Varalakshmi Vratam 2024 : అసలు శ్రావణమాసం లోనే వరలక్ష్మీ వ్రతాన్ని ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా…పురాణాలు ఎం చెప్తున్నాయి..వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకునే విధానం…!

Varalakshmi Vratam 2024 : అసలు శ్రావణమాసం లోనే వరలక్ష్మీ వ్రతాన్ని ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా…పురాణాలు ఎం చెప్తున్నాయి..వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకునే విధానం…!

Varalakshmi Vratam 2024 : మన హిందూవుల పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. అయితే ఈ మాసంలోనే ఈ వ్రతాన్ని ఎందుకు జరుపుకుంటారు అన్న సంగతి మీకు తెలుసా ?..వరలక్ష్మి పూజ చేయడం వల్ల వచ్చే ఫలితాలేంటి అనే వివరాలను ఇప్పుడు మనము తెలుసుకుందాం…

Varalakshmi Vratam 2024 : హిందూ మత విశ్వాసాల ప్రకారం, వరాలిచ్చే తల్లి వరలక్ష్మీ అంటారు. అష్టలక్ష్ముల్లో వరలక్ష్మీ దేవికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. వివాహిత మహిళలు నిత్య సుమంగళిగా ఉండేందుకు వరలక్ష్మీ వత్రం తప్పనిసరిగా ఆచరిస్తారు.మన భారత దేశంలో తెలుగు పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం శ్రావణ మాసం మరియు శుక్ల పక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే రెండో శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతన్ని జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 16 ఆగస్టు 2024న శుక్రవారం నాడు ఈ పండుగ జరుపుకోనున్నారు.

Varalakshmi Vratam 2024 ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారద వరలక్ష్మీదేవి అనుగ్రహం తమపై శాశ్వతంగా ఉంటుందని చాలా మంది నమ్ముతారు.సిరి సంపదలకు దేవత అయిన వరలక్ష్మీదేవిని తమ ఇంట్లో ప్రసన్నం చేసుకోవడానికి, తమ కుటుంబంలో సంతోషం మరియు శ్రేయస్సు కోసం, ఈ వ్రతాన్ని ప్రతి ఒక హిందువులు తమకు ఉన్నదాంట్లో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఈ వరలక్ష్మీ వ్రతాన్ని వివిధ నగరల్లో వివిధ రకాలుగా చేస్తారు.. ఈ నేపథ్యంలో ఈ వరవ్రతం ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి..అసలు శ్రావణంలోనే ఈ వరలక్ష్మి వత్రాన్ని ఎందుకు చేసుకుంటారు ఇలా ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…


స్కాంద పురాణాల ప్రకారం పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రతం యొక్క విశిష్టత గురించి పార్వతీదేవికి వివరించడం జరిగింది. పార్వతి దేవి ఆ బోలా శంకరుడిని ఇలా అదుగుతుంది-స్వామి లోకంలో స్త్రీలు సకల ఐశ్వర్యాలనూ, పుత్రపౌత్రాదులనూ పొందేందుకు వీలుగా ఏదైనా ఓ వ్రతాన్ని సూచించమని కోరుతుంది.

అప్పుడు శంకరుడు, గిరిజకు వరలక్ష్మీ వ్రత మహాత్మ్యాన్ని వివరించాడని పురాణాల ప్రకారం చెబుతారు. అదే సందర్భంలో శివుడు ఆమెకు చారుమతీదేవి జీవిత కథనం గురించి తెలియజేశాడంటారు. భర్త పట్ల ప్రేమని, అత్తమామల పట్ల గౌరవాన్నీ ప్రకటిస్తూ చారుమతి గొప్ప ఇల్లాలుగా తన బాధ్యతల్ని అన్ని క్రమంగా నిర్వహిస్తూ ఉండేది. మహాలక్ష్మీదేవి పట్ల ఎంతో భక్తిశ్రద్ధలు కలిగిన చారుమతి, అమ్మవార్ని త్రికరణ శుద్ధిగా పూజిస్తుండేది.

ఆ మహా పతివ్రత అయినా చారుమతి పట్ల వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి, స్వప్నంలో చారుమతికి సాక్షాత్కరిస్తుంది. కలలో చారుమతితో ”శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలన్నీ ఇస్తానని” ఆమెకు వరలక్ష్మి దేవి అభయమిస్తుంది.అప్పుడు వరలక్ష్మి ఆదేశానుసారం, చారుమతి వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త సిరి సంపదల్ని అందుకుందని ఈశ్వరుడు, పార్వతి దేవికి తెలియజేశాడు అని పురాణ కథనం. దాంతో గౌరీదేవి కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి, వరలక్ష్మి కృపను పొందుతుంది అని పురాణాలు చెప్తున్నాయి.

varalakshmi pooja vidhanam :వరాలిచ్చే తల్లి వరలక్ష్మి. ఈ సందర్భంగా వరలక్ష్మీ వ్రతాన్ని ఇంట్లో ఎలా జరుపుకోవాలి, పూజా విధానాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం లేదా రెండో శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. మహిళలు తాము దీర్ఘకాలం సుమంగళిగా చిరకాలం ఉండేందుకు ఈ వరలక్ష్మి వ్రతం ఆచరించడం తప్పనిసరి. అంతేకాదు,వారి ఇంట్లో సిరుల తల్లి లక్ష్మీదేవిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు లభిస్తాయని ప్రతి ఒక హిందువుల నమ్మకం.

Varalakshmi Vratham Pooja Vidhanam : మన భారతదేశం యొక్క తెలుగు క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం August 16వ తేదీన శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం జరుపుకోనున్నారు. వరాలిచ్చే వ్రతాన్నిఆచరించడానికి ఎలాంటి నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు కేవలం మనలో నిజమైన భక్తి చాలు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రత ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షలు కలిగి ఐశ్వర్యం లభిస్తాయి అని ప్రతి ఒకరు నమ్ముతారు. సకల శుభాలుకలుగుతాయి. ప్రతి మహిళా తాము దీర్ఘకాలం సుమంగళిగా ఉంటాం అని నమ్ముతు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. లక్ష్మీదేవి సంపదలనిచ్చే తల్లి. సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపదలెన్నో ఎన్నో ఉన్నాయి. ‘వర’ అంటే శ్రేష్ఠమైన అర్థం కూడా ఉంది.

పూజా సామాగ్రి..
పసుపు, కుంకుమ,
గంధం, విడిపూలు, పూల మాలలు,
తమలపాకులు, 30
వక్కలు, ఖర్జూరాలు,
అగరవత్తులు,
కర్పూరం,
చిల్లర పైసలు, తెల్లని వస్త్రం, రవిక దుస్తులు
మామిడి ఆకులు, ఐదు రకాల పండ్లు,
అమ్మవారి ఫోటో,
కలశం,
కొబ్బరి కాయలు,
పసుపు రాసిన కంకణం, ఇంటిలో తయారుచేసిన నైవేధ్యాలు.
బియ్యం, పంచామృతాలు. దీపపు కుందులు, ఒత్తులు, నెయ్యి.

గమనిక : మీకు మీ కుటుంబ సభ్యులకు మా Todayintelugu.com తరపున శ్రావణ మాస వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top