Brazil Nuts in Telugu : బ్రెజిల్ నట్స్…థైరాయిడ్ సమస్య ఉన్న వారికీ బెస్ట్ ఆహారం ఇదే…!2024

Brazil Nuts in Telugu : బ్రెజిల్ నట్స్…థైరాయిడ్ సమస్య ఉన్న వారికీ బెస్ట్ ఆహారం ఇదే…!

Brazil Nuts in Telugu : ఈ రోజుల్లో థైరాయిడ్ అనేది ఎక్కువైపోతోంది. షుగర్ వ్యాధి,కొలెస్ట్రాల్ వంటి సమస్యల్లానే రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి. ఈ సమస్య ముఖ్యంగా స్త్రీల్లో హార్మోన్ల సమస్య. థైరాయిడ్ హార్మోన్స్‌లో హెచ్చుతగ్గులు ఈ వ్యాధికి కారణం. శరీరంలో హార్మోన్ పెరిగినా, తగ్గినా ఈ సమస్య వస్తుంది. ఇందులో హైపర్ థైరాయిడిజం, హైపో థైరాయిడిజం‌లు ఉంటాయి. హైపోథైరాయిడిజం సాధారణమే.ఈ థైరాయిడ్ సమస్య రావడానికి వారసత్వం, లైఫ్‌స్టైల్, ఒత్తిడి వంటి అనేక రకమైన కారణాలు ఉన్నాయి. కొన్ని ఆహారాలు థైరాయిడ్‌ని పెంచుతాయి. కొన్ని సమస్యలు ఎదుర్కోగలవు.

థైరాయిడ్ పేషెంట్స్ బ్రెజిల్ నట్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. మనం మన రోజు వారి జీవితం లో సాధారణంగా బాదం, పిస్తా, జీడిపప్పులని అధికంగా తింటాం..బ్రెజిల్ నట్స్ ఎక్కువగా జనాలకు తెలీదు. చాలా మంది బ్రెజిల్ నట్స్ గురించి ఎక్కువగా విని ఉండకపోవచ్చు. బ్రెజిల్ నట్స్ లో ప్రోటీన్స్, ఫైబర్, సెలీనియం, కాపర్, మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, థయామిన్,Vitamin E వంటి ఎన్నో రకమైన పోషకాలు ఉన్నాయి. ముఖ్యంగా థైరాయిడ్‌కి ఉపయోగకరంగా ఉంటాయి.

ఈ నట్స్‌లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలని కలిగి ఉంటాయి. ఎందుకంటే, ఇందులో సెలీనియం పుష్కలంగా ఉంటుంది. థైరాయిడ్ ఉన్నవాళ్ళకి సెలీనియం చాలా అవసరం. ఇందులో మిగతా నట్స్ కంటే సెలీనియం ఎక్కువగా ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేసేలా సెలీనియమం చేస్తుంది. థైరాయిడ్ కణజాలాల్లో సెలీనియం ఉంటుంది. థైరాయిడ్ హార్మోన్ T3 ఉత్పత్తికి ఇది చాలా అవసరం. థైరాయిడ్ గ్రంధిని దెబ్బతినకుండా కాపాడుతుంది. సెలీనియం లోపం హైపోథైరాయిడిజం, థైరాయిడిటిస్, థైరాయిడ్ పెరుగుదల వంటి అనేక సమస్యలు మొదలవుతాయి..

హషిమోటోస్ థైరాయిడిటిస్ అనేది ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఇది థైరాయిడ్ కణజాలాన్ని క్రమంగా దెబ్బతీస్తుంది. హైపోథైరాయిడిజం, ఊబకాయం, అలసట, చలి వంటి సమస్యలకి కారణమవుతుంది. ఈ సమస్య ఉన్నవారికి సెలీనియం చాలా మంచిది.ఇందులో వున్న సెలీనియం ఇమ్యూనిటీని పెంచుతుంది. ఈ వ్యక్తుల్లో మానసిక స్థితిని పెంచుతుంది.

బ్రెజిల్ నట్స్ శరీరంలో నివారించడంలో కూడా చాలా మేలు చేస్తాయి. కొలెస్ట్రాల్ నియంత్రణకు కూడా ఇది చాలా మంచిది. ఇది శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. క్యాన్సర్ వంటి వ్యాధులని తగ్గించడంలో ఇది ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. బ్రెయిన్ హెల్త్‌కి కూడా మంచిది. శరీరంలోని జీర్ణక్రియను పెంచడంతో పాటు, ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉండడం వల్ల కొవ్వుని తగ్గించడంలో కూడా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.Brazil Nuts in Telugu

Note : పైన ఇచ్చిన సమాచారం అంతా కూడా మీ అవగాహన కోసం మరియు అంతర్జాలంలో దొరికిన సమాచారం తీసుకోవడం జరిగింది , ఈ బ్రెజిల్ నట్స్ అతిగా తీసుకునే వారు వైద్యుల సలహా తీసుకోగలరు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top