Rosemary oil : రోజ్మేరీ ఆయిల్ తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు…!

Rosemary oil : రోజ్మేరీ ఆయిల్ తో అనేక ఆరోగ్య ప్రయోజనాలు…!

ఈ మధ్య కాలంలో Rosemary oil …ఇది రోజ్మేరీ హెర్బ్ నుంచి స్టీమ్ డిస్టిలేషన్ ద్వారా నూనెని సేకరిస్తారు. రోజ్మేరీ మంచి సువాసన కలిగి ఉంటుంది.ఈ ఆయిల్ను అధికంగా చర్మ సంరక్షణలో ఎక్కువగా వాడుతుంటారు…దీన్ని మితంగా తీసుకుంటే.. ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఆయిల్ను వెల్నెస్ రొటీన్లో యాడ్ చేసుకుంటే.. మీ ఆరోగ్యానికి అద్బుతాలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజ్మేరీ ఆయిల్ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ఉపయోగాలు, మరి ఈ ఆయిల్ ని ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం…

రోజ్మేరీ ఆయిల్ డైజెస్టివ్ ఎంజైమ్ల ఉత్పత్తిని ఉతేజపరుస్తుంది, ఇది ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడానికి దోహదపడుతుంది, పోషకాల శోషణను పెంచుతుంది.

రోజ్మేరీ ఆయిల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులు మరియు వాపు వంటి లక్షణాలను తగ్గించడానికి దోహదపడుతాయి. అర్థరైటిస్ పేషెంట్స్కు రోజ్మేరీ ఆయిల్ ఉపయోగపడుతుంది. రోజ్మేరీ ఆయిల్ శరీరంలో ఇన్ఫ్లమేషన్ను నివారిస్తుంది. దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్.. డయాబెటిస్ మరియు క్యాన్సర్ వంటి తీవ్ర సమస్యల ముప్పు పెంచుతుంది.

రోజ్మేరీ ఆయిల్లోని… మెదడుకు రక్త ప్రవాహాన్ని పెంచుతాయి Rosemary oil. తద్వారా మెదడు పనితీరును ఉతేజపరుస్తాయి, జ్ఞాపకశక్తిని పెంచుతాయి.రోజ్మేరీ లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఒత్తిడిని తగ్గించి ప్రశాంతతను కలిగిస్తాయి…

ఈ ఆయిల్ను.. వేడి నీళ్లలో వేసి ఆవిరి పీలిస్తే… ఆస్తమా మరియు ముక్కు రద్దీ వంటి మొదలైన శ్వాసకోశ సమస్యలు దూరం అవుతాయి…. ఇందులోని ఎక్స్పెక్టరెంట్ లక్షణాలు శ్వాసకోశ మార్గాన్ని నయం చేస్తాయి.

రోజ్మేరీ ఆయిల్లోని యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి. ఇవి ఇన్ఫెక్షన్లు మరియు వ్యాధుల నుంచి శరీరాన్ని కాపాడతాయి.

కీళ్లు, కండరాల నొప్పిని తగ్గించడానికి.. రోజ్మేరీ ఆయిల్ ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు.. శరీరంలో వాపును నియంత్రించడానికి, కండరాల ఒత్తిడి తగ్గించడానికి దోహదపడుతాయి.

రోజ్మేరీ ఆయిల్ సువాసన.. ఒత్తిడి స్థాయిలను నియంత్రించడానికి, మానసిక స్థితిని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. దీని వాసన చూడటం వల్ల ఆందోళన తగ్గుతుంది అలాగే రిలాక్సేషన్ను ప్రోత్సహిస్తుంది.

Note : పైన ఇచ్చిన సమాచారం అంతా కూడా మీ అవగాహన కోసం మరియు అంతర్జాలంలో దొరికిన సమాచారం తీసుకోవడం జరిగింది , ఈ Rosemary oil అతిగా తీసుకునే వారు వైద్యుల సలహా తీసుకోగలరు…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top