Congress 6 Guarantees in Telugu : CM రేవంత్ రెడ్డి దసరా కనుక…! : CM రేవంత్ రెడ్డీ దసరా కనుక…!
Congress 6 Guarantees in Telugu : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను రాష్ట్ర సర్కార్ ఒక్కొక్కటిగా అమల్లోకి తీసుకొస్తుంది..ఈ నేపథ్యంతో ఈ సారి దసరాకు మరో రెండు పథకాలను అమల్లోకి తేవాలి అని ప్రభుత్వం భావిస్తుంది..ఇందులో ఇందిరమ్మ ఇండ్ల స్కీం క్రింద ఆర్ధిక సాయం ఒకటి కాగా…మరొక్కటి రైతు భరోసా క్రింద ఎకరానికి రూ. 7,500 పెట్టుబడి మరొకటి..ఈ రెండు పథకాలకు అవసరమైన నిధులను, లబ్ధిదారుల ఎంపికకు కావాల్సిన విధానాల పై కాబినెట్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.. ఈ పథకం క్రింద ప్రతి నియోజక వర్గానికి 3,500 ఇండ్ల చొప్పున ఈ ఆర్ధిక ఏడాదిలో 4.50 లక్షల ఇండ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది..ప్రజాపాలనలో వచ్చిన ఫోరమ్ లను వెరిఫై చేసేందుకు అనుమతిని కోరుతూ ఇప్పటికే CM Revanth Reddy దగ్గరకు ఫారం వెళ్ళింది…ఇక రైతు భరోసా విషయంలోనూ ప్రభుత్వం పకడ్బందీగా ముందుకు సాగుతుంది.ఐతే ఇప్పటికే దీనిపై మంత్రి వర్గం ఉపసంఘము ఏర్పాటు చేసి .. రైతులు, రైతు సంఘాలు, కూలీలు, నిపుణుల నుంచి వారి అభిప్రాయాలను సేకరించింది…త్వరలోనే మార్గదర్శకాలు రిలీజ్ చేసి October లో రైతు భరోసా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తున్నది..దింతో పాటు రైతు కూలిలకు ఇచ్చే ఆర్ధిక సాయం పైన కసరత్తు చేస్తున్నది.. ఇందుకోసం బడ్జెట్ లో ఫండ్స్ని కేటాయించారు.Congress 6 Guarantees in Telugu
జాగా లేని పేదలకు ఇంటి స్థలంతో పాటు రూ. 5లక్షలు
దసరా నాటికీ ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నది. దీనితో లబ్ధిదారుల యొక్క ఎంపికకు ఆఫీసుర్లు గుడిలైన్స్ రూపొందిస్తున్నారు.. సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకునేవాళ్లకు రూ. 5లక్షల ఆర్ధిక సాయం తెలంగాణ ప్రభుత్వం అందజేయనుంది. సొంత స్థలం లేని వాళ్లకు ఇంటి స్థలంతో పటు రూ. లక్షల సాయం ఇవ్వనున్నారు..ఎస్సి , ఎస్టీలకు మరో రూ. లక్ష అదనంగా రూ.6 లక్షలు ఇవ్వనున్నారు…గృహ నిర్మాణాన్ని బట్టి విడతల వారీగా ఇందిరమ్మ ఇండ్ల సాయం అందించేలా ఏర్పాటు చేస్తున్నారు..గత March 11న తెలంగాణ ప్రభుత్వం భద్రాచలంలో ఇందిరమ్మ ఇండ్ల స్కీం ని ప్రారంభించింది.. కాగా, ఇందిరమ్మ ఇంటిని కుటుంబంలోని మహిళా పేరు మీదే మంజూరు చేస్తారు. లబ్ధిదారుల జాబితాను గ్రామసభలో ప్రదర్శించిన తర్వాత సమీక్షించి ఫైనల్ చేస్తారు. గ్రామ, వార్డు సభల్లో ఆమోదం పొందిన తర్వాత లబ్దిదారులను జిల్లాలలో కలెక్టర్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే కమిషనర్ ఎంపిక చేసిన బృందాలు లబ్ధిదారుల అర్హతలను పరిశీలిస్తాయి.. ఇప్పటికే PM ఆవాస్ క్రింద ఈ సంవత్సరం 9 లక్షల ఇండ్ల కోసం కేంద్రానికి రాష్ట్ర సర్కారు విజ్ఞప్తి చేసింది. కేంద్రం నొంచి ఎన్ని ఇండ్లకు అనుమతి రానుందో వివరాలు వస్తే.. ఈ పథకం ఇంకా స్పీడ్ అందుకోనుంది..Congress 6 Guarantees in Telugu
రైతు భరోసా క్రింద…10 ఎకరాలకు సీలింగ్…!
గత ప్రభుత్వం రైతుబంధు క్రింద సాగులో లేని భూములకు సైతం పెట్టుబడి సాయం అందించింది..గుట్టలు, హైవేలు, రాళ్లు రప్పలున్న భూములు, వెంచర్లకు సైతం రైతుబంధు ఇవ్వడం విమర్శలకు దరితీసింది.. దీనితో భూస్వాములు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు లబ్ది జరిగిందనే ఆరోపణలు వచ్చాయి..గత BRS ప్రభుత్వ హయాంలో దాదాపు రూ. 24 వేల కోట్లు అనర్హుల ఖాతాలోకి వెళ్లినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంక్వయిరీ లో వెల్లడైంది.. దింతో రైతుబంధు స్థానంలో తెస్తున్న రైతు భరోసా పథకం విధి విధానాలను మార్చాలని Revanth సర్కారు నిర్ణయం తీసుకున్నది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ రైతుల నుంచి నేరుగా అభిప్రాయ సేకరణ చేసింది. మెజారిటీ రైతులు, వివిధ వర్గాల ప్రజలు, మేధావులు..రైతుబంధును 10 ఎకరాలకు పరిమితం చేయాలని సూచించారు.. కొన్ని చోట్ల 7 నుంచి 8 ఎకరాల వరకు ఇస్తే చాలని చెప్పారు. ప్రభుత్వం మాత్రం 10 ఎకరాలకు సీలింగ్ పెట్టబోతుందని ఉన్నతవర్గాల ద్వారా తెలిసింది.. అదే సమయంలో హైవేలు, రోడ్లు, గుట్టలు, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్కు ఎట్టిపరిస్థితుల్లో రైతు భరోసా ఇవ్వకూడదని ఇప్పటికే కాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది..ప్రజా ప్రతినిధులకు, IAS లకు, ఇతర ఉద్యోగులకు (గ్రూప్ 4 మినహా ) పెట్టుబడి సాయం ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తున్నది..ఈ నేపథ్యంలో ఎకరాకు రూ. 7,500 చొప్పున కనీసం రూ. 7 వేల కోట్లు మేర రైతు భరోసా క్రింద పంపిణి చేసేందుకు సిద్దమైన సర్కారు, ఈ మేరకు ఫండ్స్ రెడీ చేసుకుంటున్నది.. దసరా కళ్ల నిధుల సేకరణ కొలిక్కి వస్తుందని భావిస్తున్నది.. పండుగ సందర్భంగా ఈ పథకంలను ప్రారంభించే అవకాశం ఉన్నట్లు అధికారవర్గాలు చెప్తున్నాయి…Congress 6 Guarantees in Telugu