రంలో రోజూ ఎక్కడో ఒక దగ్గర భారీ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎంతో మంది తమ ప్రాణాలు వదిలేస్తున్నారు. ఈ ప్రమాదాలకు కారణం, అతివేగమో, నిర్లక్ష్యమో, నిబంధనలు పాటించకపోవటమ,ఇలా కారణం ఏదైనా కానీ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇలాంటి ప్రమాదాలను అరికట్టేందుకు, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సంచలనమైనటువంటి నిర్ణయానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.
New Traffic Rules 2024.🚕 ఇప్పటికే. ట్రాఫిక్ నిబంధనల పట్ల తెలంగాణ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీగా జరిమానాలు వేయటము తో పాటు తరచూ పట్టుబడేవారికి జైలు శిక్షతో పాటు లైసెన్సులు కూడా రద్దు చేసే విదంగా కఠిన చర్యలు అమలు చేస్తున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త చట్టాలతో పాటు నూతన రహదారి నిబంధనలు కూడా అమల్లోకి రావడం జరిగింది. దేశంలో చాలా వరకు ప్రమాదాలు మద్యం మత్తులో వాహనాలు నడపటం వల్ల మరియు మైనర్లు వావనాలు నడపటం వల్లే జరుగుతున్నట్టుగా అధికారులు గుర్తించడం జరిగింది.
New Traffic Rules 2024.🚚 అయితే, గతంలోనే మైనర్లకు వాహనాలు ఇవ్వటం వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే, అప్పుడు పెద్దలకు శిక్షలు పడేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కాగా. కానీ ఇప్పుడు మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే, ఏకంగా 25 వేల రూపాయల జరిమానాతో పాటు 25 ఏళ్ల వయసు వచ్చే వరకు లైసెన్స్ కూడా పొందకుండా ఆంక్షలు విధించనున్నారు. అతివేగంగా, నిర్లక్ష్యంగా, పరిమితికి మించిన ప్రయాణికులతో వాహనం నడిపినా, ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించకపోయినా, 2 వేల వరకు జరిమానా విధించనున్నట్టు తెలుస్తోంది.
New Traffic Rules 2024.🚵 ఈ విధానంలోనే, తెలంగాణలోనూ ట్రాఫిక్ నిబంధనలను రేవంత్ రెడ్డి సర్కార్ మరింత కఠినతరం చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే కేంద్రం తెచ్చిన కొత్త చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు కొత్త ట్రాఫిక్ రూల్స్ కూడా సిద్ధం చేసినట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి వీటి ప్రకారం. జరిమానాలను భారీగా పెంచినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఉన్న జరిమానాలకు ఏకంగా 5 రెట్లకు పైగానే వసూలు చేయనున్నట్టు వార్తలు వైరల్ అవడం జరుగుతున్నాయి. . ఇప్పటికే Social media ల్లో ఈ జరిమానాల పట్టికలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఈ List చూస్తుంటే, Prince మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే నేను’ ఫిల్మ్’ లో సీన్. తెలగాణ రాష్ట్రం లోనూ రిపీట్ అవ్వబోతుందా అనేలా అనిపిస్తోంది. మరి ఈ లిస్ట్ ఎంతవరకు నిజం అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రకారం మాత్రం ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే విధించే జరిమానాలు ఇవే..!
రెడ్ లైట్ సిగ్నల్ జంప్ చేస్తే,
గతంలో జరిమానా : రూ. 100 ప్రస్తుతం జరిమానా : రూ.500
హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపితే..
గతంలో జరిమానా : రూ.100 ప్రస్తుతం జరిమానా : రూ.1000 తో పాటు 3 నెలల వరకు లైసెన్స్ రద్దు
లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే..
గతంలో జరిమానా : రూ.500 ప్రస్తుతం జరిమానా : రూ.2000
మద్యం సేవించి వాహనాలు నడిపితే..
గతంలో జరిమానా : రూ.2000 ప్రస్తుతం జరిమానా : రూ.10000
సీటు బెల్ట్ పెట్టుకోకపోతే..
గతంలో జరిమానా : రూ.100 ప్రస్తుతం జరిమానా : రూ.1000
ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ రైడింగ్ చేస్తే..
ప్రస్తుతం జరిమానా : రూ.1200
అత్యవసర వాహనాలను నిరోధిస్తే..
ప్రస్తుతం జరిమానా : రూ. 10,000
సాధారణ ఉల్లంఘన..
గతంలో జరిమానా : రూ.100 ప్రస్తుం జరిమానా : రూ.500
అథారిటీ రూల్స్ అతిక్రమిస్తే..
గతంలో జరిమానా : రూ.500 ప్రస్తుతం జరిమానా : రూ.2000
అతివేగంగా వాహనాలు నడిపితే..
గతంలో జరిమానా : రూ.400 ప్రస్తుతం జరిమానా : రూ.1000
ప్రమాదకరంగా వాహనాలు నడిపితే..
గతంలో జరిమానా : రూ.2000 ప్రస్తుతం జరిమానా : రూ.5000
రేసింగ్ చేస్తూ పట్టుబడితే..
గతంలో జరిమానా : రూ.500 ప్రస్తుతం జరిమానా : రూ.5000
ద్విచక్రవాహనాలపై హెవీ లోడ్..
గతంలో జరిమానా : రూ.100 ప్రస్తుతం జరిమానా : రూ.1200 తో పాటు 3 నెలల వరకు లైసెన్స్ రద్దు
ఇన్సూరెన్స్ లేకుండా వాహనాలు నడపడం..
గతంలో జరిమానా : రూ.1000 ప్రస్తుతం జరిమానా : రూ.2000