Water Apple in Telugu : షుగర్ సమస్య ఉన్న వారికీ ఈ పండు ఒక ఔషధం…!
Water Apple in Telugu : మనం మన జీవన శైలిలో తరచూ వ్యాధుల బారిన పడకుండా ఉండాలి అనుకుంటే…మన శరీరానికి కలవాల్సిన పోషక ఆహారాలు తీసుకోవాలి. అంటే ఎక్కువగా పండ్లు, ఆకుకూరలు, నట్స్ మొదలైనవి తింటూ ఉండాలి.సాధారణంగా పండ్లు అనగానే.. మనకు వెంటనే యాపిల్, దానిమ్మ, అరటిపండ్లు, జామకాయలు మొదలైన పండ్లు గుర్తుకువస్తాయి.కానీ ఇవే కాకుండా ఇంకా మనకు తెలియని పండ్లు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి వాటర్ యాపిల్. ఈ పండ్లనే వాటర్ రోజ్ యాపిల్ అని కూడా పిలుస్తారు. ఈ పండ్లు మునుపటి తో పోలిస్తే ఈ మధ్య కలం లో మార్కెట్ లో ఎక్కువగా దొరుకుతున్నాయి.ఈ వాటర్ యాపిల్ పండ్లు తినడం వల్ల ఆరోగ్యానికి అనేక విధాలుగా మేలు జరుగుతుంది..అవేంటో ఇపుడు తెలుసుకోండి….
ఈ పండుని తినడం వల్ల కలిగే లాభాలను క్రింద చదవండి…!
ఊబకాయా సమస్యకి చెక్ పెట్టండి :ఈ పండు పేరులోనే వాటర్ ఉంది కదా.. ఈ వాటర్ యాపిల్లో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. ఊబకాయ సమస్యతో బాధపడేవారు ఈ పండును తమ డైట్ లో చేర్చుకుంటే బరువు తగ్గుతారు. ఇందులో ఫైబర్ మోతాదు ఎక్కువగా ఉంటుంది.ఫైబర్ ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా ఉంటుంది కాబట్టి.. వేరే ఆహారాలు తినాలనే కోరిక ఉండదు. దానితో బరువు తగ్గుతారు…
డీ హైడ్రేషన్ : వాటర్ యాపిల్ ను తింటే డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉంటాం. ఈ పండులో గాలిక్ యాసిడ్, టానిన్లు, క్వెర్సెటిన్, ఐరన్, క్యాల్షియం వంటి బలమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ పండ్లలో ఉన్న పదార్థాలు శరీరాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి మరియు వాపును కూడా తగ్గిచడంలో దోహదపడుతుంది..
షుగర్ నియంత్రణ : షుగర్ సమస్య ఉన్నవారు కూడా వాటర్ యాపిల్ ను ఎలాంటి అనుమానం లేకుండా తినొచ్చు. ఈ పండ్లు యాంటీ హైపెర్గ్లైసీమిక్ లక్షణాలను కలిగి ఉంటాయి కాబట్టి.. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిచడంలో దోహదపడుతుంది…అలాగే బయోయాక్టివ్ స్పటికాకార ఆల్కలాయిడ్ జాంబోసిన్ కూడా ఇందులో అధికంగా ఉంటుంది. ఈ వాటర్ యాపిల్స్ పండ్లు పిండి పదార్థాలను చక్కెరగా మార్చడాన్ని నిరోధిస్తుంది.Water Apple in Telugu
రక్తపోటు నియంత్రణ : వాటర్ యాపిల్ లో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కారణం అవుతుంది. అలాగే మన శరీరంలో జరిగే అధిక రక్తపోటు సమస్యను కూడా నియంత్రిస్తుంది.గుండెపోటుకు తరచూ గురయ్యే ప్రమాదం నుంచి కూడా ఈ పండు కాపాడుతుంది.
ఎన్నోరకాల విటమిన్స్ : వాటర్ యాపిల్స్ లో Vitamin C ,A , B పుష్కలంగా ఉంటాయి. విటమిన్ C రోగనిరోధక వ్యవస్థను మరింత పటిష్టం చేయడంలో ఉపయోగపడుతుంది. చర్మ సంబంధిత వ్యాధుల కూడా రాకుండా మనల్ని కాపాడుతుంది. అలాగే విటమిన్ B మెటబాలిజంను పెంచుతుంది .
ఒక 100 గ్రాముల వాటర్ యాపిల్స్ లో 93 గ్రాముల వాటర్, 0.6 గ్రాముల ప్రొటీన్, 5.7 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 1.5 గ్రాముల డైటరీ ఫైబర్, కొవ్వు 0.3 గ్రాములు ఉంటాయి. అలాగే 3 శాతం క్యాల్షియం, 0.1 శాతం ఐరన్, 1 శాతం మెగ్నీషియం, 1 శాతం పాస్ఫరస్, 20 శాతం పొటాషియం, 1.5శాతం సల్ఫర్ ఉంటాయి.దీనిని బట్టి మీ శరీరానికి ఎంత మోతాదులో ఈ పండుని తీసుకోవాలో అంత మోతాదులో తీసుకోండి…
గమనిక : ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. మీ యొక్క అందం మరియు ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా డాక్టర్లను సంప్రదించడమే ఉత్తమమైన మార్గం. అని గమనించగలరు.Water Apple in Telugu