Saraswati Plant in Telugu : ఈ చెట్టు ఆకు రోజుకు ఒక్కటి తిన్నా సరే, మీ జ్ఞాపకశక్తి ఎంతో పెరుగుతుంది.
Saraswati Plant in Telugu మనిషికి ఎక్కువగా ఉపయోగ పడే మొక్కలలో ఈ సరస్వతీ మొక్క కూడా ఒకటి. ఈ మొక్కలో అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరి ఇంట్ల సరస్వతీ మొక్కను పెంచుకోవడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.రోజుకు ఒక్క ఆకు తిన్నా కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.
ఈ సృష్టిలో ఎన్నో రకాల మొక్కలు ఉన్నాయి. ప్రతిరోజూ చాలా మొక్కలను చూస్తూ ఉంటాం. ప్రతీ ఒక్కటి ఉపయోగకరమైనదే. కానీ వాటి విలువ గురించి మనకు తెలీదు. పూర్వం ఆయుర్వేదంలో అనేక రకాల ఔషధ తయారీలో వివిధ రకాల మొక్కలను ఉయోగించేవారు. కానీ కొన్ని రకాల మొక్కలను మాత్రమే మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. వాటిల్లో సరస్వతి మొక్క కూడా ఒకటి. ఈ మొక్కలో కూడా ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి.
Saraswati Plant in Telugu Ayurvedam లో కూడా కొన్ని రకాల చికిత్సలకు ఈ సరస్వతీ మొక్కలను ఉపయోగిస్తారు. ఈ మొక్క ఆకుల్లో ఎన్నో రకాల పోషకాలు కూడా నిండి ఉంటాయి. ప్రతి రోజూ ఒక్క ఆకు తిన్నా కూడా అనేక ఉపయోగాలు ఉన్నాయి. Especially జ్ఞాపకశక్తిని పెంచడంలో ఈ మొక్క ఆకులు ఎంతో బాగా సహాయ పడతాయి. అంతే కాకుండా నత్తిగా మాట్లాడేవారు ఈ ఆకులు తింటే, నత్తి తగ్గి,చక్కగా స్పష్టంగా మాట్లాడతారు. మతి మరుపు కూడా తగ్గుతుంది. చదువు మంచిగా వస్తుందని పిల్లలకు ఈ మొక్క యొక్క ఆకులను పెడుతూ ఉంటారు. మరి ఈ ఆకులు తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.
మాటలు వస్తాయి :
కొంత మంది చిన్న పిల్లలు సరిగా మాట్లాడలేరు. అలాంటి పిల్లలకు ఈ ఆకులను పౌడర్ లా చేసి పెట్టినా లేదా ఆకుల రసాన్ని పట్టించినా లేదంటే, ఆకులు తిన్నా మంచి రిజల్ట్ ఉంటుంది. మాటలు త్వరగా వస్తాయి. సరస్వతీ లేహ్యాన్ని అందించినా పిల్లలకు చాలా మంచిది. బుద్ధి బలం కూడా పెరుగుతుంది.
మెదడు యాక్టీవ్ :
Saraswati Plant in Telugu సరస్వతీ ఆకులు తినడం వల్ల మెదడు పనితీరు మెరుగు పడుతుంది. బ్రెయిన్ సరిగా పని చేయని వారికి ఈ సరస్వతీ ఆకులను తినిపిస్తే, ఎంతో బాగా పని చేస్తుంది. ఈ ఆకులను మెమరీ బూస్టర్గా కూడా వాడతారు. మతిమరుపు కూడా తగ్గి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఈ ఆకులు తినడం వల్ల మెదడు, నరాలు మంచిగా పని చేస్తాయి.
నత్తి తగ్గుతుంది:
చాలా మంది పిల్లలు పెద్దగా అయిన తర్వాత కూడా మాటలు నత్తిగా మాట్లాడతారు. అలాంటి వారు ఈ ఆకులను ఎండబెట్టి పొడిచేసి లేదా ఆకుల రసం, ఆకులను తినిపించినా నత్తి పోయి,సరిగ్గా మాట్లాడతారు.
తెలివి పెరుగుతుంది :
చిన్న పిల్లలకు చక్కగా ఆకులను తినిపించినా లేదా రసం తగ్గించినా , లేహ్యం తినిపించినా వీరిలో మంచిగా తెలివి పెరుగుతుంది. చిన్నప్పటి నుంచే చక్కగా పని చేస్తారు. చదువుల్లో కూడా ముందు ఉంటారు.
రక్తాన్ని శుద్ధి చేస్తుంది :
సరస్వతీ ఆకులు తిన్నా, రసాన్ని పట్టించినా రక్తం శుద్ధి అవుతుంది. బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వంటివి త్వరగా ఎటాక్ కాకుండా ఉంటాయి. ఒకవేళ సమస్య ఉన్నా తగ్గుతుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది.
గమనిక : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్య పరంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, వైద్య నిపుణుల్ని సంప్రదించడం ఉత్తమం.