Muskmelon in Telugu : కర్బూజపండులో అనేక పోషకాలు ఉన్నాయి, దీనిని తినడం వల్ల కలిగే లాభాలు ఇక్కడ తెలుసుకోండి…!2024

Muskmelon in Telugu : కర్బూజపండులో అనేక పోషకాలు ఉన్నాయి, దీనిని తినడం వల్ల కలిగే లాభాలు ఇక్కడ తెలుసుకోండి…!

Muskmelon in Telugu : వేసవికాలంలో ఎక్కువగా లభించే అనేక పండ్లలో మస్క్‌మిలన్ (Muskmelon) కూడా ఒకటి. దీనిని మనం సాధారణంగా కర్బూజా అని పిలుస్తాం. మస్క్‌మిలన్ పండిన వాసనతో తియ్యని రుచిని కలిగి ఉంటుంది. ఈ పండులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ మస్క్‌మిలన్లో
కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, డైటరీ ఫైబర్, సోడియం, విటమిన్ A , ఫోలిక్ యాసిడ్, నియాసిన్, విటమిన్ C లతో పాటు కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్, కెరోటినాయిడ్స్‌ సమృద్ధిగా ఈ పండులో లభిస్తాయి. ఇందులో కొవ్వు, కొలెస్ట్రాల్ లేదా సంతృప్త కొవ్వు ఉండదు. అందువలన కర్బూజ తినడం వలన అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు మనకు లభిస్తాయి.

పండులో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుంది, ఇది మీ శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో దోహద పడుతుంది. కాబట్టి ఈ ఎండ కాలంలో మస్క్‌మిలన్ను తప్పకుండా తింటూ ఉండండి. కర్బూజా తినడం వలన కలిగే ఆరోగ్య ఉపయోగాలను ఇక్కడ తెలుసుకోండి.

కొవ్వు తగ్గిస్తుంది Muskmelon in Telugu

మస్క్‌మిలన్లో మంచి ఎక్కువగా పొటాషియం ఉంటుంది, ఇది శరీర కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది . అంతేకాకుండా ఈ పండులో నీరు శాతం ఎక్కువ ఉండటం వలన మరియు ఆకలిని తీరుస్తుంది, చిరుతిళ్లు తినాలనే కోరికను తగ్గిస్తుంది. మస్క్‌మిలన్ లో అధిక పీచు పదార్థం కలిగి వుండే పండు, మస్క్‌మిలన్ పండు జీర్ణవ్యవస్థ పనితీరును వేగవంతం చేస్తుంది. ఆయుష్షు పెంచుతుంది. ఈ రకంగా మస్క్‌మిలన్ కొవ్వును తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

అధిక బరువు నియంత్రణ

మస్క్‌మిలన్ తియ్యగా ఉంటుంది కానీ, ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. మస్క్‌మిలన్ పండు తినడం ద్వారా తీపి తినాలన్న మీ కోరికను అణిచివేస్తుంది. అందువల్ల మీ శరీరంలో ఎక్కువ కేలరీలు ఉండవు. మస్క్‌మిలన్ పండుతో మీ బరువు తగ్గడానికి అద్భుతంగా సహాయపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారు మస్క్‌మిలన్ ను ఉదయం అల్పాహారంగా తినడం అత్యంత ప్రయోజనకరమైన మార్గం అని చూపొచ్చు. మస్క్‌మిలన్ పండును మీరు దీన్ని సలాడ్ రూపంలో లేదా స్మూతీ రూపంలో కూడా తీసుకోవచ్చు.

ఒత్తిడిని నియంత్రించగలదు Muskmelon in Telugu

మస్క్‌మిలన్లో పొటాషియం శాతం పుష్కలంగా ఉంటుంది, ఇది హృదయ స్పందనను సాధారణీకరిస్తుంది. బ్రెయిన్ లో ఆక్సిజన్ సరఫరాను పెంచుతుంది. మస్క్‌మిలన్ పండు తిన్నప్పుడు మనకు మరింత విశ్రాంతికరమైన, ఏకాగ్రతతో కూడిన అనుభూతిని కలిగిస్తుంది, తద్వారా ఒత్తిడిని తొలగించేలా తోడ్పడుతుంది. ఇందులో సూపర్ ఆక్సైడ్ డిస్ముటేస్‌ సమ్మేళనం కలిగి ఉంటుంది, ఇది రక్తపోటును తగ్గించడం మరియు నరాలను సడలించడం ద్వారా ఒత్తిడిని తగ్గిస్తుంది.

