sukanya samriddhi yojana : పాప చదువు కోసం రూ.64 లక్షల అందించే భారీ పథకం
SSY Calculator : కేంద్ర ప్రభుత్వం ఇటీవల చిన్న పొదుపు స్కీం (sukanya samriddhi yojana) ల వడ్డీ రేట్లను భారీగా పెంచిన విషయం మనకు తెలిసిందే. ఇందులో SSY గురించి తెలిసిందే. ఇది ఆడపిల్లల కోసం కేంద్రం తీసుకొచ్చిన స్కీం. ఈ పథకం లో భాగంగా నెలకు కొంత మొత్తంలో డబ్బులను కడితే.. పాపకు 21 ఏళ్లు వచ్చే సరికి లక్షలు వస్తాయి. ఇక ఇందులో ఎక్కువ మొత్తం రూ.64 లక్షలు రావాలంటే నెలకు ఎంత పెట్టుబడి కట్టాలో తెలుసుకుందాం. ఇంకా ఈ పథకం యొక్క ముఖ్య ఉపయోగాలు కూడా చూద్దాం.
Sukanya Samriddhi Yojana: కేంద్ర ప్రభుత్వం.. ఎన్నో అద్భుత స్కీంలను నిర్వహిస్తోంది. ఇందులో చిన్న పొదుపు స్కీంలు మంచి లాభాలను చేకూరుస్తాయి అని చెప్పొచ్చు. ఇక ఇటీవల పథకాల వడ్డీ రేట్లను కూడా భారీగా పెంచేసింది. ఇందులో ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఒక పథకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం .ఆ పథకం పేరే సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddhi Account). ఇక ఈ స్కీం పదేళ్లలోపు ఆడపిల్లలకు మాత్రమే… దీంట్లో చేరడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. నెలకు కొంత మొత్తం కట్టుకుంటూ పోవడం వల్ల మెచ్యూరిటీ టైం కి లక్షలు మన చేతికొస్తాయి. అప్పుడు ఆ ఆడబిడ్డ చదువు కోసం పనికొస్తాయి. ఈ పథకం లో ఇంకా పన్ను మినహాయింపు లాభాలు కూడా ఉంటాయి. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
అమ్మాయిలకు ఆర్థిక ప్రోత్సాహం మరియు భద్రత కల్పించాలే అన్న ముఖ్య ఉద్దేశంతో తీసుకొచ్చిన స్కీంమే ఈ సుకన్య సమృద్ధి అకౌంట్ (యోజన). అందువల్ల ఆడపిల్లలకు మాత్రమే ఈ పథకం ప్రవేశం ఉంది. ఈ పథకంలో పాపను పదేళ్ల లోపే ఇందులో చేరాల్సి ఉంటుంది.మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే.. వెంటనే ఈ పథకంలో చేర్పిస్తే మంచిది. గరిష్టంగా ఒక ఇంట్లో నుంచి ఇద్దరు ఆడపిల్లల్ని ఈ పథకం లో చేర్చొచ్చు.
ఈ పథకంలో ఇప్పుడు వడ్డీ రేట్లు కూడా కేంద్రం పెంచింది. గతంలో వడ్డీ రేటు 7.6 % గా ఉండగా.. ఇప్పుడు దానిని 40 బేసిస్ పాయింట్లు పెంచి 80 %కి పెంచింది. ఇక ఈ వడ్డీ రేట్లు ప్రతి మూడు నెలలకోసారి కేంద్ర ప్రభుత్వం సవరిస్తుంటుంది. ఇక ఈ స్కీం లో చేరాలనుకునేవారు దగ్గర్లోని పోస్టాఫీస్ లేదా బ్యాంకుకు వెళ్లి జాయిన్ కావొచ్చు. కాకపోతే ఈ పథకం లో మీరు దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
Sukanya Samriddhi Yojana అకౌంట్లో భాగంగా ఒక ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా రూ.1.50 లక్షల వరకు కట్టొచ్చు. కనీస మొత్తం ఎంత అనేది మీ ఇష్టం. ప్రతి నెలకు రూ.5 వేల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీకి రూ.25 లక్షల వరకు రావడం జరుగుతుంది….ఇక సంవత్సరానికి రూ.1.50 లక్షల విధానం చూస్తే నెలకు రూ.12,500 చొప్పున కట్టాల్సి వస్తుంది. కేవలం రూ.250 తో ఈ పథకం యొక్క అకౌంట్ తెరవొచ్చు. ఈ స్కీం లో భాగంగా అకౌంట్ తెరిచిన తర్వాత 15 సంవత్సరాల పాటు డబ్బులు మీరు కట్టాల్సి ఉంటుంది. తర్వాత డబ్బులను మీరు కట్టే అవసరం లేదు. ఇక మెచ్యూరిటీ కాలం 21 సంవత్సరం. అంటే మీరు అకౌంట్లో చేరిన 21 సంవత్సరంకు మీకు మొత్తం వడ్డీతో కలిపి డబ్బులు రావడం జరుగుతుంది. 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత కొంత మొత్తం విత్డ్రా చేసుకోవచ్చు. 21 వ సంవత్సరం తర్వాత మీరు పూర్తి డబ్బులు తీసుకోవచ్చు.
ఇక 7.6 % వడ్డీ ప్రకారం.. నెలకు రూ.12,500 చొప్పున ఈ Sukanya Samriddhi Yojana అకౌంట్లో డిపాజిట్ చేస్తే.. 21వ సంవత్సరాలకు అంటే మెచ్యూరిటీ సమయానికి మీ చేతికి రూ.64 లక్షల వరకు వస్తాయి. ఈ పథకం లో మీ ఇన్వెస్ట్మెంట్ రూ.22,50,000 కాగా.. వడ్డీనే రూ.41 లక్షలకుపైగా వస్తుంది. దీంతో మొత్తం మీ అమౌంట్ రూ.64 లక్షలవుతుంది. అంటే పాప పుట్టగానే ఈ పథకంలో చేరి ప్రతి నెలకు రూ.12,500 చొప్పున కడుతూ ఉంటే.. ఆ పాపకు 21 సంవత్సరాలకు వచ్చేసరికి చేతికి రూ.64 లక్షల వరకు వస్తాయి . ఇక ఈ పథకంలో ఇపుడున్న వడ్డీ రేటు 8 శాతంతో చూస్తే ఇది ఇంకా ఎక్కువే ఉండొచ్చు. భవిష్యత్తులోనూ ఈ వడ్డీ రేట్లు పెరిగే అవకాశాలు కూడా లేకపోలేదు. దానితో మెచ్యూరిటీ మొత్తం కూడా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
ఇక Sukanya Samriddhi Yojana పథకంలో ఇన్వెస్ట్ చేస్తే పన్ను మినహాయింపు లాభాలు కూడా పొందొచ్చు. ఇన్కంటాక్స్ చట్టంలోని సెక్షన్ 80(C) కింద ఒక ఆర్థిక ఏడాదిలో రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు ను మీరు పొందొచ్చు. ఇక ఉద్యోగం చేసే వారికి ఈ పథకం సౌకర్యంగా ఉంటుందని చెప్పొచ్చు.
Pingback: Unified Pension Scheme : ఉద్యోగదారుల కోసం కొత్త పెన్షన్ స్కీం…రిటైర్మెంట్ తర్వాత రూ.10,000 /- నేరుగా మీ ఖాతాలో జమ…! T