Ash Gourd Juice Benefits in Telugu : దిష్టికే అనుకుంటున్నారా..! ఆరోగ్యానికి కూడా.. బూడిద గుమ్మడికాయ గురించి తెలిస్తే అస్సలు వదలరు.. 2024.

Ash Gourd Juice Benefits in Telugu : దిష్టికే అనుకుంటున్నారా..! ఆరోగ్యానికి కూడా.. బూడిద గుమ్మడికాయ గురించి తెలిస్తే అస్సలు వదలరు.. 2024.

Ash Gourd Juice Benefits in Telugu : కొందరు బూడిద గుమ్మడికాయను సాంబార్, సలాడ్లు, స్వీట్స్‌ తయారీలో ఉపయోగిస్తుంటారు. ఇందులో కార్బోహైడ్రేట్స్, ప్రొటీన్, డైటరీ ఫైబర్, జింక్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. ముక్కలుగా చేసి కూరల్లో ఉపయోగిస్తే ప్రత్యేకమైన రుచిని జోడిస్తుంది. జ్యూస్‌ చేసుకుని తాగడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బూడిద గుమ్మడికాయ జ్యూస్‌తో కలిగే ప్రయోజనాలు ఏంటో ఇక్కడ తెల్సుకుందాం.

Ash Gourd Juice Benefits in Telugu : గుమ్మడికాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఒక గ్లాసు బూడిద గుమ్మడికాయ జ్యూస్‌ తీసుకుంటే చాలు, ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. ఎక్కువగా తినాలనే కోరికను తగ్గిస్తుంది. బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నవారికి బూడిద గుమ్మడికాయ బెస్ట్‌ ఆప్షన్‌.


Ash Gourd Juice Benefits in Telugu : బూడిద గుమ్మడికాయలో అధికంగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. దీంతో మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మలవిసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది. పేగులోని మంచి బాక్టీరియాను అభివృద్ధి చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

ఇందులో విటమిన్ E ఎక్కువగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. సన్ బర్న్స్, దద్దుర్లుపై బూడిద గుమ్మడికాయ రసాన్ని అప్లై చేస్తే సమస్య తగ్గుతుంది. అలాగే ఈ రసం చర్మం డ్రై గా ఉన్న ఏరియాలను మాయిశ్చరైజ్‌ చేస్తుంది.

ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ జ్యూస్‌ తాగడం వల్ల హైడేట్‌గా ఉంటారు. ఒక గ్లాసు బూడిద గుమ్మడికాయ జ్యూస్‌ తాగి, తగిన మొత్తంలో ద్రవ పదార్థాలు తీసుకుంటుంటే రోజంతా డీహైడ్రేషన్‌ సమస్య ఉండదు.

బూడిద గుమ్మడికాయ మన శరీరంలో పేరుకుపోయినటువంటి వ్యర్థాలు సహజంగా బయటకు పంపడంలో దోహదపడుతుంది. ఇది మూత్రపిండాల్లో ద్రవం స్రావాన్ని ప్రోత్సహిస్తుంది. టాక్సిన్స్‌ని వేగంగా బయటకు పంపుతుంది. శరీర అంతర్గత అవయవాలు సరిగ్గా హైడ్రేట్ గా అయ్యేలా చూస్తుంది.

బూడిద గుమ్మడికాయ జ్యూస్‌లో విటమిన్ B3 అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో ఎనర్జీ లెవల్స్‌ని పెంచుతుంది. రక్తహీనత మరియు సాధారణ బలహీనతతో బాధపడుతున్నటువంటి వ్యక్తులు క్రమం తప్పకుండా తీసుకుంటే మంచిది.

ఇది ఒక నేచురల్‌ ఎక్స్‌పెక్టరెంట్. అంటే శ్వాస మార్గము నుంచి అదనపు కఫం లేదా శ్లేష్మ స్రావాలను ఈజీగా క్లియర్ చేస్తుంది. ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరుస్తుంది. అలెర్జీలు, శ్వాస సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.

బూడిద గుమ్మడికాయ Low Glycaemic Index కలిగి ఉంటుంది. ఇది రక్తంలో షుగర్‌ లెవల్స్‌ని నియంత్రించడంలో సహాయపడుతుంది. జీవక్రియ సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు కూడా గుమ్మడికాయ జ్యూస్‌ చక్కటి పరిష్కారం.

గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. మీ ఆరోగ్యానికి సంబంధించిన ఎటువంటి చిన్న సమస్య లు ఉన్నా డాక్టర్లను సంప్రదించడమే ఉత్తమమైన మార్గం. అని గమనించగలరు. Ash Gourd Juice Benefits in Telugu :

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top