Bottle Gourd in Telugu : సొరకాయ వల్ల కలిగే,ఉపయోగాలు తెలిస్తే మాత్రం దాన్ని అస్సలు వదిలిపెట్టారు.Sorakaya in Telugu.

Bottle Gourd in Telugu : సొరకాయ వల్ల కలిగే,ఉపయోగాలు తెలిస్తే మాత్రం దాన్ని అస్సలు వదిలిపెట్టారు. Sorakaya in Telugu.

Bottle Gourd in Telugu : కూరగాయాల్లో సొరకాయకు ఉన్న ప్రత్యేకతనే వేరు. ఎందుకంటే సొరకాయను ఎలాంటి రసాయనాలు లేకుండా పండిస్తారు. తెలంగాణలో దీన్ని ఆనిగపుకాయ అని కూడా అంటారు. సొరకాయ కుకుర్ బిటాన్సి ఫ్యామిలీకి చెందినదని.దీని యొక్క శాస్త్రీయ నామం Lazenaria vulgaris అంటారు. సొరకాయ పీచు, నీటితో నిండిన కూరగాయ. ఇందులో ఐరన్, పొటాషియంతోపాటు విటమిన్లు కూడా ఉంటాయి.

Sorakaya in Telugu. మాంసాహార పదార్థాల్లోనే కాదు, కూరగాయల్లో కూడా మంచి పోషకాలు ఉంటాయి. కూరగాయలు తినడం వల్ల శరీరం దృఢంగా, ఆరోగ్యంగా ఉంటుంది. మనం రోజూ తినే , కూరగాయల్లో సొరకాయ కూడా ఒకటి. సొరకాయలో వాటర్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది. సొరకాయను కేవలం కూరలాగానే కాకుండా, Snacks లా కూడా తయారు చేసుకోవచ్చు. సొరకాయలో బోలెడన్ని పోషకాలు ఉన్నాయి. అందులోనూ వేసవిలో సొరకాయ తినడం వల్ల చాలా మంచిది. శరీరానికి చాలా చలువ చేస్తుంది. ఈ సొరకాయ తినడం వల్ల మనకు ఇంకా ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

Bottle Gourd in Telugu : వెయిట్ తగ్గాలి అనుకునే వారు సొరకాయను మీ దిన చర్యలో యాడ్ చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా బరువు తగ్గొచ్చు. ఇందులో ఫైబర్తో పాటు నీటి శాతం కూడా అధికంగా ఉంటుంది. కనుక సొరకాయ కొంచెంగా తిన్నా, సరే కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. అంతే కాకుండా ఆకలి కూడా పెద్దగా వేయదు.

Bottle Gourd in Telugu : సొరకాయ తినడం వల్ల జీర్ణ క్రియకు చాలా మంచిది. ఇందులో ఉండే ఫైబర్ ఉండడం వలన మనం తీసుకున్న ఆహారాన్ని సులభంగా జీర్ణం చేస్తుంది. అంతే కాకుండా మల బద్ధకం సమస్య కూడా తలెత్తదు. ఇవే కాకుండా కడుపు ఉబ్బరం , gas , అజీర్తి వంటి సమస్యలు కూడా నయం అవుతాయి.

సొరకాయ తినడం వల్ల డయాబెటీస్ను అదుపు చేయవచ్చు. ఇందులో మనకు పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ఖనిజాలు మధుమేహాన్ని నియంత్రించడంలో బాగా సహాయ పడతాయి. ఇది తినడం వల్ల రక్తంలో చక్కర లెవల్స్ అనేవి పెరగకుండా ఉంటాయి.

సొరకాయ తినడం వల్ల కాలేయానికి కూడా చాలా మంచిది. కాలేయము ఆరోగ్యంగా ఉంటేనే, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. సొరకాయలో ఉండే ఈ యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని శుభ్ర పరచడానికే కాకుండా, కాలేయ వ్యాధులను నివారించడానికి కూడా సహాయ పడతాయి. అంతే కాకుండా ఇందులో ఉండే పొటాషియం Blood pressure ను నియంత్రించడానికి కూడా ఉపయోగ పడుతుంది.

సొరకాయ తినడం వల్ల చర్మం, జుట్టుకు కూడా చాలా మంచిది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉండేలా చేస్తుంది. మొటిమలు, మచ్చలు నివారించడానికి కూడా హెల్ప్ చేస్తుంది.

Bottle Gourd in Telugu : శరీరంలో వృద్ధి చెందిన విషపూరిత వ్యర్థాలను తొలగించడంలో సొరకాయ సమర్థవంతంగా పని చేస్తుంది. ఇందులో సహజసిద్ధంగా మత్తు కలిగించేటువంటి స్వభావం వల్ల మానసిక ఒత్తిడి తగ్గించడం తో పాటు, త్వరగా నిద్రపోతారు. సొరకాయను రసంలాగా చేసుకొని తాగడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చట. జుట్టు తెల్లబడిన యంగ్ యువతీ,యువకులు రోజూ ఒక గ్లాసు రసం తాగితే జుట్టు నల్లబడే అవకాశం కూడా ఉందట.

ఈ సొరకాయ తినడానికే కాకుకండా, ఏది ఎండిన తర్వాత ఈత కొత్తదాబీకి సొరకాయ బుర్ర ఉపయోగపడుతుంది. పూర్వకాలంలో సొరకాయలోని నీళ్లు పోసుకుని తాగేవారట. సొరకాయ శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. కాబట్టి మన శరీరంలోని ఎక్కువ వేడిని బయటకు పంపి, మనకు మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. High blood pressure ఉన్న వాళ్లు ఒకరోజు సొరకాయ తిని , మరుసటి రోజు BP ని చెక్ చేసుకుంటే ఫలితం కళ్ల ముందు కనిపించి తీరుతుందట.

గమనిక : ఈ పైన తెలిపినటువంటి సమాచారం ఇంటర్నెట్ నుండి మరియు నిపుణుల సలహా మేరకు అందించడం జరిగింది. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.దీనిని Todayintelugu.com ధ్రువీకరించలేదు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top