Urad Dal in Telugu : ఈ పప్పును ఎక్కువగా వాడుతున్నారా…అయితే, ఈ అనారోగ్య సమస్యలు రావచ్చు.

Urad Dal in Telugu : ఈ పప్పును ఎక్కువగా వాడుతున్నారా…అయితే, ఈ అనారోగ్య సమస్యలు రావచ్చు.

Urad Dal in Telugu మన దేశంలో మినప్పప్పు వాడకం ఎక్కువే. అందుకే దాని ధర కూడా విపరీతంగా పెరిగిపోయింది.ఈ మినప్పప్పును తినడం ఆరోగ్యానికి ఎంత మంచితో, అంత ప్రమాదకరం కూడా ఎందుకో, ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.

మినప్పప్పును కాయ ధాన్యాల్లో (Black Urad Dal) ఒకటిగా చెబుతారు. నల్ల పొట్టుతో ఉండేటువంటి ఈ గింజలు చాలా టేస్టీ గా ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మిన్నప్పప్పులో ప్రోటీన్ అధికం. అలాగే, కార్బోహైడ్రేట్స్, Vitamin B6, ఇనుము, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియంలు ఉంటాయి. అందువల్ల ఇవి హృదయానికి , నరాల వ్యవస్థకూ మేలు చేస్తాయి.

ఒక అధ్యయనం ప్రకారం.నల్లటి పొట్టు ఉండే, మినప్పప్పు శారికిరానికి చలవ చేస్తుంది. ఆయుర్వేదంలో,తలనొప్పి తగ్గడానికీ, జ్వరం, వేడి తగ్గడానికీ, పక్షవాతం (paralysis) తగ్గడానికీ, కీళ్ల నొప్పులు మరియు అల్సర్లు తగ్గడానికీ వాడుతారు. అయితే,ఇవే గింజలు ఎక్కువగా తింటే కూడా ఆరోగ్యానికి ప్రమాదం.

హెల్త్ సైట్ ప్రకారం. మిన్నప్పప్పు ఎక్కువగా తినడం వలన రక్తంలో యూరిక్ యాసిడ్ ఎక్కువవుతుంది. ఫలితంగా కిడ్నీల్లో రాళ్లు ఎర్పడతాయి. అందువల్ల ముందే, కిడ్నీలో రాళ్లు ఉన్నవారు మిన్నప్పప్పు వాడకపోవడమే, ఉత్తమం.

Urad Dal in Telugu ట్యూమర్ (గడ్డలు) సమస్యలు ఉన్నవారు కూడా మినప్పప్పును తినకూడదు. ఆర్థరైటిస్ ఎక్కువగా ఉన్నవారు కూడా ఈ పప్పుకు దూరంగా ఉండడం మంచిది. అంతేకాకుండా,మినప్పప్పు ఎక్కువగా తింటే,గాల్ బ్లాడర్‌లో కూడా రాళ్లు ఏర్పడతాయి. అందుకు సంబంధించిన మెడిసిన్ వాడేవారు కూడా మిన్నప్పప్పు తినకపోవడం మేలు.

మినప్పప్పు ఎక్కువగా తింటే,తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. మలబద్ధకం సమస్య కూడా తలెత్తుతుంది. కాబట్టి కడుపులో గ్యాస్, మలబద్ధకం, జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు మినప్పప్పు తినకుండా,డాక్టర్ సలహాలను పాటించడం మేలు.

గమనిక : ఈ పై సమాచారాన్ని అంతర్జాలం నుండి మరియు నిపుణుల సలహా మేరకు అందించడం జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే, మీరు అతిగా తినాలి అని అనుకునే వారు వైద్యుల సలహా తీసుకోవడమే,ఉత్తమమైన మార్గం. అని గమనించగలరు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top