Bigg Boss 8 Telugu డేట్ రానే వచ్చింది. మళ్ళీ అదే సెంటిమెంట్ ఫాలో అయిన స్టార్ మా

Bigg Boss 8 Telugu డేట్ రానే వచ్చింది. మళ్ళీ అదే సెంటిమెంట్ ఫాలో అయిన స్టార్ మా

తెలుగు ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న తరుణం రానేవచ్చింది, ఎట్టకేలకు Bigg Boss 8 Telugu డేట్ ను స్టార్ మా ఫిక్స్ చేసింది. గత 7 సీసన్ల నుండి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ షో కి మాములు క్రేజ్ లేదు. ఇప్పటికే కంటెస్టెంట్ లని ఎంపిక చేసిన విషయం తెలిసిందే, ఈ కంటెస్టెంట్ లలో కమెడియన్స్ , సింగర్స్ , డాన్సర్స్ , అలాగే ఇందులో ముఖ్యంగా Youtubers కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. గత చివరి సీసన్లలో నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు . ఇప్పుడు కూడా నాగార్జున నే హోస్ట్ గా కంటిన్యూ చేస్తున్నట్లు తెలుస్తుంది, ఇకపోతే కంటెస్టెంట్స్ విషయంలో కూడా ఈ 8 సీజన్లో చాలా మంది తెలిసిన వాళ్ళే ఉండడం విశేషం .

Bigg Boss 8 Telugu కంటెస్టెంట్స్ వివరాలు

గత సీజన్లో (7 ) పల్లవి ప్రశాంత్ గెలుపొందడం అందరికి తెలిసిన విషయమే, రన్నర్ గా అమరదీప్ ని ప్రకటించారు, పల్లవి ప్రశాంత్ గెలుపొందిన తరువాత బయటికి వచ్చి విజయయాత్ర చేసుకునే సమయంలో పెద్ద గొడవలు జరిగి పల్లవి ప్రశాంత్ జైలు వరకు వెళ్లి రావడం జరిగింది. మరి ఈ సారి అలంటి గొడవలు ఎం జరగకుండా స్టార్ మా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తుంది , ఇకపోతే కంటెస్టెంట్స్ విషయానికి వస్తే ఇప్పటికీ చాలా మంది పేర్లు బయటకి వచ్చాయి ఇందులో చాలామంది కమెడియన్స్, సింగర్స్ , youtubers అలాగే డాన్సర్స్ కూడా ఉన్నారు.

Bigg Boss 8 Telugu Launching Date


ఇకపోతే స్టార్ మా సెప్టెంబర్ సెంటిమెంట్ ను ఈ సారి కూడా ఫాలో అవుతున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే గత చాలా సీసన్ లను సెప్టెంబర్ లోనే ప్రారంభించింది , మరి ఈ సారి కూడా అదే ఫాలో అయింది, అలాగే లాంచింగ్ డేట్ ను సెప్టెంబర్ 1 వ తేదీ ఆదివారం రోజున 7 గంటలకు ఫిక్స్ చేసింది, దీంతో ఫాన్స్ కి పండగే అని చెప్పవచ్చు. గత సీసన్ లకంటే మరి ఈ సీసన్ ఎంతవరకు అలరిస్తుందో చూడాలి.

Read More articles

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top