గుండెకు ఆరోగ్యానికి మంచిది

మస్క్‌మిలన్ తినడం హృద్రోగుల ఆరోగ్యానికి చాలా మంచిది. మస్క్‌మిలన్ పండులో ఉండే యాంటీకోగ్యులెంట్ గుణాలు, ఇందులో ఉండే అడెనోసిన్ రక్తం పలుచబడటానికి ఉపయోగపడుతుంది, ఇది గుండె జబ్బుల ప్రమాదా చర్యలను స్వయంచాలకంగా నివారిస్తుంది. ఈ పండులో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది, ఇది రక్తపోటును తగ్గిస్తుంది, తద్వారా మన గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో దోహద పడుతుంది.

కంటిచూపు పెరుగుతుంది

కర్బూజాలో తగినంత మొత్తంలో విటమిన్ A, కెరోటిన్ ఉండటం వల్ల కంటిశుక్లం తగ్గించడంలో, కంటిచూపును మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచడంలో దోహదపడుతుంది, క్యాన్సర్ కణాలను తగ్గించడంలో ను మస్క్‌మిలన్ లోని పోషకాలు ప్రభావంతంగా పనిచేస్తాయి.

మస్క్‌మిలన్ తినడం వల్ల మరికొన్ని లాభాలు ఇక్కడ ఉన్నాయి చదవండి…!

🌷 ఖర్బూజలో విటమిన్‌ K, ఇ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా మెరుగుపడుతుంది. సంతానo లేని సమస్యతో బాధపడేవారు ఈ పండును తరుచుగా తీసుకోవాలని వైద్యులు చెప్తున్నారు. ఖర్బూజ పండు రక్త ప్రసరణ మెరుగు పరచడంలో కూడా ఈ పండు కీలక పాత్ర వహిస్తుంది.

🌷 ఖర్బూజలో ఉండే బీటాకెరోటిన్‌ క్యాన్సర్‌ కణాలను తొలగించి, ప్రీ రాడికల్స్‌ను తగ్గిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. తెల్ల రక్త కణాల వృధ్దిలో కూడా ఈ పండు సహాయపడుతుంది.

🌷 వేసవిలో చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో ఒకటైన వడదెబ్బ నుంచి మస్క్‌మిలన్ రక్షిస్తుంది. ముఖ్యంగా ఎండలో బయటకి వెళ్లే వారు మస్క్‌మిలన్ జ్యూస్‌ తాగడం ఆరోగ్యానికి చాల మంచిది.

🌷 ఖర్భూజలో ఉండే విటమిన్‌ A కంటి సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. కంటి చూపు మెరుగుపరడంలో ఈ పండు కీలక పాత్ర పోషిస్తుంది.

🌷 మస్క్‌మిలన్ ఉండే పొటిషం వల్ల గుండెకు అవసరమయ్యే న్యూట్రియన్స్‌ అందుతాయి. గుండె పోటు సమస్యను దూరం చేయడంలో ఖర్బూజ సహాయపడుతుంది.

🌷 కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్న వారు మస్క్‌మిలన్ ను క్రమం తప్పకుండా తీసుకుంటే రాళ్లు కూడా కరిగిపోతాయి.

🌷 ఇక ఈ మస్క్‌మిలన్ ఉండే పీచు వల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. పైల్స్‌ వంటి సమస్యలతో బాధపడేవారికి మేలు చేకూరుతుంది.

Muskmelon Side-Effects

మస్క్‌మిలన్ అతిగా తినడం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, అవి ఎలాంటివో ఇక్కడ చూడండి.

మస్క్‌మిలన్ లో చక్కెర అధికంగా ఉంటుంది కాబట్టి అధికంగా తినడం ద్వారా బరువు తగ్గకపోగా, మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా మస్క్‌మిలన్ ను ఎక్కువగా తినేస్తే విరేచనాలు (Loose Motions), గ్యాస్ సమస్యలు బారిన పడే అవకాశం ఉంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు, మస్క్‌మిలన్ లను తినడం ప్రమాదకరం కావచ్చు. ఎందుకంటే అధిక మొత్తంలో చక్కెరను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, తద్వారా ఇది రక్తంలో చక్కెర స్థాయిలను ఎక్కువగా పెంచుతుంది… Muskmelon in Telugu

Note : ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని అతిగా తినాలి అనుకునే వారు ముందు వైద్యులని సంప్రదించడమే ఉత్తమమైన మార్గం. అని గమనించగలరు. Muskmelon in Telugu

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top